స్టాక్ మార్కెట్‌లో నేరుగా పెట్టుబడి పెట్టేందుకు ఇష్టపడనివారు ఎస్‌బీఐ ఆర్బిట్రేజ్ ఫండ్ లేదా కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్‌ను పరిశీలించవచ్చు. అయితే వీటిలోనూ రిస్క్ ఉంటుంది. ఎఫ్‌డీ వడ్డీపై వర్తించే పన్ను, మ్యూచువల్ ఫండ్లపై పన్ను విధానం ఒకేలా ఉండవు. పన్ను ప్రయోజనాలు ఫండ్ రకం, కొనుగోలు తేదీ, పెట్టుబడి వ్యవధి, వర్తించే నిబంధనలపై ఆధారపడతాయి. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక సలహాదారును సంప్రదించి, మీ అవసరాలకు సరిపోయే పథకాన్ని ఎంచుకోవడం మంచిది.

