‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వర ప్రసాద్’ వంటి సినిమాలతో వరుసగా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన అనీల్ రావిపూడి ఇప్పుడు వెంకీ మామ, కళ్యాణ్ రామ్‌లతో మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌ను మాములుగా ఎంటర్టైన్ చేయలేదు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు ‘జనవరి 12 విడుదల’ అనే టైటిల్ లాక్ చేశారు. బావ బామ్మర్ధుల సౌజన్యంతో ఉపశీర్షికగా లాక్ చేశారు. అనీల్ రావిపూడి టైటిల్స్ ఎప్పుడూ కూడా జనాల్లోకి తొందరగా వెళ్లేలా ఉంటాయి. అదే విధంగా ఈ సినిమాకు కూడా డైరెక్ట్ రిలీజ్ డేట్‌నే టైటిల్‌గా పెట్టేశాడు. ఈ సినిమాలో కీర్తిసురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు.
Source link
Venkatesh: వెంకటేశ్, కళ్యాణ్ రామ్ కొత్త సినిమా టైటిల్ లాక్.. అదేం టైటిల్ అనీల్ బ్రో.. నీ రూటే సెపరేట్..!
