Last Updated:
లేడీ సూపర్‌స్టార్ నయనతారకు మరో క్రేజీ ఆఫర్ వచ్చిందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సూపర్‌స్టార్ రజినీకాంత్ కొత్త సినిమాలో ఆమె కీలక పాత్రలో కనిపించనుందట.
సూపర్‌స్టార్ రజినీకాంత్, లేడీ సూపర్‌స్టార్ నయనతార.. ఈ ఇద్దరి కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ దగ్గర పండుగ వాతావరణం నెలకొంటుంది. గతంలో ‘చంద్రముఖి’, ‘దర్బార్’, ‘అన్నాత్తే’ (పెద్దన్న) వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించి సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న ఈ తారలు, మరోసారి వెండితెరపై తమ మ్యాజిక్ రిపీట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
తాజా సమాచారం ప్రకారం, రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ధర్మన్’లో నయనతార ఓ కీలకమైన పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. యువ అశ్వత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించే అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. లోకనాయకుడు కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్‌పై ఆర్. మహేంద్రన్‌తో కలిసి పాన్-ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత రజనీ, కమల్ (నటుడు – నిర్మాతగా) కలయికలో వస్తున్న ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ పై సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో ఆకాశాన్ని తాకే అంచనాలు నెలకొన్నాయి.
ఈ ‘ధర్మన్’ చిత్రంలో రజనీకాంత్ మునుపెన్నడూ చూడని విధంగా ఒక పవర్‌ఫుల్ మరియు స్టైలిష్ డాక్టర్‌గా కనువిందు చేయనున్నారు. ఆయన సరికొత్త లుక్, ట్రేడ్‌మార్క్ మ్యానరిజమ్స్ అభిమానులకు విజువల్ ట్రీట్ ఇవ్వనున్నాయని సమాచారం. ఇక ఈ సినిమాలో నయనతార పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా కథలో అత్యంత కీలకంగా ఉంటుందట. అలాగే సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనుందని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఆమె ఎంట్రీపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
కేవలం నయనతార మాత్రమే కాకుండా, ఈ చిత్రంలో అలనాటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్, అలాగే టాలీవుడ్ బ్యూటీ రాశీఖన్నా కూడా ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. దిగ్గజ నటీనటులు అందరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించనుండటంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రజినీకాంత్ స్టైల్, అశ్వత్ మారిముత్తు టేకింగ్, కమల్ హాసన్ అత్యున్నత నిర్మాణ విలువల కలయికలో రాబోతున్న ‘ధర్మన్’ చిత్రం భారతీయ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

