ఈ సినిమా ఓవరాల్ రన్‌లో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్‌లకు అక్షరాల రూ.225 కోట్లకు పైగా నష్టాలు తెచ్చిపెట్టింది. ఈ మూవీ ఫ్లాప్ అవడానికి మేయిన్ రీజన్స్‌లో ఒకటి రిలీజైన తర్వాత ఎదురైన తీవ్ర విమర్శలు. రామాయణం వంటి గొప్ప ఇతిహాసాన్ని తెరకెక్కిస్తున్నారనే కారణంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. అయితే సినిమాలోని పాత్రల రూపకల్పన, విజువల్ ఎఫెక్ట్స్, సంభాషణలు, కొన్ని సన్నివేశాలపై ప్రేక్షకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా రామాయణంలోని పాత్రలను చూపించిన తీరు, రావణుడి రూపం, కొన్ని డైలాగ్స్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

