ప్రభన్యూస్

Vantara: ఏనుగు పిల్ల మాయాకు అనంత్ అంబానీ వంతార అండ.. కేరళ నుంచి ఎయిర్‌లిఫ్ట్.. జామ్‌నగర్‌లో అత్యవసర చికిత్స! |


Last Updated:

రెండు కాళ్లు విరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న 18 నెలల ఏనుగు పిల్ల ‘మాయ’ను రక్షించేందుకు అనంత్ అంబానీకి చెందిన వంతార సంస్థ ముందుకొచ్చింది. ప్రత్యేక విమానంలో కేరళ నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు తరలించి మెరుగైన వైద్యం అందిస్తోంది.

News18
News18

రెండు కాళ్లు విరిగి తీవ్ర అస్వస్థతతో ప్రాణాలతో పోరాడుతున్న 18 నెలల ఏనుగు పిల్ల ‘మాయ’ ప్రాణాలను కాపాడేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ స్థాపించిన ‘వంతార’ సంస్థ ముందుకు వచ్చింది. పుట్టిన వెంటనే తల్లి తప్పిపోవడంతో కేరళ అటవీశాఖ సంరక్షణలో పెరిగిన ఈ చిన్నారి గజరాజు ఎముకలు బలహీనపడటంతో నడవలేని స్థితికి చేరింది. కేరళ చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ జారీ చేసిన బదిలీ ఉత్తర్వులతో వంతార ప్రత్యేక వైద్య బృందం రంగంలోకి దిగింది. అత్యాధునిక లైఫ్ సపోర్ట్ సదుపాయాలతో కూడిన ప్రత్యేక విమానంలో కేరళ నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రయాణంలో వంతార పశువైద్యులతో పాటు ఇంతకాలం మాయను కనిపెట్టుకుని ఉన్న కేరళ అటవీ సంరక్షకుడు కూడా తోడుగా వెళ్లారు. పూర్తిగా కోలుకున్న తర్వాత ఏనుగు పిల్లను తిరిగి కేరళలోని అభయారణ్యానికి పంపుతారు.

పారాథైరాయిడ్ సమస్య గుర్తింపు

గతేడాది ఏప్రిల్ నెలలో మలయత్తూరు అటవీ డివిజన్‌లోని నదీ తీరంలో ఒంటరిగా పడి ఉన్న ఈ ఏనుగు పిల్లను అధికారులు రక్షించి ‘మాయ’ అని పేరు పెట్టారు. అసిస్టెంట్ ఫారెస్ట్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ బినోయ్ బాబు బృందం నిరంతరం పర్యవేక్షిస్తూ పాలు తాపి పెంచింది. అయితే నాలుగు నెలల క్రితం ఆడుకుంటూ కిందపడటంతో భుజానికి తీవ్ర గాయమైంది.

ఫిజియోథెరపీ, మందులు అందించినప్పటికీ ఎముకలు మరింత పెళుసుగా మారిపోయాయి. అక్టోబర్ నాటికి రెండు ముందు కాళ్లు విరిగిపోవడం, ఛాతీ ఇన్ఫెక్షన్ రావడంతో మాయ లేచి నిలబడలేని దుస్థితికి చేరింది. పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కుశల్ కొన్వర్ శర్మ ఆధ్వర్యంలోని నిపుణుల బృందం పరీక్షించి దీనికి పారాథైరాయిడ్ సంబంధిత సమస్య ఉండవచ్చని తేల్చింది.

జామ్‌నగర్‌లోని వంతార సంరక్షణ కేంద్రంలో మాయ కోసం ప్రత్యేక హైడ్రాలిక్ లిఫ్టింగ్ పరికరాలు, హైడ్రోథెరపీ, నిరంతర నొప్పి నివారణ చికిత్సలను సిద్ధం చేశారు. ప్రతి జీవి ప్రాణం ఎంతో విలువైందని, మాయను కాపాడటానికి శాయశక్తులా పోరాడతామని వంతార సీఈఓ వివరించారు. ఎంతో వ్యయప్రయాసలతో చేపట్టిన ఈ ఎయిర్‌లిఫ్ట్ ఆపరేషన్ వన్యప్రాణి ప్రేమికుల ప్రశంసలు అందుకుంటోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 November 2026, 6:52 pm Digital Edition : Prabhanews
Vantara: ఏనుగు పిల్ల మాయాకు అనంత్ అంబానీ వంతార అండ.. కేరళ నుంచి ఎయిర్‌లిఫ్ట్.. జామ్‌నగర్‌లో అత్యవసర చికిత్స! |

Last Updated:Nov 06, 2026 6:42 PM ISTరెండు కాళ్లు విరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న 18 నెలల ఏనుగు పిల్ల ‘మాయ’ను రక్షించేందుకు అనంత్ అంబానీకి చెందిన వంతార సంస్థ ముందుకొచ్చింది. ప్రత్యేక విమానంలో కేరళ నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు తరలించి మెరుగైన వైద్యం అందిస్తోంది.News18రెండు కాళ్లు విరిగి తీవ్ర అస్వస్థతతో ప్రాణాలతో పోరాడుతున్న 18 నెలల ఏనుగు పిల్ల ‘మాయ’ ప్రాణాలను కాపాడేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ స్థాపించిన ‘వంతార’ సంస్థ ముందుకు వచ్చింది. పుట్టిన వెంటనే తల్లి తప్పిపోవడంతో కేరళ అటవీశాఖ సంరక్షణలో పెరిగిన ఈ చిన్నారి గజరాజు ఎముకలు బలహీనపడటంతో నడవలేని స్థితికి చేరింది. కేరళ చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ జారీ చేసిన బదిలీ ఉత్తర్వులతో వంతార ప్రత్యేక వైద్య బృందం రంగంలోకి దిగింది. అత్యాధునిక లైఫ్ సపోర్ట్ సదుపాయాలతో కూడిన ప్రత్యేక విమానంలో కేరళ నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రయాణంలో వంతార పశువైద్యులతో పాటు ఇంతకాలం మాయను కనిపెట్టుకుని ఉన్న కేరళ అటవీ సంరక్షకుడు కూడా తోడుగా వెళ్లారు. పూర్తిగా కోలుకున్న తర్వాత ఏనుగు పిల్లను తిరిగి కేరళలోని అభయారణ్యానికి పంపుతారు.
BIG NEWS - Vantara is ensuring comprehensive medical care and seamless coordination for Maya’s treatment.
– Arranged a specialised airlift with life-support systems and a dedicated team of elephant veterinarians and caregivers.– Ensured Maya’s familiar caregiver and Forest Department officials accompany her, maintaining continuity of care.– A dedicated Monitoring Committee will review her progress, while Vantara will facilitate her safe return home after treatment.
https://t.co/1hCOLOwkVi— News Algebra (@NewsAlgebraIND) November 6, 2026పారాథైరాయిడ్ సమస్య గుర్తింపుగతేడాది ఏప్రిల్ నెలలో మలయత్తూరు అటవీ డివిజన్‌లోని నదీ తీరంలో ఒంటరిగా పడి ఉన్న ఈ ఏనుగు పిల్లను అధికారులు రక్షించి ‘మాయ’ అని పేరు పెట్టారు. అసిస్టెంట్ ఫారెస్ట్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ బినోయ్ బాబు బృందం నిరంతరం పర్యవేక్షిస్తూ పాలు తాపి పెంచింది. అయితే నాలుగు నెలల క్రితం ఆడుకుంటూ కిందపడటంతో భుజానికి తీవ్ర గాయమైంది.ఫిజియోథెరపీ, మందులు అందించినప్పటికీ ఎముకలు మరింత పెళుసుగా మారిపోయాయి. అక్టోబర్ నాటికి రెండు ముందు కాళ్లు విరిగిపోవడం, ఛాతీ ఇన్ఫెక్షన్ రావడంతో మాయ లేచి నిలబడలేని దుస్థితికి చేరింది. పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కుశల్ కొన్వర్ శర్మ ఆధ్వర్యంలోని నిపుణుల బృందం పరీక్షించి దీనికి పారాథైరాయిడ్ సంబంధిత సమస్య ఉండవచ్చని తేల్చింది.జామ్‌నగర్‌లోని వంతార సంరక్షణ కేంద్రంలో మాయ కోసం ప్రత్యేక హైడ్రాలిక్ లిఫ్టింగ్ పరికరాలు, హైడ్రోథెరపీ, నిరంతర నొప్పి నివారణ చికిత్సలను సిద్ధం చేశారు. ప్రతి జీవి ప్రాణం ఎంతో విలువైందని, మాయను కాపాడటానికి శాయశక్తులా పోరాడతామని వంతార సీఈఓ వివరించారు. ఎంతో వ్యయప్రయాసలతో చేపట్టిన ఈ ఎయిర్‌లిఫ్ట్ ఆపరేషన్ వన్యప్రాణి ప్రేమికుల ప్రశంసలు అందుకుంటోంది.మరింత చదవండి

Source link