వాట్సాప్ యూజర్లకు అలర్ట్. ఆండ్రాయిడ్ 5.0 లేదా 5.1 ఉన్న ఫోన్లలో ఇకపై వాట్సాప్ చాట్స్ చూడటం, మెసేజ్‌లు పంపడం సాధ్యం కాదు. మీ ఫోన్‌కు అవసరమైన కనీస ఆండ్రాయిడ్ వెర్షన్ ఏంటో, మీ ఫోన్ ప్రభావితమైందో లేదో తెలుసుకోవడం ముఖ్యం. న్యూస్18 కథనం ప్రకారం వాట్సాప్ అధికారికంగా ఆండ్రాయిడ్ 5.0, ఆండ్రాయిడ్ 5.1 వెర్షన్లకు సపోర్ట్‌ను నిలిపివేసింది. 2026 సెప్టెంబర్ 8 నుంచి వాట్సాప్ మెసెంజర్, వాట్సాప్ బిజినెస్ రెండింటినీ కొనసాగించి వాడాలంటే కనీసం ఆండ్రాయిడ్ 6.0 (మార్ష్‌మల్లో) లేదా అంతకంటే కొత్త వెర్షన్ ఉండాలి. మీ ఫోన్ ఆండ్రాయిడ్ 5.x లేదా అంతకంటే పాత వెర్షన్లో ఉండి, దాన్ని కొత్త వెర్షన్‌కు అప్డేట్ చేసే అవకాశం లేకపోతే ఇక వాట్సాప్‌లో మీ చాట్స్‌ను యాక్సెస్ చేయలేరు. మెసేజ్‌లు కూడా పంపలేరు. (ప్రతీకాత్మక చిత్రం)

