వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను దాటుకుని రాజ్ నిడిమోరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన సమంత, ఇప్పుడు తల్లిగా ప్రమోషన్ పొందడంతో ఆమె సన్నిహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన పలువురు హీరోహీరోయిన్లు, దర్శకులు సమంత – రాజ్ దంపతులకు, చిన్నారి దేవ్‌కు ఆశీస్సులు అందిస్తున్నారు. సినీ కెరీర్లో ఎన్నో మైలురాళ్లు దాటిన సమంత జీవితంలో ఇప్పుడు ఈ మాతృత్వపు మధురిమ మరింత వెలుగులు నింపాలని అభిమానులు కోరుకుంటున్నారు.

