Last Updated:
నితిన్ లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అలియాస్ రుక్మిణి’. తాజాగా ఈ సినిమా నుంచి రొమాంటిక్ పోస్టర్ వదిలారు మేకర్స్.
నితిన్ హీరోగా నటిస్తున్న తాజా రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అలియాస్ రుక్మిణి’ (Alias Rukmini). విజయదశమి పండుగను పురస్కరించుకుని చిత్ర బృందం ఓ స్పెషల్ రొమాంటిక్ పోస్టర్ విడుదల చేసింది. మురళీ కాంత్ దేవాసోత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్యూట్ లవ్ స్టోరీకి న్యాచురల్ స్టార్ నాని సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. సంప్రదాయబద్ధమైన ఎత్నిక్ వేర్‌లో నితిన్, కథానాయిక ఆఫియా సయ్యద్ ల మధ్య ఉన్న కెమిస్ట్రీ ఈ పోస్టర్‌లో హైలైట్‌గా నిలిచి, సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
గత కొంతకాలంగా సరైన బ్లాక్‌బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్‌కు ఈ సినిమా విజయం అత్యంత కీలకం. ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘అ ఆ’, ‘భీష్మ’ లాంటి చిత్రాలతో రొమాంటిక్ కామెడీ జోనర్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్న నితిన్.. వరుస పరాజయాల తర్వాత తనకి అచ్చొచ్చిన, తన అత్యంత బలమైన జోనర్‌తోనే ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఆయన మార్కెట్‌ను తిరిగి గాడిలో పెట్టడానికి, సాలిడ్ కమ్‌బ్యాక్ ఇవ్వడానికి ఈ ‘అలియాస్ రుక్మిణి’ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే దసరాకు వదిలిన పోస్టర్ సినిమాపై సూపర్ పాజిటివ్ వైబ్‌ను తీసుకొచ్చింది.
This festive season, may love light up your world ❤️✨
Team #AliasRukmini wishes everyone a very Happy Dussehra!A peppy first single coming soon🕺
#AliasRukmini in cinemas worldwide December 4th ❤️
Natural Star @NameisNani presents @actor_nithiin in #AliasRukmini 🪑📚
Written & Directed by @Afilmby_Murali
#AliasRukminiOnDec4th
#AafiyaSayed @UnanimousProds @DeepthiGanta1 @dopjomon @VijaiBulganin @artkolla @srujana_AJ #RekhaBoggarrapu #PrashanthMandava @SVR4446 #RamanaMadhavaram @Bharani_dharann @saregamasouth— Unanimous Productions (@UnanimousProds) October 20, 2026
ఈ పోస్టర్‌లో పండుగ శోభ ఉట్టిపడుతోంది. నితిన్ ఎప్పటిలాగే తన ఛార్మింగ్ లుక్స్‌తో ఆకట్టుకోగా.. ఈ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమవుతున్న బాలీవుడ్ భామ ఆఫియా సయ్యద్ తన క్యూట్ స్మైల్‌తో కుర్రకారును కట్టిపడేస్తోంది. ఇందులో ఆమె కొంటెతనం, హుషారు కలగలిసిన ‘రుక్మిణి’ అనే విలక్షణమైన, ఎనర్జిటిక్ పాత్రలో కనిపించబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు యూత్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్ర బృందం ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ.. త్వరలోనే మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టబోతున్నట్లు హింట్ ఇచ్చింది. సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. త్వరలోనే యూత్‌ను ఉర్రూతలూగించే ఫస్ట్ సింగిల్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలోకి తీసుకు రాబోతున్నారు.

