Last Updated:
ఇప్పటికే శ్రీకాంత్ నట వారసుడిగా రోషన్ (Roshan) ఇండస్ట్రీలోకి అడుగు పెట్టగా.. ఆయన గారాల పట్టి మేధా మేకా (Medha Meka) కూడా టాలీవుడ్ లోకి అరంగేట్రం చేస్తోంది. తొలి సినిమా విడుదలకు ముందే ఆమెకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయని తెలుస్తోంది.
తన 30 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో 100కు పైగా చిత్రాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ లో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ (Srikanth). హీరోగా ఎన్నో అద్భుతమైన విజయాలు అందుకున్న ఆయన.. ప్రస్తుతం విలన్ గా, పవర్ ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతున్నారు.
ఇప్పటికే శ్రీకాంత్ నట వారసుడిగా రోషన్ (Roshan) ఇండస్ట్రీలోకి అడుగు పెట్టగా.. ఆయన గారాల పట్టి మేధా మేకా (Medha Meka) కూడా టాలీవుడ్ లోకి అరంగేట్రం చేస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ బ్యానర్‌పై ఆమె హీరోయిన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో జై జాస్తి హీరోగా నటిస్తుండగా.. యూట్యూబ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ’30 వెడ్స్ 21′ సిరీస్ దర్శకుడు పృథ్వీ వనం ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా, ప్రస్తుతం ‘#MythriInLove’ అనే వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
సాధారణంగా ఏ హీరోయిన్‌కైనా మొదటి సినిమా విడుదలై, అందులో వాళ్ళ నటనకు మంచి మార్కులు పడితేనే కొత్త అవకాశాలు వస్తుంటాయి. కానీ, మేధా మేకాకు మాత్రం తన తొలి సినిమా సెట్స్‌పై ఉండగానే భారీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఓ సూపర్ హిట్ మూవీ సీక్వెల్ కోసం చిత్ర యూనిట్ మేధాను హీరోయిన్ గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరో వారం రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
అంతేకాకుండా, నందమూరి నటసింహం బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ (Mokshagnya) డెబ్యూ సినిమాలో కూడా మేధాను హీరోయిన్ గా తీసుకోవాలని మేకర్స్ తొలుత భావించారట. అయితే ఆ ప్రాజెక్ట్ ప్రారంభం కావడంలో జరిగిన జాప్యం, ఇతర సమీకరణాల వల్ల ఆ నిర్ణయం మారిపోయినట్లు సమాచారం. దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల కూతుళ్లు హీరోయిన్లుగా సక్సెస్ అవ్వడం చాలా అరుదు. లోకనాయకుడు కమల్ హాసన్ కుమార్తె శ్రుతి హాసన్ మాత్రమే స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేయగలిగింది. ఇప్పుడు అదే తరహాలో శ్రీకాంత్ కూతురు మేధా కూడా తన అందం, అభినయంతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో లేదో చూడాలి.

