ప్రభన్యూస్

Pulmonary Embolism: కాళ్లలో పుట్టి ఊపిరితిత్తులను ఆపేసే సైలెంట్ ఎటాక్.. ఈ చిన్న తప్పులు చేస్తే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే జాగ్రత్త! | లైఫ్ స్టైల్


Last Updated:

గంటల తరబడి ఒకేచోట కూర్చుని పనిచేస్తున్నారా? అయితే ఈ సైలెంట్ కిల్లర్ వల్ల మీ ప్రాణాలకే ముప్పు రావొచ్చు.

+

News18

News18

శ్వాస వ్యవస్థకు మూలాధారమైన ఊపిరితిత్తులు ప్రాణవాయువును శరీరమంతా సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఒక్కోసారి వీటిలో రక్తం గడ్డకట్టి ప్రాణాలకే ముప్పు వాటిల్లే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి తలెత్తుతుంది. వైద్య పరిభాషలో దీనినే ‘పల్మనరీ ఎంబాలిజం’ అంటారు. సాధారణంగా కాళ్లలోని లోతైన సిరల్లో పుట్టిన రక్తపు గడ్డలు ప్రవాహంలో కలిసిపోయి నేరుగా ఊపిరితిత్తుల ధమనుల్లోకి చేరుకుంటాయి. దీనివల్ల ఆక్సిజన్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు గుండె పనితీరు కష్టతరంగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

వరంగల్ నగరంలోని ప్రభుత్వ టీబీ, ఛాతీ ఆసుపత్రి సూపరింటెండెంట్, సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవి ఈ ప్రాణాంతక వ్యాధికి గల ప్రధాన కారణాలను వివరించారు. ఎంబాలిజం తీవ్రత అనేది గడ్డ సైజు, అది కేంద్రీకృతమైన ప్రదేశంపై ఆధారపడి ఉంటుంది. చిన్న గడ్డలైతే సాధారణ ఇబ్బందులు వస్తాయి. పెద్దవైతే మాత్రం శ్వాస సమస్యలు, ఛాతీనొప్పితో పాటు ఆకస్మిక మరణం సంభవించే ప్రమాదం పొంచి ఉంది. ఒకే దగ్గర కదలకుండా గంటల తరబడి కూర్చుని పనిచేయడం, ఎక్కువ కాలం మంచానికే పరిమితం కావడం వల్ల రక్తం పేరుకుపోయి సులభంగా గడ్డకడుతుంది. కాళ్లు, మోకాళ్లకు సంబంధించిన సర్జరీలు జరిగినప్పుడు సిరలకు గాయాలు కావడం కూడా దీనికి ప్రధాన కారణమే.

ఇది కూడా చదవండి: South Central Railway: దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్.. ఈ రూట్‌లో దీపావళి స్పెషల్ ట్రైన్స్!

హార్మోన్ థెరపీ, గర్భనిరోధక మాత్రలు వాడటం, క్యాన్సర్, గుండె వైఫల్యం లాంటి సమస్యలున్న వారిలో రక్త ప్రసరణ మందగించి గడ్డలు ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వంశపారంపర్యంగా వచ్చే జన్యుపరమైన లోపాలు, అధిక బరువు, ధూమపానం లాంటి అలవాట్లు ఈ ముప్పును మరింత పెంచుతాయి. పల్మనరీ ఎంబాలిజం బారిన పడినప్పుడు లక్షణాలు అకస్మాత్తుగా బయటపడతాయి. ముఖ్యంగా అకారణంగా ఊపిరి ఆడకపోవడం, ఆయాసం రావడం లాంటివి కనిపిస్తాయి. శ్వాస తీసుకుంటున్నప్పుడు, దగ్గుతున్నప్పుడు ఛాతీలో తీవ్రమైన నొప్పి వస్తుంది. ఈ నొప్పి కొన్నిసార్లు అచ్చం గుండెపోటును తలపిస్తుంది.

ఇది కూడా చదవండి: తాతల కాలం నాటి అరుదైన ఆచారం.. నెమలి ఈకలతో తయారయ్యే ఈ అద్భుతమైన టోపీలు మీరెప్పుడైనా చూశారా? 

మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గడం వల్ల తరచుగా తల తిరగడం, మైకం రావడం జరుగుతుంది. రక్తంలో ప్రాణవాయువు స్థాయిలు పడిపోవడంతో గుండె విపరీతంగా వేగంగా కొట్టుకుంటుంది. దగ్గుతో పాటు కఫంలో రక్తం పడటం, హఠాత్తుగా ఆకస్మిక బలహీనత ఆవహించడం, స్పృహ కోల్పోవడం, విపరీతంగా చెమటలు పట్టడం లాంటి ప్రమాదకర సంకేతాలు కనిపిస్తాయి. ఏ కారణం లేకుండానే తీవ్రమైన ఆందోళన, భయం కలగడం కూడా వ్యాధి లక్షణమే. ఇలాంటి సూచనలు ఏమాత్రం కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్యులను సంప్రదించి అత్యవసర చికిత్స తీసుకోవాలి. లేకుంటే క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలిసే ముప్పు ఉంది.

పల్మనరీ ఎంబాలిజం రాకుండా అడ్డుకోవాలంటే రక్తం గడ్డకట్టకుండా చూసుకోవడమే ఏకైక మార్గం. కంప్యూటర్ల ముందు గంటల తరబడి పనిచేసే వారు ప్రతి అరగంటకోసారి లేచి కాసేపు అటూఇటూ నడవాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కాళ్లను కదిలిస్తూ వ్యాయామం ఇవ్వాలి. సర్జరీలు జరిగిన వారు వైద్యుల సలహాతో సాధ్యమైనంత త్వరగా నడక ప్రారంభించాలి. పొగాకు వినియోగానికి శాశ్వతంగా దూరంగా ఉండాలి. బరువును అదుపులో ఉంచుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా రోజుకు సరిపడా నీళ్లు తాగాలి. ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, ఫైబర్, విటమిన్-ఈ పుష్కలంగా లభించే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 October 2026, 1:39 pm Digital Edition : Prabhanews
Pulmonary Embolism: కాళ్లలో పుట్టి ఊపిరితిత్తులను ఆపేసే సైలెంట్ ఎటాక్.. ఈ చిన్న తప్పులు చేస్తే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే జాగ్రత్త! | లైఫ్ స్టైల్

Last Updated:Oct 29, 2026 1:33 PM ISTగంటల తరబడి ఒకేచోట కూర్చుని పనిచేస్తున్నారా? అయితే ఈ సైలెంట్ కిల్లర్ వల్ల మీ ప్రాణాలకే ముప్పు రావొచ్చు. +
News18శ్వాస వ్యవస్థకు మూలాధారమైన ఊపిరితిత్తులు ప్రాణవాయువును శరీరమంతా సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఒక్కోసారి వీటిలో రక్తం గడ్డకట్టి ప్రాణాలకే ముప్పు వాటిల్లే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి తలెత్తుతుంది. వైద్య పరిభాషలో దీనినే 'పల్మనరీ ఎంబాలిజం' అంటారు. సాధారణంగా కాళ్లలోని లోతైన సిరల్లో పుట్టిన రక్తపు గడ్డలు ప్రవాహంలో కలిసిపోయి నేరుగా ఊపిరితిత్తుల ధమనుల్లోకి చేరుకుంటాయి. దీనివల్ల ఆక్సిజన్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు గుండె పనితీరు కష్టతరంగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.వరంగల్ నగరంలోని ప్రభుత్వ టీబీ, ఛాతీ ఆసుపత్రి సూపరింటెండెంట్, సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవి ఈ ప్రాణాంతక వ్యాధికి గల ప్రధాన కారణాలను వివరించారు. ఎంబాలిజం తీవ్రత అనేది గడ్డ సైజు, అది కేంద్రీకృతమైన ప్రదేశంపై ఆధారపడి ఉంటుంది. చిన్న గడ్డలైతే సాధారణ ఇబ్బందులు వస్తాయి. పెద్దవైతే మాత్రం శ్వాస సమస్యలు, ఛాతీనొప్పితో పాటు ఆకస్మిక మరణం సంభవించే ప్రమాదం పొంచి ఉంది. ఒకే దగ్గర కదలకుండా గంటల తరబడి కూర్చుని పనిచేయడం, ఎక్కువ కాలం మంచానికే పరిమితం కావడం వల్ల రక్తం పేరుకుపోయి సులభంగా గడ్డకడుతుంది. కాళ్లు, మోకాళ్లకు సంబంధించిన సర్జరీలు జరిగినప్పుడు సిరలకు గాయాలు కావడం కూడా దీనికి ప్రధాన కారణమే.ఇది కూడా చదవండి: South Central Railway: దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్.. ఈ రూట్‌లో దీపావళి స్పెషల్ ట్రైన్స్!హార్మోన్ థెరపీ, గర్భనిరోధక మాత్రలు వాడటం, క్యాన్సర్, గుండె వైఫల్యం లాంటి సమస్యలున్న వారిలో రక్త ప్రసరణ మందగించి గడ్డలు ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వంశపారంపర్యంగా వచ్చే జన్యుపరమైన లోపాలు, అధిక బరువు, ధూమపానం లాంటి అలవాట్లు ఈ ముప్పును మరింత పెంచుతాయి. పల్మనరీ ఎంబాలిజం బారిన పడినప్పుడు లక్షణాలు అకస్మాత్తుగా బయటపడతాయి. ముఖ్యంగా అకారణంగా ఊపిరి ఆడకపోవడం, ఆయాసం రావడం లాంటివి కనిపిస్తాయి. శ్వాస తీసుకుంటున్నప్పుడు, దగ్గుతున్నప్పుడు ఛాతీలో తీవ్రమైన నొప్పి వస్తుంది. ఈ నొప్పి కొన్నిసార్లు అచ్చం గుండెపోటును తలపిస్తుంది.ఇది కూడా చదవండి: తాతల కాలం నాటి అరుదైన ఆచారం.. నెమలి ఈకలతో తయారయ్యే ఈ అద్భుతమైన టోపీలు మీరెప్పుడైనా చూశారా? మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గడం వల్ల తరచుగా తల తిరగడం, మైకం రావడం జరుగుతుంది. రక్తంలో ప్రాణవాయువు స్థాయిలు పడిపోవడంతో గుండె విపరీతంగా వేగంగా కొట్టుకుంటుంది. దగ్గుతో పాటు కఫంలో రక్తం పడటం, హఠాత్తుగా ఆకస్మిక బలహీనత ఆవహించడం, స్పృహ కోల్పోవడం, విపరీతంగా చెమటలు పట్టడం లాంటి ప్రమాదకర సంకేతాలు కనిపిస్తాయి. ఏ కారణం లేకుండానే తీవ్రమైన ఆందోళన, భయం కలగడం కూడా వ్యాధి లక్షణమే. ఇలాంటి సూచనలు ఏమాత్రం కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్యులను సంప్రదించి అత్యవసర చికిత్స తీసుకోవాలి. లేకుంటే క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలిసే ముప్పు ఉంది.పల్మనరీ ఎంబాలిజం రాకుండా అడ్డుకోవాలంటే రక్తం గడ్డకట్టకుండా చూసుకోవడమే ఏకైక మార్గం. కంప్యూటర్ల ముందు గంటల తరబడి పనిచేసే వారు ప్రతి అరగంటకోసారి లేచి కాసేపు అటూఇటూ నడవాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కాళ్లను కదిలిస్తూ వ్యాయామం ఇవ్వాలి. సర్జరీలు జరిగిన వారు వైద్యుల సలహాతో సాధ్యమైనంత త్వరగా నడక ప్రారంభించాలి. పొగాకు వినియోగానికి శాశ్వతంగా దూరంగా ఉండాలి. బరువును అదుపులో ఉంచుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా రోజుకు సరిపడా నీళ్లు తాగాలి. ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, ఫైబర్, విటమిన్-ఈ పుష్కలంగా లభించే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.మరింత చదవండి

Source link