ప్రభన్యూస్

Kim Jong Un: కోమాలో కిమ్! మరి నేనెవర్నీ బ్రో.. షాక్ ఇచ్చిన ఉత్తర కొరియా అధినేత! |


Last Updated:

Kim Jong Un: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, మెదడులో రక్తస్రావం జరిగి కోమాలోకి వెళ్లి మరణించారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్న వదంతులకు ఆ దేశ అధికారిక మీడియా తెరదించింది.

ఉత్తర కొరియా అధినేత కిమ్
ఉత్తర కొరియా అధినేత కిమ్

కిమ్ జోంగ్ ఉన్ ఒక వాణిజ్య ప్రదర్శనలో పాల్గొని పాదరక్షలు, మహిళల దుస్తులను పరిశీలిస్తున్న సరికొత్త ఛాయాచిత్రాలను ఉత్తర కొరియా విడుదల చేసింది. ‘న్యూయార్క్ పోస్ట్’ (NYP) కథనం ప్రకారం.. ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ ‘కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ’ (KCNA) సోమవారం ఈ ఫోటోలను ప్రచురించింది. ఒక గార్మెంట్ అండ్ పాదరక్షల ఎగ్జిబిషన్‌లో కిమ్ పర్యటించినట్లు అందులో పేర్కొంది. పిల్లల బూట్లను నిశితంగా పరిశీలించడం, అధికారులకు సూచనలు ఇవ్వడం, ప్రదర్శనలో ఉంచిన మహిళల కోట్లను పరిశీలించడం వంటి దృశ్యాలు ఈ ఫోటోల్లో కనిపించాయి. అయితే, ఈ ఫోటోలు ఏ రోజున తీశారనే అంశంపై స్వతంత్ర ధ్రువీకరణ ఇంకా లభించలేదు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన చిత్రాలు

న్యూయార్క్ పోస్ట్ ప్రచురించిన వివరాల ప్రకారం.. విడుదలైన ఛాయాచిత్రాల్లో కిమ్ జోంగ్ ఉన్ ఎంతో ఉల్లాసంగా అధికారులతో మాట్లాడుతున్నారు. ఒక చిత్రంలో గులాబీ రంగు డ్రెస్ ధరించిన మహిళ చేతిలో ఉన్న చిన్న పిల్లల బూటును కిమ్ ముందుకు వంగి పరిశీలిస్తున్నారు. మరో ఫోటోలో చేతులు చాచి అధికారులకు ఏవో కీలక ఆదేశాలు ఇస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఇంకో చిత్రంలో ఒక డమ్మీకి (మానెకిన్) తొడిగిన రస్ట్ కలర్ మహిళల కోటు స్లీవ్‌ను పట్టుకుని పరీక్షిస్తుండగా, పక్కనే ఉన్నతస్థాయి సహాయకులు ఉన్నారు.

కిమ్ మరణ వార్త ప్రచారం ఎలా మొదలైంది?

అమెరికాలో నివసిస్తున్న ‘చైనా డెమోక్రసీ పార్టీ’కి చెందిన చైనీస్ అసమ్మతి నాయకుడు వాంజున్ క్సీ (Wanjun Xie), ఆదివారం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వరుస పోస్టులు పెట్టడంతో ఈ వదంతులు దావానలంలా వ్యాపించాయి. కిమ్ తీవ్రమైన మెదడు రక్తస్రావంతో కోమాలోకి వెళ్లారని, చికిత్స కోసం బీజింగ్‌కు తరలించగా వైద్యులు కాపాడలేకపోయారని, ఆయన మరణించడంతో మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా ప్యాంగ్యాంగ్‌కు తరలించారని క్సీ ఆరోపించారు. అంతేకాకుండా, కిమ్ మరణం తర్వాత తలెత్తే వారసత్వ సంక్షోభాన్ని అదుపు చేయడానికి చైనా దాదాపు 9,000 మంది సైనికులను ప్యాంగ్యాంగ్‌కు పంపినట్లు నిరాధారమైన వాదనలు చేశారు.

కిమ్ ఆరోగ్యంపై గతంలో వచ్చిన నివేదికలు

ఉత్తర కొరియా తమ అధినేత వ్యక్తిగత వివరాలను అత్యంత రహస్యంగా ఉంచుతుంది. దీంతో కిమ్ ఆరోగ్యంపై అంతర్జాతీయంగా ఎప్పుడూ నిఘా ఉంటుంది. సెప్టెంబర్ 30న దక్షిణ కొరియా నిఘా సంస్థ (NIS) ఇచ్చిన నివేదిక ప్రకారం.. కిమ్ శరీర బరువు దాదాపు 140 కిలోలకు (సుమారు 310 పౌండ్లు) చేరిందని, ఆయన గుండె సంబంధిత వ్యాధుల ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొంది. అయినప్పటికీ ఆయన నావికాదళ విధ్వంసక నౌకను పరిశీలించే సమయంలో మెట్లు ఎక్కుతూ చురుగ్గానే కనిపించారని వివరించింది.

అలాగే అక్టోబర్ 12న ఉత్తర కొరియా నిర్వహించిన ‘నేషనల్ డిఫెన్స్ రెవల్యూషన్ మ్యూజియం’ ప్రారంభోత్సవంలో కిమ్ స్వయంగా పాల్గొని ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను పరిశీలించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ గతంలో నివేదించింది. అణ్వాయుధ సంపత్తి కలిగిన దేశానికి నాయకత్వం వహిస్తుండటంతో కిమ్ ఆరోగ్యం లేదా వారసత్వ సంక్షోభంపై వచ్చే వార్తలు ప్రపంచ దేశాలకు ఎంతో కీలకంగా మారుతున్నాయి. ప్రస్తుతానికి ఈ కొత్త ఫోటోల విడుదలతో కిమ్ మరణంపై వస్తున్న పుకార్లకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 October 2026, 11:04 am Digital Edition : Prabhanews
Kim Jong Un: కోమాలో కిమ్! మరి నేనెవర్నీ బ్రో.. షాక్ ఇచ్చిన ఉత్తర కొరియా అధినేత! |

Last Updated:Oct 20, 2026 11:03 AM ISTKim Jong Un: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, మెదడులో రక్తస్రావం జరిగి కోమాలోకి వెళ్లి మరణించారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్న వదంతులకు ఆ దేశ అధికారిక మీడియా తెరదించింది.ఉత్తర కొరియా అధినేత కిమ్కిమ్ జోంగ్ ఉన్ ఒక వాణిజ్య ప్రదర్శనలో పాల్గొని పాదరక్షలు, మహిళల దుస్తులను పరిశీలిస్తున్న సరికొత్త ఛాయాచిత్రాలను ఉత్తర కొరియా విడుదల చేసింది. ‘న్యూయార్క్ పోస్ట్’ (NYP) కథనం ప్రకారం.. ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ ‘కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ’ (KCNA) సోమవారం ఈ ఫోటోలను ప్రచురించింది. ఒక గార్మెంట్ అండ్ పాదరక్షల ఎగ్జిబిషన్‌లో కిమ్ పర్యటించినట్లు అందులో పేర్కొంది. పిల్లల బూట్లను నిశితంగా పరిశీలించడం, అధికారులకు సూచనలు ఇవ్వడం, ప్రదర్శనలో ఉంచిన మహిళల కోట్లను పరిశీలించడం వంటి దృశ్యాలు ఈ ఫోటోల్లో కనిపించాయి. అయితే, ఈ ఫోటోలు ఏ రోజున తీశారనే అంశంపై స్వతంత్ర ధ్రువీకరణ ఇంకా లభించలేదు.సోషల్ మీడియాలో వైరల్ అయిన చిత్రాలున్యూయార్క్ పోస్ట్ ప్రచురించిన వివరాల ప్రకారం.. విడుదలైన ఛాయాచిత్రాల్లో కిమ్ జోంగ్ ఉన్ ఎంతో ఉల్లాసంగా అధికారులతో మాట్లాడుతున్నారు. ఒక చిత్రంలో గులాబీ రంగు డ్రెస్ ధరించిన మహిళ చేతిలో ఉన్న చిన్న పిల్లల బూటును కిమ్ ముందుకు వంగి పరిశీలిస్తున్నారు. మరో ఫోటోలో చేతులు చాచి అధికారులకు ఏవో కీలక ఆదేశాలు ఇస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఇంకో చిత్రంలో ఒక డమ్మీకి (మానెకిన్) తొడిగిన రస్ట్ కలర్ మహిళల కోటు స్లీవ్‌ను పట్టుకుని పరీక్షిస్తుండగా, పక్కనే ఉన్నతస్థాయి సహాయకులు ఉన్నారు.
NEW: Kim Jong Un on Monday "looked round the venue of the garment and footwear exhibition of the field of light industry," DPRK state media said.
The photo-report came after rumors emerging on social media suggested he had died yesterday.https://t.co/rAZQMp2Uk6 https://t.co/hmjRn06KX5— NK NEWS (@nknewsorg) October 19, 2026కిమ్ మరణ వార్త ప్రచారం ఎలా మొదలైంది?అమెరికాలో నివసిస్తున్న ‘చైనా డెమోక్రసీ పార్టీ’కి చెందిన చైనీస్ అసమ్మతి నాయకుడు వాంజున్ క్సీ (Wanjun Xie), ఆదివారం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా వరుస పోస్టులు పెట్టడంతో ఈ వదంతులు దావానలంలా వ్యాపించాయి. కిమ్ తీవ్రమైన మెదడు రక్తస్రావంతో కోమాలోకి వెళ్లారని, చికిత్స కోసం బీజింగ్‌కు తరలించగా వైద్యులు కాపాడలేకపోయారని, ఆయన మరణించడంతో మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా ప్యాంగ్యాంగ్‌కు తరలించారని క్సీ ఆరోపించారు. అంతేకాకుండా, కిమ్ మరణం తర్వాత తలెత్తే వారసత్వ సంక్షోభాన్ని అదుపు చేయడానికి చైనా దాదాపు 9,000 మంది సైనికులను ప్యాంగ్యాంగ్‌కు పంపినట్లు నిరాధారమైన వాదనలు చేశారు.
Rumors circulate that Kim Jong-un has died, thwarting Kim Ju-ae's succession plans and potentially plunging North Korea into civil war. The Chinese Communist Party has reportedly dispatched 9,000 troops to Pyongyang to assist Kim Ju-ae in stabilizing her regime. In preparation for a potential civil war in North Korea, the Northern Theater Command of the Chinese People's Liberation Army has entered a state of high alert (Level III), and all troops within the theater command have been ordered to...Leave, family visits, and demobilization/retirement are suspended; personnel who have left the area are recalled; and strict control over personnel entry and exit is enforced!
— Wanjun Xie (@xie_wanjun) October 18, 2026కిమ్ ఆరోగ్యంపై గతంలో వచ్చిన నివేదికలుఉత్తర కొరియా తమ అధినేత వ్యక్తిగత వివరాలను అత్యంత రహస్యంగా ఉంచుతుంది. దీంతో కిమ్ ఆరోగ్యంపై అంతర్జాతీయంగా ఎప్పుడూ నిఘా ఉంటుంది. సెప్టెంబర్ 30న దక్షిణ కొరియా నిఘా సంస్థ (NIS) ఇచ్చిన నివేదిక ప్రకారం.. కిమ్ శరీర బరువు దాదాపు 140 కిలోలకు (సుమారు 310 పౌండ్లు) చేరిందని, ఆయన గుండె సంబంధిత వ్యాధుల ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొంది. అయినప్పటికీ ఆయన నావికాదళ విధ్వంసక నౌకను పరిశీలించే సమయంలో మెట్లు ఎక్కుతూ చురుగ్గానే కనిపించారని వివరించింది.
It is said that On October 17, Peking Union Medical College Hospital dispatched a team of cardiovascular and cerebrovascular medical experts to North Korea to participate in the rescue of North Korean leader Kim Jong Un, who was in critical condition.
— Wanjun Xie (@xie_wanjun) October 18, 2026
It is rumored that recently,Kim Jong-un, General Secretary of the Workers' Party of Korea and Supreme Leader of North Korea, suffered a severe cerebral hemorrhage and fell into a coma. Although a team of medical experts from Peking Union Medical College Hospital was dispatched to North Korea to assist in his treatment, the poor medical conditions in North Korea forced Kim Jong-un to be transferred to Peking Union Medical College Hospital for emergency treatment. However, due to the severity of his condition and the fact that the optimal window for treatment had passed, Kim Jong-un succumbed to his injuries and died. His body has been secretly transported back to North Korea, and the news of his death is being kept under wraps.
— Wanjun Xie (@xie_wanjun) October 18, 2026అలాగే అక్టోబర్ 12న ఉత్తర కొరియా నిర్వహించిన 'నేషనల్ డిఫెన్స్ రెవల్యూషన్ మ్యూజియం' ప్రారంభోత్సవంలో కిమ్ స్వయంగా పాల్గొని ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను పరిశీలించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ గతంలో నివేదించింది. అణ్వాయుధ సంపత్తి కలిగిన దేశానికి నాయకత్వం వహిస్తుండటంతో కిమ్ ఆరోగ్యం లేదా వారసత్వ సంక్షోభంపై వచ్చే వార్తలు ప్రపంచ దేశాలకు ఎంతో కీలకంగా మారుతున్నాయి. ప్రస్తుతానికి ఈ కొత్త ఫోటోల విడుదలతో కిమ్ మరణంపై వస్తున్న పుకార్లకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది.మరింత చదవండి

Source link