ఈ ప్రాజెక్టులో భాగంగా పలు కీలక పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న లైన్ లూప్‌లను తొలగించి, పాయింట్ జోన్లను కొత్తగా ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఉన్న ఆరు ప్లాట్‌ఫారాలను వెడల్పు చేస్తారు. మరో ఆరు కొత్త ప్లాట్‌ఫారాలను నిర్మిస్తారు. వీటిలో ప్రయాణికులకు అవసరమైన ఆధునిక సౌకర్యాలు కల్పిస్తారు. అదనంగా ఆరు కొత్త రైల్వే లైన్లు నిర్మిస్తారు. వెడల్పు చేసిన ప్లాట్‌ఫారాలపై ప్రయాణికుల సౌకర్యం కోసం ర్యాంపులు, లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తారు. దీంతో వృద్ధులు, దివ్యాంగులు, ఇతర ప్రయాణికులు సులభంగా రాకపోకలు సాగించగలరు. (image: Wikimedia)

