Gold Loan: ఎగబడి మరీ బంగారం తాకట్టు పెడుతున్న తెలుగోళ్లు.. ఎందుకో తెలుసా? | బిజినెస్


Last Updated:

Gold Loan: డబ్బు అవసరమైతే చాలామంది ఇప్పుడు ఇంట్లో ఉన్న బంగారాన్నే నమ్ముకుంటున్నారు. అత్యవసర ఖర్చుల నుంచి వ్యాపార అవసరాల వరకు గోల్డ్ లోన్లు తీసుకుంటున్నారు. దీంతో దేశంలో బంగారు రుణాల మార్కెట్ రెండేళ్లలోనే రెట్టింపునకు పైగా పెరిగింది.

News18
News18

డబ్బు అవసరం పడితే చాలామంది ఇప్పుడు బ్యాంకుల చుట్టూ తిరగడం లేదు.. ఇంట్లో ఉన్న బంగారాన్నే తాకట్టు పెట్టి రుణం తీసుకుంటున్నారు. అత్యవసర ఖర్చుల నుంచి వ్యాపార అవసరాల వరకు గోల్డ్ లోన్లనే ఆశ్రయిస్తున్నారు. దీంతో దేశంలో బంగారు రుణాల మార్కెట్ అనూహ్యంగా పెరుగుతోంది. గత రెండేళ్లలోనే ఈ రుణాల విలువ రెట్టింపు కంటే ఎక్కువైందంటే డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. CRIF నివేదిక ప్రకారం.. 2026 సెప్టెంబర్ నాటికి దేశంలో బకాయి ఉన్న బంగారు రుణాల విలువ ఏడాది వ్యవధిలో ఏకంగా 60.6 శాతం పెరిగి రూ.23.3 లక్షల కోట్లకు చేరుకుంది.

దేశంలో మొత్తం రిటైల్ రుణాల విలువ రూ.185.2 లక్షల కోట్లుగా ఉండగా, అందులో బంగారు రుణాల వాటా 12.6 శాతానికి చేరింది. గతంతో పోలిస్తే ఈ వాటా 3.3 శాతం పాయింట్లు పెరిగింది. ముఖ్యంగా గత రెండేళ్లలో ఈ మార్కెట్ గణనీయంగా విస్తరించింది. 2024 సెప్టెంబర్‌లో రూ.10.7 లక్షల కోట్లుగా ఉన్న బంగారు రుణాల బకాయిలు, 2025 సెప్టెంబర్ నాటికి రూ.14.5 లక్షల కోట్లకు చేరాయి. 2026 సెప్టెంబర్ నాటికి ఏకంగా రూ.23.3 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే రెండేళ్లలోనే ఈ రుణాల విలువ రెట్టింపు కంటే ఎక్కువైంది.

బంగారు రుణాల విషయంలో దక్షిణ భారత రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు కలిసి దేశంలోని మొత్తం బకాయి బంగారు రుణాల్లో 72 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో బంగారాన్ని ఆర్థిక అవసరాల కోసం తాకట్టు పెట్టే విధానం ఎక్కువగా ఉండటం కూడా ఈ వృద్ధికి ఒక కారణంగా కనిపిస్తోంది. మరోవైపు, గోల్డ్ లోన్ ఖాతాల సంఖ్య కూడా పెరుగుతోంది. 2026 సెప్టెంబర్ నాటికి దేశంలో యాక్టివ్ బంగారు రుణ ఖాతాలు 10.2 కోట్లకు చేరుకున్నాయి. ఏడాది క్రితం ఇవి 9 కోట్లుగా ఉండగా, 2024లో 8.1 కోట్లుగా నమోదయ్యాయి. అంటే కొత్తగా రుణాలు తీసుకునే వారితో పాటు ఇప్పటికే రుణాలు పొందిన వారి సంఖ్య కూడా పెరుగుతోంది.

2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సగటు బంగారు రుణ మొత్తం 32.7 శాతం పెరిగి రూ.2.2 లక్షలకు చేరుకుంది. ఇదే సమయంలో కొత్తగా మంజూరైన రుణాల మొత్తం విలువ ఏడాది ప్రాతిపదికన 27.2 శాతం పెరిగి రూ.8.15 లక్షల కోట్లకు చేరింది. అయితే రుణాల సంఖ్య మాత్రం 4.1 శాతం తగ్గింది. అంటే తక్కువ సంఖ్యలో రుణాలు తీసుకున్నప్పటికీ, ఒక్కొక్కరు ఎక్కువ మొత్తంలో రుణాలు పొందుతున్నారని నివేదిక సూచిస్తోంది. మొత్తం మంజూరైన రుణాల విలువలో రూ.2.5 లక్షలకు పైబడిన రుణాల వాటా 67.1 శాతంగా ఉంది. రూ.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ రుణాలు మొత్తం విలువలో దాదాపు 40 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అయితే రుణాల సంఖ్యలో వీటి వాటా కేవలం 10 శాతమే. దీంతో పెద్ద మొత్తంలో బంగారాన్ని తాకట్టు పెట్టి అధిక రుణాలు తీసుకునే ధోరణి పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: Silver Price Crash: రూ.4 లక్షలు దాటిన వెండి ఇప్పుడు రూ.1.43 లక్షలకే.. ఏకంగా రూ.2.59 లక్షలు ఢమాల్..!

బంగారు రుణాల మార్కెట్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. 2026 సెప్టెంబర్ నాటికి మొత్తం బకాయి రుణాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 54.8 శాతంగా ఉంది. అదే సమయంలో గోల్డ్ లోన్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (NBFCలు) వాటా కూడా వేగంగా పెరుగుతోంది. రెండేళ్లలో రెట్టింపై 16.9 శాతానికి చేరింది. ముఖ్యంగా మెట్రో నగరాలు, చిన్న మొత్తాల రుణాల విభాగంలో NBFCలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ మార్కెట్ విస్తరణలో మహిళల భాగస్వామ్యం కూడా పెరుగుతోంది. బకాయి ఉన్న బంగారు రుణాల్లో మహిళా రుణగ్రహీతల వాటా 42.2 శాతంగా ఉంది. కొత్తగా రుణాలు తీసుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 2023-24 రెండో త్రైమాసికంలో 23.7 లక్షల మంది బంగారు రుణాలు తీసుకోగా, 2026-27 రెండో త్రైమాసికంలో ఈ సంఖ్య 45.7 లక్షలకు చేరింది. కొత్త రుణాల జారీలో మహిళలు, కొత్త రుణగ్రహీతల భాగస్వామ్యం పెరుగుతున్నట్లు నివేదిక వెల్లడించింది.

అయితే రుణాల వృద్ధితో పాటు రిస్క్ కూడా కొంత పెరుగుతోంది. అధిక ప్రమాదం ఉన్న రుణగ్రహీతల వాటా 2024 సెప్టెంబర్‌లో 14.8 శాతంగా ఉండగా, 2026 సెప్టెంబర్ నాటికి 16.7 శాతానికి చేరింది. అందువల్ల రుణాలు ఇచ్చే సంస్థలు బంగారం విలువను మాత్రమే కాకుండా, రుణగ్రహీతల తిరిగి చెల్లించే సామర్థ్యం, గత రుణ చరిత్ర, ఆదాయ వివరాలను కూడా పరిశీలించాలని CRIF సూచించింది. మొత్తంగా చూస్తే.. దేశంలో బంగారు రుణాలు సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు అనేక వర్గాలకు ఆర్థిక అవసరాలు తీర్చే మార్గంగా మారుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 November 2026, 5:41 pm Digital Edition : Prabhanews
Gold Loan: ఎగబడి మరీ బంగారం తాకట్టు పెడుతున్న తెలుగోళ్లు.. ఎందుకో తెలుసా? | బిజినెస్

Last Updated:November 25, 2026 5:22 PM ISTGold Loan: డబ్బు అవసరమైతే చాలామంది ఇప్పుడు ఇంట్లో ఉన్న బంగారాన్నే నమ్ముకుంటున్నారు. అత్యవసర ఖర్చుల నుంచి వ్యాపార అవసరాల వరకు గోల్డ్ లోన్లు తీసుకుంటున్నారు. దీంతో దేశంలో బంగారు రుణాల మార్కెట్ రెండేళ్లలోనే రెట్టింపునకు పైగా పెరిగింది. News18డబ్బు అవసరం పడితే చాలామంది ఇప్పుడు బ్యాంకుల చుట్టూ తిరగడం లేదు.. ఇంట్లో ఉన్న బంగారాన్నే తాకట్టు పెట్టి రుణం తీసుకుంటున్నారు. అత్యవసర ఖర్చుల నుంచి వ్యాపార అవసరాల వరకు గోల్డ్ లోన్లనే ఆశ్రయిస్తున్నారు. దీంతో దేశంలో బంగారు రుణాల మార్కెట్ అనూహ్యంగా పెరుగుతోంది. గత రెండేళ్లలోనే ఈ రుణాల విలువ రెట్టింపు కంటే ఎక్కువైందంటే డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. CRIF నివేదిక ప్రకారం.. 2026 సెప్టెంబర్ నాటికి దేశంలో బకాయి ఉన్న బంగారు రుణాల విలువ ఏడాది వ్యవధిలో ఏకంగా 60.6 శాతం పెరిగి రూ.23.3 లక్షల కోట్లకు చేరుకుంది.దేశంలో మొత్తం రిటైల్ రుణాల విలువ రూ.185.2 లక్షల కోట్లుగా ఉండగా, అందులో బంగారు రుణాల వాటా 12.6 శాతానికి చేరింది. గతంతో పోలిస్తే ఈ వాటా 3.3 శాతం పాయింట్లు పెరిగింది. ముఖ్యంగా గత రెండేళ్లలో ఈ మార్కెట్ గణనీయంగా విస్తరించింది. 2024 సెప్టెంబర్‌లో రూ.10.7 లక్షల కోట్లుగా ఉన్న బంగారు రుణాల బకాయిలు, 2025 సెప్టెంబర్ నాటికి రూ.14.5 లక్షల కోట్లకు చేరాయి. 2026 సెప్టెంబర్ నాటికి ఏకంగా రూ.23.3 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే రెండేళ్లలోనే ఈ రుణాల విలువ రెట్టింపు కంటే ఎక్కువైంది.బంగారు రుణాల విషయంలో దక్షిణ భారత రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు కలిసి దేశంలోని మొత్తం బకాయి బంగారు రుణాల్లో 72 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో బంగారాన్ని ఆర్థిక అవసరాల కోసం తాకట్టు పెట్టే విధానం ఎక్కువగా ఉండటం కూడా ఈ వృద్ధికి ఒక కారణంగా కనిపిస్తోంది. మరోవైపు, గోల్డ్ లోన్ ఖాతాల సంఖ్య కూడా పెరుగుతోంది. 2026 సెప్టెంబర్ నాటికి దేశంలో యాక్టివ్ బంగారు రుణ ఖాతాలు 10.2 కోట్లకు చేరుకున్నాయి. ఏడాది క్రితం ఇవి 9 కోట్లుగా ఉండగా, 2024లో 8.1 కోట్లుగా నమోదయ్యాయి. అంటే కొత్తగా రుణాలు తీసుకునే వారితో పాటు ఇప్పటికే రుణాలు పొందిన వారి సంఖ్య కూడా పెరుగుతోంది.2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సగటు బంగారు రుణ మొత్తం 32.7 శాతం పెరిగి రూ.2.2 లక్షలకు చేరుకుంది. ఇదే సమయంలో కొత్తగా మంజూరైన రుణాల మొత్తం విలువ ఏడాది ప్రాతిపదికన 27.2 శాతం పెరిగి రూ.8.15 లక్షల కోట్లకు చేరింది. అయితే రుణాల సంఖ్య మాత్రం 4.1 శాతం తగ్గింది. అంటే తక్కువ సంఖ్యలో రుణాలు తీసుకున్నప్పటికీ, ఒక్కొక్కరు ఎక్కువ మొత్తంలో రుణాలు పొందుతున్నారని నివేదిక సూచిస్తోంది. మొత్తం మంజూరైన రుణాల విలువలో రూ.2.5 లక్షలకు పైబడిన రుణాల వాటా 67.1 శాతంగా ఉంది. రూ.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ రుణాలు మొత్తం విలువలో దాదాపు 40 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అయితే రుణాల సంఖ్యలో వీటి వాటా కేవలం 10 శాతమే. దీంతో పెద్ద మొత్తంలో బంగారాన్ని తాకట్టు పెట్టి అధిక రుణాలు తీసుకునే ధోరణి పెరుగుతున్నట్లు తెలుస్తోంది.ఇవి కూడా చదవండి: Silver Price Crash: రూ.4 లక్షలు దాటిన వెండి ఇప్పుడు రూ.1.43 లక్షలకే.. ఏకంగా రూ.2.59 లక్షలు ఢమాల్..!బంగారు రుణాల మార్కెట్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. 2026 సెప్టెంబర్ నాటికి మొత్తం బకాయి రుణాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 54.8 శాతంగా ఉంది. అదే సమయంలో గోల్డ్ లోన్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (NBFCలు) వాటా కూడా వేగంగా పెరుగుతోంది. రెండేళ్లలో రెట్టింపై 16.9 శాతానికి చేరింది. ముఖ్యంగా మెట్రో నగరాలు, చిన్న మొత్తాల రుణాల విభాగంలో NBFCలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ మార్కెట్ విస్తరణలో మహిళల భాగస్వామ్యం కూడా పెరుగుతోంది. బకాయి ఉన్న బంగారు రుణాల్లో మహిళా రుణగ్రహీతల వాటా 42.2 శాతంగా ఉంది. కొత్తగా రుణాలు తీసుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 2023-24 రెండో త్రైమాసికంలో 23.7 లక్షల మంది బంగారు రుణాలు తీసుకోగా, 2026-27 రెండో త్రైమాసికంలో ఈ సంఖ్య 45.7 లక్షలకు చేరింది. కొత్త రుణాల జారీలో మహిళలు, కొత్త రుణగ్రహీతల భాగస్వామ్యం పెరుగుతున్నట్లు నివేదిక వెల్లడించింది.అయితే రుణాల వృద్ధితో పాటు రిస్క్ కూడా కొంత పెరుగుతోంది. అధిక ప్రమాదం ఉన్న రుణగ్రహీతల వాటా 2024 సెప్టెంబర్‌లో 14.8 శాతంగా ఉండగా, 2026 సెప్టెంబర్ నాటికి 16.7 శాతానికి చేరింది. అందువల్ల రుణాలు ఇచ్చే సంస్థలు బంగారం విలువను మాత్రమే కాకుండా, రుణగ్రహీతల తిరిగి చెల్లించే సామర్థ్యం, గత రుణ చరిత్ర, ఆదాయ వివరాలను కూడా పరిశీలించాలని CRIF సూచించింది. మొత్తంగా చూస్తే.. దేశంలో బంగారు రుణాలు సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు అనేక వర్గాలకు ఆర్థిక అవసరాలు తీర్చే మార్గంగా మారుతున్నాయి.మరింత చదవండి

Source link