19వ శతాబ్దంలో (1854 – 1878 మధ్య బ్రిటిష్ పాలన కాలం, రాయలసీమ ప్రాంత చారిత్రక వాస్తవ ఘటనల ఆధారంగా) ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను మొదట సెప్టెంబర్‌లో విడుదల చేయాలనుకున్నా, తాజాగా అక్టోబర్ 16, 2026కి వాయిదా వేశారు. విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న వివాహం జరిగిన తర్వాత సిల్వర్ స్క్రీన్ పైకి వస్తున్న తొలి చిత్రం కావడంతో.. ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఈ ప్రాజెక్ట్‌పై ఆకాశాన్నంటే అంచనాలు నెలకొన్నాయి.

