పదో తరగతిలో 83 సబ్జెక్టులకు, ఇంటర్మీడియట్ సమానమైన 12వ తరగతిలో 121 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ పరీక్షల కంట్రోలర్ సంయం భరద్వాజ్ తెలిపారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ బోర్డు అధికారిక వెబ్సైట్లోనూ అందుబాటులో ఉంచారు.
పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 16న పెయింటింగ్ పేపర్‌తో మొదలై మార్చి 9వ తేదీతో ముగియనున్నాయి. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 16న ఫిజిక్స్‌తో ప్రారంభమై ఏప్రిల్ 9 వరకు కొనసాగుతాయి. విద్యార్థులు అడ్మిట్ కార్డులను పరీక్షలకు కొద్ది రోజుల ముందు తమ పాఠశాలల నుంచి పొందవచ్చు.
ఫిబ్రవరి 16 – పెయింటింగ్
ఫిబ్రవరి 17 – గణితం (స్టాండర్డ్, బేసిక్)
ఫిబ్రవరి 22 – సైన్స్
ఫిబ్రవరి 26 – ఇంగ్లీష్
ఫిబ్రవరి 27 – హిందీ, ఇతర భాషలు
మార్చి 3 – హిందీ కోర్స్ ఎ, బి
మార్చి 8 – సోషల్ సైన్స్
మార్చి 9 – ఇతర భాషలు, ఎలెక్టివ్ సబ్జెక్టులు
ఫిబ్రవరి 16 – ఫిజిక్స్
ఫిబ్రవరి 23 – అకౌంటెన్సీ
ఫిబ్రవరి 25 – జియోగ్రఫీ
ఫిబ్రవరి 27 – కెమిస్ట్రీ
మార్చి 5 – ఇంగ్లీష్ కోర్, ఇంగ్లీష్ ఎలెక్టివ్
మార్చి 9 – మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్
మార్చి 15 – ఎకనామిక్స్
మార్చి 19 – పొలిటికల్ సైన్స్
మార్చి 25 – బయాలజీ
మార్చి 27 – హిస్టరీ
మార్చి 30 – సోషియాలజీ
ఏప్రిల్ 2 – బిజినెస్ స్టడీస్
ఏప్రిల్ 9 – రిటైల్, వెబ్ అప్లికేషన్స్
