ప్రభన్యూస్

Yash On Ramayana: ఇలాంటి అద్భుతమైన సినిమాలు మళ్లీ మళ్లీ రావు, చిన్న చిన్న లోపాలను వెతకకండి | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ఇలాంటి అద్భుతమైన సినిమాలు మళ్లీ మళ్లీ రావు. కాబట్టి దయచేసి సినిమాలో వీఎఫ్ఎక్స్ (VFX) వంటి చిన్న చిన్న లోపాలను భూతద్దంలో పెట్టి వెతకకండి అంటూ రామాయణ సినిమాపై యశ్ ఓపెన్ కామెంట్స్ చేశారు.

News18
News18

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, కన్నడ రాకింగ్ స్టార్ యశ్, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పౌరాణిక ఇతిహాస చిత్రం ‘రామాయణ’. దంగల్ ఫేమ్ నితీష్ తివారీ అత్యంత భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ విజువల్ వండర్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ ఎపిక్ మూవీ దీపావళి కానుకగా నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా విడుదల కానుంది. నమిత్ మల్హోత్రాతో కలిసి యశ్ స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తుండటం విశేషం. ఇక తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో యశ్ పాల్గొని ప్రేక్షకులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ వేదికపై యశ్ మాట్లాడుతూ.. తన రీసెంట్ మూవీ ‘టాక్సిక్’ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయిందని పరోక్షంగా అంగీకరించారు. “రెండు నెలల క్రితమే మీ ముందుకు వచ్చాను, మళ్లీ త్వరగానే కలుస్తున్నాననే ఫీలింగ్ ఉంది. ఆ సినిమా కొందరికి నచ్చింది, కొందరికి నచ్చలేదు. నచ్చినా, నచ్చకపోయినా నాపై ప్రేమతో థియేటర్లకు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ. మీ ప్రేమే మమ్మల్ని నిరంతరం ముందుకు నడిపిస్తుంది” అని అన్నారు. అలాగే తెలుగు సినీ పరిశ్రమపై ప్రశంసల వర్షం కురిపించారు. రాజమౌళి, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి వారు తెలుగు ఇండస్ట్రీ సత్తాను, అద్భుతాలను ప్రపంచానికి చాటిచెప్పారని కొనియాడారు. బాలీవుడ్ సైతం సౌత్ ఇండస్ట్రీ నుంచి అదే ప్రేమను కోరుకుంటోందని, రెండు పరిశ్రమల మధ్య ప్రేమ, గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం చాలా ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. దిల్ రాజు లాంటి ప్యాషన్ ఉన్న నిర్మాత దొరకడం అదృష్టమని, ఆయనతో ఇది తన మూడో సినిమా అని, తెలుగు డైలాగ్స్ విషయంలో ఆయన తీసుకున్న శ్రద్ధకు కృతజ్ఞతలు తెలిపారు.

దర్శకుడు నితీష్ తివారీ పనితీరును మెచ్చుకుంటూ, ఆయనో గొప్ప టీమ్ ప్లేయర్ అని యశ్ అన్నారు. రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖ లాంటి కష్టమైన పాత్రను ఛాలెంజింగ్‌గా తీసుకుందని, సీతమ్మగా సాయి పల్లవి నటన అద్భుతమని ప్రశంసించారు. ఇక రాముడిగా నటిస్తున్న రణబీర్ కపూర్ గురించి చెబుతూ.. “అతను అద్భుతమైన నటుడు, ఎంతో మంచి మనసున్న వ్యక్తి. అతనికి ఎలాంటి ఇగో ఉండదు. రాముడి పాత్రలో రణబీర్ అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు” అని ధీమా వ్యక్తం చేశారు. నమిత్ మల్హోత్రా భారతీయ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లాలనే కసితో ఉన్నారని, ఆయన ప్యాషన్ చూసే తాను రావణుడిగా నటించడానికి, నిర్మాతగా మారడానికి అంగీకరించానని యశ్ వెల్లడించారు. నమిత్ కృషి వల్లే ఈ అద్భుతాన్ని సోనీ సంస్థ గ్లోబల్ వైడ్‌గా రిలీజ్ చేస్తోందని గుర్తుచేశారు.

చివరిగా ప్రేక్షకులకు యశ్ ఒక విన్నపం చేశారు. “ఇలాంటి అద్భుతమైన సినిమాలు మళ్లీ మళ్లీ రావు. కాబట్టి దయచేసి సినిమాలో వీఎఫ్ఎక్స్ (VFX) వంటి చిన్న చిన్న లోపాలను భూతద్దంలో పెట్టి వెతకకండి. నమిత్ లాంటి ప్యాషనేట్ వ్యక్తులను మనం నిరుత్సాహపరిస్తే ఇండస్ట్రీ ఏళ్ల వెనక్కి వెళ్లిపోతుంది. ఓపెన్ మైండ్‌తో సినిమాను ఎంజాయ్ చేయండి. కన్‌స్ట్రక్టివ్‌గా చేసే విమర్శలను స్వీకరించి, భవిష్యత్తులో మరింత మెరుగైన సినిమాలు చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల ప్రేక్షకులందరూ ఏకమై భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని యశ్ తన ప్రసంగాన్ని ముగించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 October 2026, 11:12 am Digital Edition : Prabhanews
Yash On Ramayana: ఇలాంటి అద్భుతమైన సినిమాలు మళ్లీ మళ్లీ రావు, చిన్న చిన్న లోపాలను వెతకకండి | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 20, 2026 11:05 AM ISTఇలాంటి అద్భుతమైన సినిమాలు మళ్లీ మళ్లీ రావు. కాబట్టి దయచేసి సినిమాలో వీఎఫ్ఎక్స్ (VFX) వంటి చిన్న చిన్న లోపాలను భూతద్దంలో పెట్టి వెతకకండి అంటూ రామాయణ సినిమాపై యశ్ ఓపెన్ కామెంట్స్ చేశారు.
News18బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, కన్నడ రాకింగ్ స్టార్ యశ్, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పౌరాణిక ఇతిహాస చిత్రం 'రామాయణ'. దంగల్ ఫేమ్ నితీష్ తివారీ అత్యంత భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ విజువల్ వండర్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ ఎపిక్ మూవీ దీపావళి కానుకగా నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా విడుదల కానుంది. నమిత్ మల్హోత్రాతో కలిసి యశ్ స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తుండటం విశేషం. ఇక తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో యశ్ పాల్గొని ప్రేక్షకులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ వేదికపై యశ్ మాట్లాడుతూ.. తన రీసెంట్ మూవీ 'టాక్సిక్' ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయిందని పరోక్షంగా అంగీకరించారు. "రెండు నెలల క్రితమే మీ ముందుకు వచ్చాను, మళ్లీ త్వరగానే కలుస్తున్నాననే ఫీలింగ్ ఉంది. ఆ సినిమా కొందరికి నచ్చింది, కొందరికి నచ్చలేదు. నచ్చినా, నచ్చకపోయినా నాపై ప్రేమతో థియేటర్లకు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ. మీ ప్రేమే మమ్మల్ని నిరంతరం ముందుకు నడిపిస్తుంది" అని అన్నారు. అలాగే తెలుగు సినీ పరిశ్రమపై ప్రశంసల వర్షం కురిపించారు. రాజమౌళి, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి వారు తెలుగు ఇండస్ట్రీ సత్తాను, అద్భుతాలను ప్రపంచానికి చాటిచెప్పారని కొనియాడారు. బాలీవుడ్ సైతం సౌత్ ఇండస్ట్రీ నుంచి అదే ప్రేమను కోరుకుంటోందని, రెండు పరిశ్రమల మధ్య ప్రేమ, గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం చాలా ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. దిల్ రాజు లాంటి ప్యాషన్ ఉన్న నిర్మాత దొరకడం అదృష్టమని, ఆయనతో ఇది తన మూడో సినిమా అని, తెలుగు డైలాగ్స్ విషయంలో ఆయన తీసుకున్న శ్రద్ధకు కృతజ్ఞతలు తెలిపారు.దర్శకుడు నితీష్ తివారీ పనితీరును మెచ్చుకుంటూ, ఆయనో గొప్ప టీమ్ ప్లేయర్ అని యశ్ అన్నారు. రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖ లాంటి కష్టమైన పాత్రను ఛాలెంజింగ్‌గా తీసుకుందని, సీతమ్మగా సాయి పల్లవి నటన అద్భుతమని ప్రశంసించారు. ఇక రాముడిగా నటిస్తున్న రణబీర్ కపూర్ గురించి చెబుతూ.. "అతను అద్భుతమైన నటుడు, ఎంతో మంచి మనసున్న వ్యక్తి. అతనికి ఎలాంటి ఇగో ఉండదు. రాముడి పాత్రలో రణబీర్ అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు" అని ధీమా వ్యక్తం చేశారు. నమిత్ మల్హోత్రా భారతీయ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లాలనే కసితో ఉన్నారని, ఆయన ప్యాషన్ చూసే తాను రావణుడిగా నటించడానికి, నిర్మాతగా మారడానికి అంగీకరించానని యశ్ వెల్లడించారు. నమిత్ కృషి వల్లే ఈ అద్భుతాన్ని సోనీ సంస్థ గ్లోబల్ వైడ్‌గా రిలీజ్ చేస్తోందని గుర్తుచేశారు.చివరిగా ప్రేక్షకులకు యశ్ ఒక విన్నపం చేశారు. "ఇలాంటి అద్భుతమైన సినిమాలు మళ్లీ మళ్లీ రావు. కాబట్టి దయచేసి సినిమాలో వీఎఫ్ఎక్స్ (VFX) వంటి చిన్న చిన్న లోపాలను భూతద్దంలో పెట్టి వెతకకండి. నమిత్ లాంటి ప్యాషనేట్ వ్యక్తులను మనం నిరుత్సాహపరిస్తే ఇండస్ట్రీ ఏళ్ల వెనక్కి వెళ్లిపోతుంది. ఓపెన్ మైండ్‌తో సినిమాను ఎంజాయ్ చేయండి. కన్‌స్ట్రక్టివ్‌గా చేసే విమర్శలను స్వీకరించి, భవిష్యత్తులో మరింత మెరుగైన సినిమాలు చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల ప్రేక్షకులందరూ ఏకమై భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని యశ్ తన ప్రసంగాన్ని ముగించారు.మరింత చదవండి

Source link