అలాగే బ్యాంకులు బిజినెస్ కరస్పాండెంట్స్ (బీసీలు), ఏటీఎంల ద్వారా కూడా డబ్బులు పంపించే సదుపాయం కల్పించవచ్చు. అయితే ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.5,000 మాత్రమే పంపించాలి. ఒక వ్యక్తి నెలలో ఈ విధంగా మొత్తం రూ.25,000 వరకు మాత్రమే పంపించేందుకు అనుమతి ఉంటుంది. ఉదాహరణకు సురేష్ విజయవాడలో పనిచేస్తున్నాడు. తన కుటుంబానికి రూ.4,000 పంపించాలి. ఇందుకోసం బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా దగ్గరలోని బిజినెస్ కరస్పాండెంట్ (BC) దగ్గర ఈ సేవ పొందవచ్చు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం బిజినెస్ కరస్పాండెంట్స్, ఏటీఎంల ద్వారా ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.5,000 పంపించవచ్చు. ఒక వ్యక్తి నెలలో ఈ విధంగా మొత్తం రూ.25,000 వరకు మాత్రమే పంపించడానికి అనుమతి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)

