Last Updated:
YS Jagan Press Meet: రాష్ట్రంలో నిర్వహించిన ‘డీఎస్సీ-2025’ మెగా డీఎస్సీ కాదని, నిరుద్యోగులను, నిజాయితీపరులైన అభ్యర్థులను దగా చేసిన భారీ కుంభకోణమని ప్రతిపక్షం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.
గత రెండు వారాలుగా ఈ స్కామ్‌కు సంబంధించి విస్తుపోయే ఆధారాలు, సాక్ష్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని, చంద్రబాబు స్కాంల చరిత్రలో ఇదొక ‘ఆణిముత్యం’లా నిలుస్తుందని విమర్శించారు. కుంభకోణాన్ని తవ్వేకొద్దీ దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగు చూస్తున్నందునే చంద్రబాబుకు బీపీ పెరుగుతోందని, అందుకే ఆధారాలు బయటపెట్టే వారిపై కేసులు పెడతామని, జైల్లో వేస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. జర్నలిస్టులపై సైతం కేసులు బనాయిస్తూ, సోషల్ మీడియాలో ప్రశ్నించే వారి ఖాతాలను బ్లాక్ చేస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

