భారతీయుల ఆహారంలో బియ్యానికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. అయితే బియ్యం కేవలం అన్నం వండడానికి మాత్రమే కాదు, ఇంట్లోని అనేక చిన్న చిన్న పనులను సులభతరం చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. బియ్యానికి తేమను పీల్చుకునే సహజ లక్షణం ఉండటంతో పాటు, దాని గింజల ప్రత్యేక నిర్మాణం వల్ల శుభ్రపరిచే పనుల్లోనూ ఉపయోగించవచ్చు. అంతేకాకుండా, తోటపని, వంటగది శుభ్రత, చిన్న ఎలక్ట్రానిక్ వస్తువుల సంరక్షణ వంటి అనేక సందర్భాల్లో కూడా బియ్యం ఉపయోగపడుతుంది. న్యూస్18 గుజరాతీ కథనం ప్రకారం మరి పచ్చి బియ్యాన్ని ఎలాంటి పనులకు ఉపయోగించవచ్చో తెలుసుకుందాం.

