Last Updated:
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయనే స్వయంగా తన పెళ్లి విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. ఆ వివరాలు చూద్దామా..
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయనే స్వయంగా తన పెళ్లి విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. బాలనటుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించి, హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ‘హనుమాన్’ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో తేజ సజ్జా పెళ్లికి సంబంధించిన వార్తలు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పెద్దలు కుదిర్చిన వివాహానికి ఆయన సిద్ధమవుతున్నట్లు సమాచారం.
తేజ సజ్జా పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వివాహానికి సంబంధించిన వివరాలపై ఆసక్తి పెరిగింది. కుటుంబ సభ్యులు ఎంపిక చేసిన అమ్మాయితో ఆయన కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది నవంబర్‌లో నిశ్చితార్థ వేడుక నిర్వహించి, డిసెంబర్లో వివాహం జరిపించాలని ఇరు కుటుంబాలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వేడుకలకు సంబంధించిన ఖచ్చితమైన తేదీలు, ఇతర వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తేజ సజ్జా పెళ్లి రాజస్థాన్‌లోని అందమైన నగరం ఉదయ్‌పూర్‌లో జరగనుందని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. సరస్సులు, చారిత్రక కోటలు, రాజభవనాలకు ప్రసిద్ధి చెందిన ఉదయ్‌పూర్.. సెలబ్రిటీల డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు కూడా ఆకర్షణీయమైన ప్రాంతంగా నిలుస్తోంది. అక్కడి ప్రముఖ ప్యాలెస్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుక నిర్వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. భారీ హంగామా, మీడియా సందడి లేకుండా ప్రైవేట్ వేడుకగా పెళ్లిని జరపాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే వేదికకు సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.
తేజ సజ్జా వివాహ వార్తలతో పాటు ఆయన జీవిత భాగస్వామి ఎవరనే ప్రశ్న క్యూరియాసిటీ కూడా నెలకొంది. తాను చేసుకోబోయే అమ్మాయికి ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేదని, బిజినెస్ ఫ్యామిలీ అని, అమెరికాలో పెరిగిందని తేజ తెలిపాడు. అయితే ఆమె పేరు, కుటుంబ నేపథ్యం వంటి వివరాలు మాత్రం చెప్పలేదు.
బాలనటుడిగా ఎన్నో చిత్రాల్లో కనిపించిన తేజ సజ్జా.. హీరోగా విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హనుమాన్’ చిత్రం ఆయన కెరీర్లో కీలక మైలురాయిగా నిలిచింది. 2024లో విడుదలైన ఈ సూపర్‌హీరో చిత్రం తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర భాషల ప్రేక్షకులనూ ఆకట్టుకుంది. ఈ విజయంతో తేజ సజ్జాకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు లభించింది.

