ప్రభన్యూస్

Ranabaali: రణబాలి సినిమాపై నాని స్పెషల్ ట్వీట్.. విజయ్ దేవరకొండ, రష్మిక లుక్స్ చూసి ఏమన్నారంటే.. | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన రణబాలి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా నాని చేసిన స్పెషల్ ట్వీట్ వైరల్ అవుతోంది.

News18
News18

టాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ మూవీ రణబాలి మేనియా మొదలైంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ నేడే (అక్టోబర్ 16) విడుదలైంది. ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌పై తాజాగా నేచురల్ స్టార్ నాని రియాక్ట్ అవుతూ.. చిత్ర బృందానికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న లుక్స్ గురించి చెబుతూ సినిమా హైప్ కి బూస్ట్ ఇచ్చారు.

విజయ్ దేవరకొండ తన కెరీర్‌లో విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ‘రణబాలి’లో ఆయన కనిపిస్తున్న తీరు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమా ప్రచార చిత్రాలను పరిశీలిస్తే, పాత్ర కోసం విజయ్ ఎంతగా కష్టపడ్డారో అర్థమవుతోందని నాని ప్రశంసించారు. సాధారణంగా కూల్‌గా కనిపించే విజయ్, ఈ సినిమాలో రణబాలి పాత్ర కోసం ఉగ్రరూపంలోకి మారడం ప్రత్యేకంగా ఆకట్టుకుంటోందని పేర్కొన్నారు. పాత్రకు తగ్గట్టుగా తనను తాను మార్చుకున్న విధానం అభినందనీయమని అన్నారు.

ఈ చిత్రంలో రష్మిక మందన్నా జయమ్మ పాత్రలో కనిపించనున్నారు. విజయ్, రష్మిక కలిసి నటిస్తుండటం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. నిజ జీవితంలోనూ ఈ జంట గురించి అభిమానుల్లో ఆసక్తి ఉండటంతో, తెరపై వీరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందనే చర్చ సాగుతోంది. జయమ్మ పాత్రలో రష్మిక నటన ఆకట్టుకునేలా ఉందని నాని ప్రశంసించారు. కథలో ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం ఉంటుందో తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్‌తో నానికి ప్రత్యేక అనుబంధం ఉంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘శ్యామ్ సింగరాయ్’ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో రాహుల్ మరోసారి భారీ స్థాయి కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంపై అంచనాలు పెరిగాయి. ‘రణబాలి’ ప్రచార చిత్రాల్లో కనిపిస్తున్న విజువల్స్, పాత్రల రూపకల్పన సినిమా నేపథ్యంపై ఆసక్తిని పెంచేశాయి. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో పీరియాడికల్ నేపథ్యం, యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్నట్లు ఇప్పటివరకు సమాచారం బయటకొచ్చింది. మొత్తానికి, నాని ప్రశంసలు చిత్ర బృందానికి మరింత ఉత్సాహాన్ని అందించగా.. నాని చేసిన ఈ ట్వీట్ చూసి ఆయనకు స్పెషల్ థాంక్స్ చెప్పారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 October 2026, 9:30 am Digital Edition : Prabhanews
Ranabaali: రణబాలి సినిమాపై నాని స్పెషల్ ట్వీట్.. విజయ్ దేవరకొండ, రష్మిక లుక్స్ చూసి ఏమన్నారంటే.. | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 16, 2026 9:20 AM ISTవిజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన రణబాలి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా నాని చేసిన స్పెషల్ ట్వీట్ వైరల్ అవుతోంది. News18టాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ మూవీ రణబాలి మేనియా మొదలైంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ నేడే (అక్టోబర్ 16) విడుదలైంది. ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌పై తాజాగా నేచురల్ స్టార్ నాని రియాక్ట్ అవుతూ.. చిత్ర బృందానికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న లుక్స్ గురించి చెబుతూ సినిమా హైప్ కి బూస్ట్ ఇచ్చారు.విజయ్ దేవరకొండ తన కెరీర్‌లో విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ‘రణబాలి’లో ఆయన కనిపిస్తున్న తీరు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమా ప్రచార చిత్రాలను పరిశీలిస్తే, పాత్ర కోసం విజయ్ ఎంతగా కష్టపడ్డారో అర్థమవుతోందని నాని ప్రశంసించారు. సాధారణంగా కూల్‌గా కనిపించే విజయ్, ఈ సినిమాలో రణబాలి పాత్ర కోసం ఉగ్రరూపంలోకి మారడం ప్రత్యేకంగా ఆకట్టుకుంటోందని పేర్కొన్నారు. పాత్రకు తగ్గట్టుగా తనను తాను మార్చుకున్న విధానం అభినందనీయమని అన్నారు.ఈ చిత్రంలో రష్మిక మందన్నా జయమ్మ పాత్రలో కనిపించనున్నారు. విజయ్, రష్మిక కలిసి నటిస్తుండటం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. నిజ జీవితంలోనూ ఈ జంట గురించి అభిమానుల్లో ఆసక్తి ఉండటంతో, తెరపై వీరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందనే చర్చ సాగుతోంది. జయమ్మ పాత్రలో రష్మిక నటన ఆకట్టుకునేలా ఉందని నాని ప్రశంసించారు. కథలో ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం ఉంటుందో తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్‌తో నానికి ప్రత్యేక అనుబంధం ఉంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘శ్యామ్ సింగరాయ్’ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో రాహుల్ మరోసారి భారీ స్థాయి కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంపై అంచనాలు పెరిగాయి. ‘రణబాలి’ ప్రచార చిత్రాల్లో కనిపిస్తున్న విజువల్స్, పాత్రల రూపకల్పన సినిమా నేపథ్యంపై ఆసక్తిని పెంచేశాయి. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో పీరియాడికల్ నేపథ్యం, యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్నట్లు ఇప్పటివరకు సమాచారం బయటకొచ్చింది. మొత్తానికి, నాని ప్రశంసలు చిత్ర బృందానికి మరింత ఉత్సాహాన్ని అందించగా.. నాని చేసిన ఈ ట్వీట్ చూసి ఆయనకు స్పెషల్ థాంక్స్ చెప్పారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.మరింత చదవండి

Source link