ఈ టూర్ ప్యాకేజీ ధరలో అన్ని ఖర్చులు ఉండవు. కొన్ని అదనపు ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. స్మారక కట్టడాల ప్రవేశ టికెట్లు, బోటింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్, ఇతర అదనపు కార్యక్రమాలకు అయ్యే ఖర్చులు ప్యాకేజీలో ఉండవు. ప్రత్యేకంగా టూర్ షెడ్యూల్లో పేర్కొనకపోతే, సందర్శన ప్రాంతాల ప్రవేశ టికెట్లు, స్థానిక గైడ్ ఛార్జీలు కూడా ప్రయాణికులే చెల్లించాలి. గదుల్లో రూమ్ సర్వీస్ ఛార్జీలు, డ్రైవర్లు, వెయిటర్లు, గైడ్లు, ఇతర సిబ్బందికి ఇచ్చే టిప్స్, ఇంధన సర్ఛార్జీలు కూడా ప్యాకేజీలో భాగం కావు. లాండ్రీ, వైన్, మినరల్ వాటర్, ప్యాకేజీలో ఇచ్చే సాధారణ భోజనాలకు అదనంగా తీసుకునే ఆహారం, పానీయాల ఖర్చులు కూడా ప్రయాణికులే భరించాలి. ప్యాకేజీలో అందించే సదుపాయాల జాబితాలో ప్రత్యేకంగా పేర్కొనని ఏ సేవకైనా అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం సికింద్రాబాద్: 9281495845, 9281495843, 9701360701, విజయవాడ: 9281495848, 7670900482, 7670900698, 7670900675, తిరుపతి: 9281030785, 9281030773, 9281030772, విశాఖపట్నం: 9281495837, 9281495847 నెంబర్లను సంప్రదించవచ్చు. లేదా www.irctctourism.com వెబ్సైట్లో వివరాలు చూడొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

