ప్రభన్యూస్

Revanth Reddy: రాష్ట్రాన్ని లూటీ చేసిన కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు పక్కన పెట్టారు: నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు | తెలంగాణ వార్తలు


Last Updated:

నల్గొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో పలు ప్రగతి పనులకు భూమిపూజ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.

రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి

Revanth Reddy: దశాబ్ద కాలం పాటు అధికార పీఠాన్ని అనుభవించి తెలంగాణను లూటీ చేసిన కేసీఆర్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ కోలుకోలేని విధంగా బహిష్కరించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఎందరో వీరుల బలిదానాలు, త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే పదవుల సుఖాలను అనుభవించిందని ఆయన ఆరోపించారు. నల్గొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో పలు ప్రగతి పనులకు భూమిపూజ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.

గులాబీ హయాంలో పేదవాడి సొంతింటి కల అటకెక్కింది

“గ్రామాల్లోని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తుంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు అసూయతో రగిలిపోతున్నారు. తాము అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో విలాసవంతమైన ఫార్మ్‌హౌస్‌లు కట్టుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు తప్ప.. పేదవాడి సొంతింటి కష్టాలు వారికి పట్టలేదు” అని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం ఏటా రూ. 16 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో పేద ప్రజలకు సన్నబియ్యం అందిస్తోందని, అధికారంలోకి వచ్చిన కేవలం 30 నెలల స్వల్ప వ్యవధిలోనే అన్నదాతల ఖాతాల్లో రూ. 1.56 లక్షల కోట్లను జమ చేశామని స్పష్టం చేశారు. ఎరువుల సరఫరాలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం అందకపోయినా, ఎంతో శ్రమించి రైతులకు యూరియా కొరత లేకుండా చూస్తున్నామని.. నేడు తెలంగాణ దేశంలోనే ధాన్యపు దిగుబడిలో అగ్రగామిగా నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి మూలనపడ్డ సమస్యలను పరిష్కరిస్తూ.. కేవలం ముప్పై నెలల్లోనే రికార్డు స్థాయిలో 70 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపట్టి నూతన చరిత్ర సృష్టించామని, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కులగణన సర్వేను విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఉద్యమకారుల త్యాగాలను తమ ఖాతాలో వేసుకున్నారు

తెలంగాణ సాధనలో నల్గొండ విప్లవాత్మక పాత్రను గుర్తుచేస్తూ.. తొలిదశ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ, మలిదశ పోరాటంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నేతలు పదవులను తృణప్రాయంగా భావించి రాజీనామాలు చేశారని సీఎం పేర్కొన్నారు. వందలాది మంది వీరుల త్యాగాల ఫలమైన తెలంగాణను తామే తెచ్చినట్లు బీఆర్ఎస్ నేతలు డబ్బా కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని, చేతిలో అగ్గిపెట్టె పట్టుకుని తామేదో పెద్ద త్యాగాలు చేసినట్లు కొందరు అబద్ధాలు చెపుతున్నారని, కానీ నిజంగా పెట్రోల్ పోసుకుని ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు శ్రీకాంతాచారి బలిదానాన్ని ఏమనాలని నిలదీశారు.

ఎన్ని శక్తులు అడ్డుపడినా మూసీ శుద్ధి ఆగే ప్రసక్తే లేదు

మూసీ నది కాలుష్యం నల్గొండ జిల్లా ప్రజల ఆరోగ్యానికి శాపంగా మారిందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. “కాలుష్య కోరల్లో చిక్కుకున్న మూసీ నదిని ప్రక్షాళన చేసి ఇక్కడి ప్రజలకు విముక్తి కలిగిస్తామంటే.. ప్రతిపక్ష నేతలు దానికి కూడా అడ్డుపడుతున్నారు. ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా మూసీ ప్రక్షాళనను పూర్తి చేసి తీరుతాం” అని గట్టిగా ప్రకటించారు. ఫార్మ్‌హౌస్‌లలో అక్రమంగా నిఘా పరికరాలు పెట్టి భార్యాభర్తల వ్యక్తిగత ఫోన్ సంభాషణలను దొంగచాటుగా విన్న నీచ చరిత్ర బీఆర్ఎస్ నాయకులదని దుయ్యబట్టారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులకు ఎప్పుడూ నిజాలు మాట్లాడే అలవాటే లేదన్నారు.

అలాంటి పాపాత్ములే ఇప్పుడు మళ్లీ అధికారం కోసం ఊరుమ్మడి తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. రూ. లక్ష కోట్ల ప్రజాధనాన్ని తగలేసి కేసీఆర్, హరీష్ రావు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం మూడేళ్లలోనే కుప్పకూలిపోయిందని ఆరోపించారు. దివంగత వైఎస్సార్ ప్రారంభించిన ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టును పదేళ్లపాటు కేసీఆర్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. దశాబ్ద కాలం నాటి బీఆర్ఎస్ అవినీతి పాలనకు, తమ 30 నెలల కాంగ్రెస్ సుపరిపాలనకు మధ్య బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 June 2026, 12:46 am Digital Edition : Prabhanews
Revanth Reddy: రాష్ట్రాన్ని లూటీ చేసిన కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు పక్కన పెట్టారు: నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు | తెలంగాణ వార్తలు

Last Updated:Jun 28, 2026 8:07 PM ISTనల్గొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో పలు ప్రగతి పనులకు భూమిపూజ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.రేవంత్ రెడ్డిRevanth Reddy: దశాబ్ద కాలం పాటు అధికార పీఠాన్ని అనుభవించి తెలంగాణను లూటీ చేసిన కేసీఆర్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ కోలుకోలేని విధంగా బహిష్కరించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఎందరో వీరుల బలిదానాలు, త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే పదవుల సుఖాలను అనుభవించిందని ఆయన ఆరోపించారు. నల్గొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో పలు ప్రగతి పనులకు భూమిపూజ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.గులాబీ హయాంలో పేదవాడి సొంతింటి కల అటకెక్కింది"గ్రామాల్లోని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తుంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు అసూయతో రగిలిపోతున్నారు. తాము అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో విలాసవంతమైన ఫార్మ్‌హౌస్‌లు కట్టుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు తప్ప.. పేదవాడి సొంతింటి కష్టాలు వారికి పట్టలేదు" అని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం ఏటా రూ. 16 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో పేద ప్రజలకు సన్నబియ్యం అందిస్తోందని, అధికారంలోకి వచ్చిన కేవలం 30 నెలల స్వల్ప వ్యవధిలోనే అన్నదాతల ఖాతాల్లో రూ. 1.56 లక్షల కోట్లను జమ చేశామని స్పష్టం చేశారు. ఎరువుల సరఫరాలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం అందకపోయినా, ఎంతో శ్రమించి రైతులకు యూరియా కొరత లేకుండా చూస్తున్నామని.. నేడు తెలంగాణ దేశంలోనే ధాన్యపు దిగుబడిలో అగ్రగామిగా నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి మూలనపడ్డ సమస్యలను పరిష్కరిస్తూ.. కేవలం ముప్పై నెలల్లోనే రికార్డు స్థాయిలో 70 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపట్టి నూతన చరిత్ర సృష్టించామని, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కులగణన సర్వేను విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.ఉద్యమకారుల త్యాగాలను తమ ఖాతాలో వేసుకున్నారుతెలంగాణ సాధనలో నల్గొండ విప్లవాత్మక పాత్రను గుర్తుచేస్తూ.. తొలిదశ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ, మలిదశ పోరాటంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నేతలు పదవులను తృణప్రాయంగా భావించి రాజీనామాలు చేశారని సీఎం పేర్కొన్నారు. వందలాది మంది వీరుల త్యాగాల ఫలమైన తెలంగాణను తామే తెచ్చినట్లు బీఆర్ఎస్ నేతలు డబ్బా కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని, చేతిలో అగ్గిపెట్టె పట్టుకుని తామేదో పెద్ద త్యాగాలు చేసినట్లు కొందరు అబద్ధాలు చెపుతున్నారని, కానీ నిజంగా పెట్రోల్ పోసుకుని ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు శ్రీకాంతాచారి బలిదానాన్ని ఏమనాలని నిలదీశారు.ఎన్ని శక్తులు అడ్డుపడినా మూసీ శుద్ధి ఆగే ప్రసక్తే లేదుమూసీ నది కాలుష్యం నల్గొండ జిల్లా ప్రజల ఆరోగ్యానికి శాపంగా మారిందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. "కాలుష్య కోరల్లో చిక్కుకున్న మూసీ నదిని ప్రక్షాళన చేసి ఇక్కడి ప్రజలకు విముక్తి కలిగిస్తామంటే.. ప్రతిపక్ష నేతలు దానికి కూడా అడ్డుపడుతున్నారు. ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా మూసీ ప్రక్షాళనను పూర్తి చేసి తీరుతాం" అని గట్టిగా ప్రకటించారు. ఫార్మ్‌హౌస్‌లలో అక్రమంగా నిఘా పరికరాలు పెట్టి భార్యాభర్తల వ్యక్తిగత ఫోన్ సంభాషణలను దొంగచాటుగా విన్న నీచ చరిత్ర బీఆర్ఎస్ నాయకులదని దుయ్యబట్టారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులకు ఎప్పుడూ నిజాలు మాట్లాడే అలవాటే లేదన్నారు.అలాంటి పాపాత్ములే ఇప్పుడు మళ్లీ అధికారం కోసం ఊరుమ్మడి తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. రూ. లక్ష కోట్ల ప్రజాధనాన్ని తగలేసి కేసీఆర్, హరీష్ రావు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం మూడేళ్లలోనే కుప్పకూలిపోయిందని ఆరోపించారు. దివంగత వైఎస్సార్ ప్రారంభించిన ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టును పదేళ్లపాటు కేసీఆర్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. దశాబ్ద కాలం నాటి బీఆర్ఎస్ అవినీతి పాలనకు, తమ 30 నెలల కాంగ్రెస్ సుపరిపాలనకు మధ్య బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link