ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణంలో దారిలో రేణిగుంట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్, డోన్, బేతంచెర్ల, నంద్యాల, దిగువమెట్ట, మార్కాపురం రోడ్, దోనకొండ, నరసరావుపేట, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట. అయితే, రేణిగుంట యార్డు పనుల కారణంగా మార్గం మళ్లించిన ఆరు ట్రిప్పులకు మాత్రం కొన్ని స్టేషన్లలో స్టాపులు ఉండవని ప్రయాణికులు గమనించాలి. ప్రయాణికులు రైలు ఎక్కే ముందు తాజా టైమింగ్స్, షెడ్యూల్, రైలు నడిచే మార్గానికి సంబంధించిన అప్‌డేట్స్ తెలుసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. ఇందుకోసం నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (ఎన్‌టీఈఎస్) యాప్‌ను లేదా రైల్వే శాఖ అధికారిక సమాచార మార్గాలను ఉపయోగించుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

