టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి చేర్చిన దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి అఖండ విజయాల వెనుక ఆయన సతీమణి, ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ రమా రాజమౌళి పాత్ర ఎంతో కీలకం. జక్కన్న ప్రతి అడుగులోనూ, ప్రతి సినిమాలోనూ వెన్నంటే ఉండే ఆమె, తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తమ వ్యక్తిగత జీవితం, ప్రేమకథ, అలాగే సంచలన విజయం సాధించిన ‘బాహుబలి’ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

