ప్రభన్యూస్

తక్కువ జీతంతో మీకు నచ్చిన కారు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి.. | బిజినెస్


Last Updated:

కొత్త కారు కొనాలని చాలామంది కలలు కంటారు. అయితే షోరూమ్‌లో కనిపించే ధర చూసి నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత ఊహించని ఖర్చులు ఎదురుకావచ్చు. కారు కొనాలని ఆలోచిస్తున్నవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఐదు ముఖ్యమైన చిట్కాలు ఇవే!

News18
News18

ప్రస్తుతం కొత్త కారు కొనుగోలు చేయడం సామాన్యులకు ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. వాహనాల ధరలు పెరగడం, రుణాలపై వడ్డీ భారం, ఇంధన ధరలు, నిర్వహణ ఖర్చులు అధికమవుతుండటంతో చాలామంది కారు కొనేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. అయితే, సరైన ప్రణాళికతో ముందుకెళ్తే ఆర్థిక ఒత్తిడికి గురికాకుండానే నచ్చిన కారును సొంతం చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా బడ్జెట్ నిర్ణయించుకోవాలి. నెలవారీ ఆదాయం, ఇంటి ఖర్చులు, పొదుపు అవసరాలను పరిగణనలోకి తీసుకుని కారు కొనుగోలుకు ఎంత వెచ్చించగలమో అంచనా వేయాలి. అలాగే కుటుంబ సభ్యుల అభిప్రాయాలు తీసుకోవడం, కారును స్వయంగా నడిపి చూడటం కూడా సరైన నిర్ణయం తీసుకునేందుకు ఉపయోగపడతాయి.

1. ఆదాయానికి తగ్గట్టుగా రుణం తీసుకోండి

కారు కొనుగోలు కోసం రుణం తీసుకోవాలనుకుంటే ముందుగా మీ ఆదాయం, నెలవారీ ఖర్చులను లెక్కించండి. కారు రుణానికి చెల్లించే ఈఎంఐ.. చేతికి వచ్చే నెలవారీ జీతంలో 10 నుంచి 20 శాతానికి మించకుండా చూసుకోవడం మంచిది. రుణ కాలపరిమితిని 60 నెలలు లేదా అంతకంటే తక్కువగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ముందుగానే రుణ ఆమోదం పొందితే డీలర్‌తో ధర విషయంలో చర్చలు జరిపేందుకు అవకాశం ఉంటుంది. తక్కువ వడ్డీ రేటు అందించే బ్యాంకులు, ఆర్థిక సంస్థలను పోల్చి చూసి రుణాన్ని ఎంచుకోవాలి. ఇలా చేయడం వల్ల నెలవారీ వాయిదాల భారం అదుపులో ఉంటుంది.

2. కారు అసలు ఖర్చును లెక్కించండి

షోరూమ్‌లో కనిపించే ధర ఒక్కటే కారు కొనుగోలుకు అయ్యే మొత్తం ఖర్చు కాదు. ఇంధనం, బీమా, రిజిస్ట్రేషన్, పన్నులు, సర్వీసింగ్, మరమ్మతుల ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కారు కోసం అయ్యే మొత్తం నెలవారీ వ్యయాన్ని జీతంలో 20 శాతం పరిధిలో ఉంచుకునేలా ప్రణాళిక రూపొందించుకోవడం ఉపయోగకరం. కొనుగోలు చేసే మోడల్ ఇంధన సామర్థ్యం, సర్వీసింగ్ ఖర్చుల గురించి ముందుగానే తెలుసుకోవాలి. దీనివల్ల భవిష్యత్తులో అనుకోని ఖర్చులతో బడ్జెట్ దెబ్బతినకుండా ఉంటుంది.

3. అవసరాలకు సరిపోయే మోడల్ ఎంచుకోండి

ఇతరులను చూసి ఖరీదైన కారు కొనడం కంటే మీ అవసరాలకు సరిపోయే వాహనాన్ని ఎంచుకోవాలి. కుటుంబ సభ్యుల సంఖ్య, నగరంలో లేదా హైవేలపై ప్రయాణం, పార్కింగ్ సౌకర్యాలను పరిశీలించాలి. మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్, పెట్రోల్ లేదా సీఎన్‌జీ ఎంపికలను కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

4. టెస్ట్ డ్రైవ్‌తో సంతృప్తి చెందండి

ఒక్కసారి కారు నడిపితేనే దాని పనితీరుపై పూర్తి అవగాహన రాకపోవచ్చు. వీలైతే వివిధ రహదారులపై పలుమార్లు టెస్ట్ డ్రైవ్ చేయాలి. ఇంజిన్ పనితీరు, సస్పెన్షన్, సీట్ల సౌకర్యం, సామాను పెట్టుకునే స్థలం, భద్రతా సదుపాయాలను పరిశీలించాలి. కుటుంబ సభ్యులను కూడా వెంట తీసుకెళ్లి వారి అభిప్రాయాలు తెలుసుకోవాలి.

5. ఆఫర్లను పోల్చి ధర తగ్గించుకోండి

వివిధ డీలర్ల నుంచి ధరల వివరాలు సేకరించి, రాయితీలు, పాత కారు మార్పిడి ఆఫర్లు, ఉచితంగా ఇచ్చే ఉపకరణాలను పోల్చాలి. పండుగల సమయంలో లేదా ఏడాది చివర్లో మెరుగైన ఆఫర్లు లభించే అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్ ధరల వివరాలు, వినియోగదారుల సమీక్షలను పరిశీలించాలి. అదనపు ఛార్జీల విషయంలో డీలర్‌తో చర్చలు జరపాలి. సరైన సమయంలో, సరైన ఆఫర్‌తో కారు కొనుగోలు చేస్తే వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 October 2026, 11:18 am Digital Edition : Prabhanews
తక్కువ జీతంతో మీకు నచ్చిన కారు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి.. | బిజినెస్

Last Updated:Oct 23, 2026 11:17 AM ISTకొత్త కారు కొనాలని చాలామంది కలలు కంటారు. అయితే షోరూమ్‌లో కనిపించే ధర చూసి నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత ఊహించని ఖర్చులు ఎదురుకావచ్చు. కారు కొనాలని ఆలోచిస్తున్నవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఐదు ముఖ్యమైన చిట్కాలు ఇవే!
News18ప్రస్తుతం కొత్త కారు కొనుగోలు చేయడం సామాన్యులకు ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. వాహనాల ధరలు పెరగడం, రుణాలపై వడ్డీ భారం, ఇంధన ధరలు, నిర్వహణ ఖర్చులు అధికమవుతుండటంతో చాలామంది కారు కొనేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. అయితే, సరైన ప్రణాళికతో ముందుకెళ్తే ఆర్థిక ఒత్తిడికి గురికాకుండానే నచ్చిన కారును సొంతం చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా బడ్జెట్ నిర్ణయించుకోవాలి. నెలవారీ ఆదాయం, ఇంటి ఖర్చులు, పొదుపు అవసరాలను పరిగణనలోకి తీసుకుని కారు కొనుగోలుకు ఎంత వెచ్చించగలమో అంచనా వేయాలి. అలాగే కుటుంబ సభ్యుల అభిప్రాయాలు తీసుకోవడం, కారును స్వయంగా నడిపి చూడటం కూడా సరైన నిర్ణయం తీసుకునేందుకు ఉపయోగపడతాయి.1. ఆదాయానికి తగ్గట్టుగా రుణం తీసుకోండికారు కొనుగోలు కోసం రుణం తీసుకోవాలనుకుంటే ముందుగా మీ ఆదాయం, నెలవారీ ఖర్చులను లెక్కించండి. కారు రుణానికి చెల్లించే ఈఎంఐ.. చేతికి వచ్చే నెలవారీ జీతంలో 10 నుంచి 20 శాతానికి మించకుండా చూసుకోవడం మంచిది. రుణ కాలపరిమితిని 60 నెలలు లేదా అంతకంటే తక్కువగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ముందుగానే రుణ ఆమోదం పొందితే డీలర్‌తో ధర విషయంలో చర్చలు జరిపేందుకు అవకాశం ఉంటుంది. తక్కువ వడ్డీ రేటు అందించే బ్యాంకులు, ఆర్థిక సంస్థలను పోల్చి చూసి రుణాన్ని ఎంచుకోవాలి. ఇలా చేయడం వల్ల నెలవారీ వాయిదాల భారం అదుపులో ఉంటుంది.2. కారు అసలు ఖర్చును లెక్కించండిషోరూమ్‌లో కనిపించే ధర ఒక్కటే కారు కొనుగోలుకు అయ్యే మొత్తం ఖర్చు కాదు. ఇంధనం, బీమా, రిజిస్ట్రేషన్, పన్నులు, సర్వీసింగ్, మరమ్మతుల ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కారు కోసం అయ్యే మొత్తం నెలవారీ వ్యయాన్ని జీతంలో 20 శాతం పరిధిలో ఉంచుకునేలా ప్రణాళిక రూపొందించుకోవడం ఉపయోగకరం. కొనుగోలు చేసే మోడల్ ఇంధన సామర్థ్యం, సర్వీసింగ్ ఖర్చుల గురించి ముందుగానే తెలుసుకోవాలి. దీనివల్ల భవిష్యత్తులో అనుకోని ఖర్చులతో బడ్జెట్ దెబ్బతినకుండా ఉంటుంది.3. అవసరాలకు సరిపోయే మోడల్ ఎంచుకోండిఇతరులను చూసి ఖరీదైన కారు కొనడం కంటే మీ అవసరాలకు సరిపోయే వాహనాన్ని ఎంచుకోవాలి. కుటుంబ సభ్యుల సంఖ్య, నగరంలో లేదా హైవేలపై ప్రయాణం, పార్కింగ్ సౌకర్యాలను పరిశీలించాలి. మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్, పెట్రోల్ లేదా సీఎన్‌జీ ఎంపికలను కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.4. టెస్ట్ డ్రైవ్‌తో సంతృప్తి చెందండిఒక్కసారి కారు నడిపితేనే దాని పనితీరుపై పూర్తి అవగాహన రాకపోవచ్చు. వీలైతే వివిధ రహదారులపై పలుమార్లు టెస్ట్ డ్రైవ్ చేయాలి. ఇంజిన్ పనితీరు, సస్పెన్షన్, సీట్ల సౌకర్యం, సామాను పెట్టుకునే స్థలం, భద్రతా సదుపాయాలను పరిశీలించాలి. కుటుంబ సభ్యులను కూడా వెంట తీసుకెళ్లి వారి అభిప్రాయాలు తెలుసుకోవాలి.5. ఆఫర్లను పోల్చి ధర తగ్గించుకోండివివిధ డీలర్ల నుంచి ధరల వివరాలు సేకరించి, రాయితీలు, పాత కారు మార్పిడి ఆఫర్లు, ఉచితంగా ఇచ్చే ఉపకరణాలను పోల్చాలి. పండుగల సమయంలో లేదా ఏడాది చివర్లో మెరుగైన ఆఫర్లు లభించే అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్ ధరల వివరాలు, వినియోగదారుల సమీక్షలను పరిశీలించాలి. అదనపు ఛార్జీల విషయంలో డీలర్‌తో చర్చలు జరపాలి. సరైన సమయంలో, సరైన ఆఫర్‌తో కారు కొనుగోలు చేస్తే వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు.మరింత చదవండి

Source link