Last Updated:
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో సినిమాల కంటే స్పెషల్ సాంగ్స్‌తోనే ఆమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో సినిమాల కంటే స్పెషల్ సాంగ్స్‌తోనే ఆమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా రజినీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమాలోని ‘కావాలయ్యా’ పాటతో దేశవ్యాప్తంగా మరోసారి తన క్రేజ్‌ను చాటుకున్నారు. టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమన్నా.. మలయాళ చిత్ర పరిశ్రమలోనూ ఓ సినిమా చేశారు. అదే ‘బాంద్రా’.
మలయాళ స్టార్ హీరో దిలీప్ నటించిన ఈ సినిమాతో తమన్నా మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. సుమారు రూ.35 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం రూ.2 కోట్ల వసూళ్లకే పరిమితమైందని సమాచారం. దీంతో నిర్మాతలకు భారీ నష్టాలు ఎదురయ్యాయి. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైన ఈ సినిమాకు ఓటీటీ విడుదల విషయంలోనూ ఆలస్యం జరిగింది.
సాధారణంగా థియేటర్లలో విడుదలైన కొన్ని వారాలకే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి. కానీ ‘బాంద్రా’ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. 2023లో విడుదలైన ఈ సినిమా దాదాపు మూడేళ్ల తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నెల 13 నుంచి జీ5 వేదికగా ‘బాంద్రా’ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
థియేటర్లలో విడుదలైన సమయంలో పెద్దగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి స్పందన అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా తమన్నా అభిమానులకు ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.
‘బాంద్రా’ కథ విషయానికి వస్తే.. ఓ మాఫియా డాన్ నుంచి తప్పించుకున్న హీరోయిన్ చుట్టూ కథ తిరుగుతుంది. ఆ క్రమంలో ఆమె ఓ గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ ప్రయాణం కొనసాగుతున్న సమయంలో అనూహ్యమైన సంఘటన చోటుచేసుకుంటుంది. హీరోయిన్ అనుకోని పరిస్థితుల్లో మరణిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆమె మరణం వెనుక ఉన్న కారణాలేంటి? అనే అంశాలతో కథ ముందుకు సాగుతుంది.
యాక్షన్, ప్రేమ, మాఫియా నేపథ్యాన్ని కలిపి ఈ సినిమాను తెరకెక్కించారు. భారీ బడ్జెట్, ప్రముఖ నటీనటులు ఉన్నప్పటికీ థియేటర్లలో మాత్రం ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇప్పుడు జీ5లో స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో ఓటీటీ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. మొత్తానికి దాదాపు మూడేళ్ల నిరీక్షణ తర్వాత తమన్నా నటించిన మలయాళ చిత్రం ‘బాంద్రా’ డిజిటల్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

