ప్రభన్యూస్

SIR ఫామ్‌లో వివరాలు తప్పుగా నమోదు చేశారా ? సింపుల్‌గా ఇలా మార్చేసుకోండి | తెలంగాణ వార్తలు


Last Updated:

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల సర్వే ఫారమ్‌లో తప్పులు దొర్లితే ఆందోళన చెందవద్దు. ఆన్‌లైన్ పోర్టల్‌లో ఆధార్, ఓటీపీ సహాయంతో వివరాలను సులభంగా సరిచేసుకునే విధానాన్ని అధికారులు అందుబాటులోకి తెచ్చారు. జూలై 24 లోగా అప్‌డేట్ చేసుకోవచ్చు.

News18
News18

కేంద్ర ఎన్నికల సంఘం (ECI) తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణ కోసం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సర్వేను ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించింది. ఎటువంటి తప్పులు లేని పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బూత్ లెవల్ అధికారులు (BLO) ఇంటింటికి తిరిగి ఓటర్ల వివరాలు సేకరిస్తూ ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ SIR ఫారమ్ నింపేటప్పుడు ఏవైనా తప్పులు దొర్లితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పొరపాట్లను సరిదిద్దుకునేందుకు సులభమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

ఓటర్లు నేరుగా అధికారిక పోర్టల్‌లో లాగిన్ అయి ఆధార్, ఓటీపీ సహాయంతో వివరాలను ఆన్‌లైన్ ద్వారా సులభంగా సరిచేసుకోవచ్చు. మొబైల్ నంబర్ లింక్ కాకపోతే ‘ఫారమ్-8’ ద్వారా అప్‌డేట్ చేయవచ్చు. జూలై 24 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉన్నందున ప్రజలు గడువులోగా తమ ఓటు వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఆన్‌లైన్‌లో ఫారమ్ సులభంగా నింపే విధానం:

– ఓటర్లు నేరుగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ లేదా ఓటర్ సర్వీస్ పోర్టల్‌లోకి లాగిన్ కావాలి.

– అక్కడ మీ ఓటరు గుర్తింపు కార్డు (EPIC) నంబర్ ఎంటర్ చేస్తే, సిస్టమ్‌లో మీ వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి.

– ఆ వివరాలను మీ వద్ద ఉన్న ఆధార్ కార్డుతో జాగ్రత్తగా సరిపోల్చుకోవాలి.

– మీ EPIC నంబర్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ (OTP) సహాయంతో ఆన్‌లైన్ ద్వారా ఈ-సైన్ చేసి వివరాలను త్వరగా అప్‌డేట్ చేయవచ్చు.

తప్పులు జరిగితే వెంటనే ఏం చేయాలి?

– SIR ఫారమ్ ద్వారా మీ మొబైల్ నంబర్, చిరునామా, ఇతర వ్యక్తిగత వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంది.

– ఒకవేళ మీ మొబైల్ నంబర్ ఓటర్ ఐడీతో లింక్ కాకపోతే, మొదట ‘ఫారమ్-8’ నింపి నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

– 2002 నాటి పాత జాబితాలో మీ పేరు లేకపోతే, తగిన ధృవీకరణ పత్రాలతో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులను (ERO) సంప్రదించి ఓటు హక్కు అర్హతను నిరూపించుకోవాలి.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఫారమ్‌ల పంపిణీ చాలా వేగంగా జరుగుతోంది. నిర్మల్ లాంటి జిల్లాల్లో పంపిణీ 100 శాతం పూర్తయింది. కానీ, హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో పూరించిన ఫారమ్‌ల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియ కేవలం 3 శాతానికి పరిమితమై కాస్త నెమ్మదిగా సాగుతోంది. జూలై 24 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది కాబట్టి, నిర్దేశించిన గడువులోగా ప్రజలు అప్రమత్తమై తమ ఓటు వివరాలను సరైన పత్రాలతో అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 July 2026, 4:33 pm Digital Edition : Prabhanews
SIR ఫామ్‌లో వివరాలు తప్పుగా నమోదు చేశారా ? సింపుల్‌గా ఇలా మార్చేసుకోండి | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 16, 2026 4:17 PM ISTతెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల సర్వే ఫారమ్‌లో తప్పులు దొర్లితే ఆందోళన చెందవద్దు. ఆన్‌లైన్ పోర్టల్‌లో ఆధార్, ఓటీపీ సహాయంతో వివరాలను సులభంగా సరిచేసుకునే విధానాన్ని అధికారులు అందుబాటులోకి తెచ్చారు. జూలై 24 లోగా అప్‌డేట్ చేసుకోవచ్చు.News18కేంద్ర ఎన్నికల సంఘం (ECI) తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణ కోసం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సర్వేను ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించింది. ఎటువంటి తప్పులు లేని పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బూత్ లెవల్ అధికారులు (BLO) ఇంటింటికి తిరిగి ఓటర్ల వివరాలు సేకరిస్తూ ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ SIR ఫారమ్ నింపేటప్పుడు ఏవైనా తప్పులు దొర్లితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పొరపాట్లను సరిదిద్దుకునేందుకు సులభమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయి.ఓటర్లు నేరుగా అధికారిక పోర్టల్‌లో లాగిన్ అయి ఆధార్, ఓటీపీ సహాయంతో వివరాలను ఆన్‌లైన్ ద్వారా సులభంగా సరిచేసుకోవచ్చు. మొబైల్ నంబర్ లింక్ కాకపోతే 'ఫారమ్-8' ద్వారా అప్‌డేట్ చేయవచ్చు. జూలై 24 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉన్నందున ప్రజలు గడువులోగా తమ ఓటు వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.ఆన్‌లైన్‌లో ఫారమ్ సులభంగా నింపే విధానం:- ఓటర్లు నేరుగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ లేదా ఓటర్ సర్వీస్ పోర్టల్‌లోకి లాగిన్ కావాలి.- అక్కడ మీ ఓటరు గుర్తింపు కార్డు (EPIC) నంబర్ ఎంటర్ చేస్తే, సిస్టమ్‌లో మీ వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి.- ఆ వివరాలను మీ వద్ద ఉన్న ఆధార్ కార్డుతో జాగ్రత్తగా సరిపోల్చుకోవాలి.- మీ EPIC నంబర్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ (OTP) సహాయంతో ఆన్‌లైన్ ద్వారా ఈ-సైన్ చేసి వివరాలను త్వరగా అప్‌డేట్ చేయవచ్చు.తప్పులు జరిగితే వెంటనే ఏం చేయాలి?- SIR ఫారమ్ ద్వారా మీ మొబైల్ నంబర్, చిరునామా, ఇతర వ్యక్తిగత వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంది.- ఒకవేళ మీ మొబైల్ నంబర్ ఓటర్ ఐడీతో లింక్ కాకపోతే, మొదట 'ఫారమ్-8' నింపి నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.- 2002 నాటి పాత జాబితాలో మీ పేరు లేకపోతే, తగిన ధృవీకరణ పత్రాలతో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులను (ERO) సంప్రదించి ఓటు హక్కు అర్హతను నిరూపించుకోవాలి.తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఫారమ్‌ల పంపిణీ చాలా వేగంగా జరుగుతోంది. నిర్మల్ లాంటి జిల్లాల్లో పంపిణీ 100 శాతం పూర్తయింది. కానీ, హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో పూరించిన ఫారమ్‌ల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియ కేవలం 3 శాతానికి పరిమితమై కాస్త నెమ్మదిగా సాగుతోంది. జూలై 24 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది కాబట్టి, నిర్దేశించిన గడువులోగా ప్రజలు అప్రమత్తమై తమ ఓటు వివరాలను సరైన పత్రాలతో అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link