ప్రభన్యూస్

US-Iran War: యుద్ధమా.. శాంతా? ట్రంప్‌తో ఖతార్ మంతనాలు.. అమెరికా ముందు ఇరాన్ 7 షరతులు! |


Last Updated:

US-Iran War: పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను చల్లార్చేందుకు అమెరికా, ఇరాన్ దేశాలు శాంతి చర్చల దిశగా కీలక అడుగులు వేస్తున్నాయి.

ఫైల్ ఫోటో
ఫైల్ ఫోటో

గల్ఫ్ దేశమైన ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య తెరవెనుక ముమ్మర దౌత్య యత్నాలు సాగుతున్నాయి. అమెరికాలో మధ్యంతర ఎన్నికల రాజకీయ పరిణామాలు, ఇరు దేశాల్లో నెలకొన్న అంతర్గత ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ సంప్రదింపులు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. యుద్ధ మేఘాలను తొలగించి, సమగ్ర శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఖతార్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీతో ఫోన్లో మాట్లాడి విస్తృతంగా చర్చించారు.

చర్చలకు ఇరాన్ సమ్మతి.. 7 కీలక షరతులు

ఇప్పటివరకు పరోక్ష చర్చలకే పరిమితమైన ఇరాన్, ఇప్పుడు అధికారికంగా ప్రత్యక్ష చర్చల్లో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేసింది. తమ అణు కార్యక్రమంపై ఖతార్ అందించిన ప్రతిపాదనలను చురుగ్గా పరిశీలిస్తున్నామని తెలిపిన టెహ్రాన్, అదే సమయంలో శాంతి చర్చలు ఫలప్రదం కావాలంటే తాము విధించిన 7 ప్రధాన డిమాండ్లను అమెరికా అంగీకరించాల్సిందేనని స్పష్టం చేసింది.

1.తమ ఓడరేవులపై విధించిన అమెరికా నావికా దిగ్బంధాన్ని తొలగించడం

2. ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడం

3. స్తంభింపజేసిన ఆస్తుల తక్షణ విడుదల

4. యుద్ధ నష్టాలకు తగిన పరిహారం చెల్లించడం

5. లెబనాన్ వంటి ఇతర ప్రాంతాలలో ఘర్షణలను శాశ్వతంగా ముగించడం

6. ఇరాన్ భూభాగాలపై దాడులను తక్షణమే నిలిపివేయడం

7. యురేనియం నిల్వలపై సడలుతున్న పట్టు

అణ్వాయుధ తయారీకి ఉపయోగపడే అత్యంత శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఇరాన్ పూర్తిగా దేశం దాటించాలని అమెరికా మొదట్లో డిమాండ్ చేసింది. అయితే, తమ దేశంలోనే అంతర్జాతీయ పరిశీలకుల పర్యవేక్షణలో దానిని నిర్వీర్యం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, దేశం దాటించే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ ప్రతిష్టంభనను తొలగించడానికి ఇరు దేశాలు కొంత వెనక్కి తగ్గుతుండటం చర్చల పురోగతికి ఊతమిస్తోంది.

చర్చలా? యుద్ధమా?.. తేల్చుకోవాల్సింది అమెరికాయే

యుద్ధం మళ్లీ రాజుకుంటే ఎవరికీ ప్రయోజనం ఉండదని, సంక్షోభాన్ని పరిష్కరించుకోవడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ స్పష్టం చేశారు. అయితే, అమెరికా మళ్లీ దాడులకు దిగితే సరిహద్దులతో సంబంధం లేకుండా ప్రతిస్పందిస్తామని ఇరాన్ సైన్యం హెచ్చరించింది. తాజా దాడుల ప్రణాళికలు ఏవీ లేవని ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు దిగివస్తున్నాయి. ఈ దౌత్య చర్చలు సఫలమైతే పశ్చిమాసియాలో శాంతి నెలకొనడంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊరట లభించనుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 November 2026, 5:01 am Digital Edition : Prabhanews
US-Iran War: యుద్ధమా.. శాంతా? ట్రంప్‌తో ఖతార్ మంతనాలు.. అమెరికా ముందు ఇరాన్ 7 షరతులు! |

Last Updated:Nov 07, 2026 4:58 AM ISTUS-Iran War: పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను చల్లార్చేందుకు అమెరికా, ఇరాన్ దేశాలు శాంతి చర్చల దిశగా కీలక అడుగులు వేస్తున్నాయి.ఫైల్ ఫోటోగల్ఫ్ దేశమైన ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య తెరవెనుక ముమ్మర దౌత్య యత్నాలు సాగుతున్నాయి. అమెరికాలో మధ్యంతర ఎన్నికల రాజకీయ పరిణామాలు, ఇరు దేశాల్లో నెలకొన్న అంతర్గత ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ సంప్రదింపులు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. యుద్ధ మేఘాలను తొలగించి, సమగ్ర శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఖతార్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీతో ఫోన్లో మాట్లాడి విస్తృతంగా చర్చించారు.చర్చలకు ఇరాన్ సమ్మతి.. 7 కీలక షరతులుఇప్పటివరకు పరోక్ష చర్చలకే పరిమితమైన ఇరాన్, ఇప్పుడు అధికారికంగా ప్రత్యక్ష చర్చల్లో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేసింది. తమ అణు కార్యక్రమంపై ఖతార్ అందించిన ప్రతిపాదనలను చురుగ్గా పరిశీలిస్తున్నామని తెలిపిన టెహ్రాన్, అదే సమయంలో శాంతి చర్చలు ఫలప్రదం కావాలంటే తాము విధించిన 7 ప్రధాన డిమాండ్లను అమెరికా అంగీకరించాల్సిందేనని స్పష్టం చేసింది.1.తమ ఓడరేవులపై విధించిన అమెరికా నావికా దిగ్బంధాన్ని తొలగించడం2. ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడం3. స్తంభింపజేసిన ఆస్తుల తక్షణ విడుదల4. యుద్ధ నష్టాలకు తగిన పరిహారం చెల్లించడం5. లెబనాన్ వంటి ఇతర ప్రాంతాలలో ఘర్షణలను శాశ్వతంగా ముగించడం6. ఇరాన్ భూభాగాలపై దాడులను తక్షణమే నిలిపివేయడం7. యురేనియం నిల్వలపై సడలుతున్న పట్టుఅణ్వాయుధ తయారీకి ఉపయోగపడే అత్యంత శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఇరాన్ పూర్తిగా దేశం దాటించాలని అమెరికా మొదట్లో డిమాండ్ చేసింది. అయితే, తమ దేశంలోనే అంతర్జాతీయ పరిశీలకుల పర్యవేక్షణలో దానిని నిర్వీర్యం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, దేశం దాటించే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ ప్రతిష్టంభనను తొలగించడానికి ఇరు దేశాలు కొంత వెనక్కి తగ్గుతుండటం చర్చల పురోగతికి ఊతమిస్తోంది.చర్చలా? యుద్ధమా?.. తేల్చుకోవాల్సింది అమెరికాయేయుద్ధం మళ్లీ రాజుకుంటే ఎవరికీ ప్రయోజనం ఉండదని, సంక్షోభాన్ని పరిష్కరించుకోవడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ స్పష్టం చేశారు. అయితే, అమెరికా మళ్లీ దాడులకు దిగితే సరిహద్దులతో సంబంధం లేకుండా ప్రతిస్పందిస్తామని ఇరాన్ సైన్యం హెచ్చరించింది. తాజా దాడుల ప్రణాళికలు ఏవీ లేవని ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు దిగివస్తున్నాయి. ఈ దౌత్య చర్చలు సఫలమైతే పశ్చిమాసియాలో శాంతి నెలకొనడంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊరట లభించనుంది.మరింత చదవండి

Source link