కాశ్మీర్, లడఖ్‌లోని కష్టమైన కొండ ప్రాంతాల నుంచి రిపబ్లిక్ డే పరేడ్లు, డేర్‌డెవిల్ ప్రదర్శనల వరకు బుల్లెట్ తన బలం, ఓర్పును చాటుకుంటూనే ఉంది. ఈ ప్రత్యేకమైన బంధం కథ 1947-48లో జరిగిన భారత్-పాకిస్థాన్ యుద్ధం తర్వాత మొదలైంది. సైనికులు కఠినమైన కొండ రోడ్లపై, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో, మారుమూల సరిహద్దు ప్రాంతాల్లో ప్రయాణించాలంటే శక్తివంతమైన, నమ్మకమైన మోటార్‌సైకిల్ అవసరమని అప్పటి భారత ప్రభుత్వం గుర్తించింది. ఆ సమయంలో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 ప్రత్యేకంగా కనిపించింది. దాని బలమైన నిర్మాణం, ఫోర్-స్ట్రోక్ ఇంజిన్, అప్పట్లో ఆధునికంగా భావించిన స్వింగ్ఆర్మ్ రియర్ సస్పెన్షన్ కారణంగా అది సైన్యానికి అనుకూలంగా అనిపించింది. సైనిక అవసరాలకు కావాల్సిన స్థిరత్వం, మన్నిక, సులభంగా మెయింటెనెన్స్ చేసే సౌకర్యం ఈ బైక్‌లో ఉన్నాయి. (image: PTI)
