ఫండ్స్‌ఇండియా ఆగస్టు 2026 వెల్త్ కన్వర్సేషన్స్ రిపోర్ట్ ప్రకారం మనీకంట్రోల్ కథనం విశ్లేషించిన వివరాలు ఇలా ఉన్నాయి. 40 ఏళ్ల వయసులో పెట్టుబడి మొదలుపెట్టి 60 ఏళ్లకు రూ.10 కోట్లు కూడబెట్టాలంటే నెలకు సుమారు రూ.1,00,085 SIP చేయాలి. ఏడాదికి 12 శాతం రాబడి వస్తుందని అంచనా వేసినప్పుడు ఈ లెక్క వస్తుంది. అంటే వచ్చే 20 ఏళ్ల పాటు ప్రతి నెల దాదాపు రూ.1 లక్ష పెట్టుబడి పెట్టాలి. అయితే ఇదే రూ.10 కోట్ల లక్ష్యానికి పెట్టుబడికి ఎక్కువ సమయం ఇస్తే నెలకు పెట్టాల్సిన మొత్తం గణనీయంగా తగ్గుతుంది. ఉదాహరణకు 35 ఏళ్ల వయసులో SIP మొదలుపెడితే నెలకు సుమారు రూ.52,697 పెట్టుబడి పెట్టాలి. 30 ఏళ్ల వయసులో మొదలుపెడితే అవసరమైన SIP నెలకు రూ.28,329కు తగ్గుతుంది. అదే 25 ఏళ్ల వయసులో మొదలుపెట్టే వ్యక్తి నెలకు సుమారు రూ.15,396 పెట్టుబడి పెడితే సరిపోతుంది. అంటే 40 ఏళ్ల వయసులో SIP మొదలుపెట్టే వ్యక్తి, 30 ఏళ్లకే మొదలుపెట్టిన వ్యక్తితో పోలిస్తే ప్రతి నెల మూడు రెట్లకు పైగా పెట్టుబడి పెట్టాలి. 25 ఏళ్లకే మొదలుపెట్టిన వ్యక్తితో పోలిస్తే నెలవారీ పెట్టుబడి ఆరు రెట్లకు పైగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
