ప్రస్తుతం సినీ తారలంతా డెస్టినేషన్ వెడ్డింగ్స్ వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో, మృణాళిని రవి సైతం విదేశీ గడ్డపై తన పెళ్లిని ప్లాన్ చేసుకుంది. అత్యంత ఆహ్లాదకరమైన లంకావి దీవిలో ఈ వేడుకను కన్నులపండువగా నిర్వహించారు. పెళ్లి పీటలపై నూతన వధూవరులు ఇద్దరూ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న ఫోటోలను మృణాళిని తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో అభిమానులతో పంచుకుంది. ఈ కొత్త జంటకు సినీ ప్రముఖులు, నెటిజన్లు, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న ఒక హీరోయిన్, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వక్తను పెళ్లాడటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

