పండుగల సమయంలో సొంతూళ్లకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే రైలు టికెట్ల కోసం ఆందోళన పడాల్సిన అవసరం లేకపోవచ్చు. దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న ప్రత్యేక రైళ్లలో 10 వేలకు పైగా బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్, రాజస్థాన్‌తో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇది ఉపయోగకరమైన సమాచారం. అందుబాటులో ఉన్న బెర్తుల వివరాలను రైల్వే శాఖ వెల్లడించింది. రాబోయే పండుగల సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, 2026 అక్టోబర్, నవంబర్ నెలల్లో వివిధ ప్రాంతాలకు నడుపుతున్న ప్రత్యేక రైళ్లలో ఖాళీగా ఉన్న బెర్తుల వివరాలను దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)

