ప్రభన్యూస్

Ramayana Amit Shah: రూ.2000 కోట్ల దిశగా ‘రామాయణ’.. చిత్ర యూనిట్‌పై అమిత్ షా ప్రశంసలు | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం ‘రామాయణ’ (Ramayana) బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

News18
News18

నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం ‘రామాయణ’ (Ramayana) బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. గురువారం న్యూఢిల్లీలో ‘రామాయణ’ చిత్ర యూనిట్ అమిత్ షాతో మర్యాదపూర్వకంగా సమావేశమైంది. ఈ ప్రత్యేక భేటీలో నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితీశ్ తివారీ, హీరో రణబీర్ కపూర్, హీరోయిన్ సాయిపల్లవి, సహ నిర్మాత నీరజ్ సంఘాయ్ తదితరులు పాల్గొన్నారు.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన రామాయణ గాథను అత్యాధునిక సాంకేతికతతో, ప్రపంచ స్థాయి విజువల్స్‌తో తెరకెక్కించి అంతర్జాతీయ వేదికపై ఘన విజయం సాధించడంపై అమిత్ షా ప్రశంసలు కురిపించారు. ప్రేక్షకులకు ఒక సరికొత్త విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడంలో చిత్ర బృందం చేసిన కృషిని ఆయన అభినందించారు. అమిత్ షాతో చిత్ర యూనిట్ దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దీపావళి కానుకగా నవంబర్ 5న పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘రామాయణ’ పార్ట్-1, మొదటి రోజు నుంచే వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 1,755 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ క్రమంలో రూ. 1,742 కోట్లు వసూలు చేసిన ‘పుష్ప 2’ లైఫ్‌టైమ్ రికార్డును అధిగమించి భారతీయ సినీ చరిత్రలో సరికొత్త మైలురాయిని చేరుకుంది. మరోవైపు, 2027 ఆస్కార్ అవార్డుల కోసం ‘బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్’ (Best Visual Effects) విభాగంలో ప్రకటించిన టాప్-20 సినిమాల జాబితాలో ‘రామాయణ’ చోటు దక్కించుకోవడం భారతీయ సినిమాకు గర్వకారణంగా నిలిచింది.

నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ దృశ్యకావ్యంలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయిపల్లవి, రావణుడిగా రాకింగ్ స్టార్ యశ్ తమ అద్భుత నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. వీరితో పాటు శోభన, లారా దత్తా, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్ తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. మొదటి భాగం సృష్టించిన ప్రభంజనంతో ఇప్పుడు ప్రేక్షకులంతా ‘రామాయణ’ పార్ట్-2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ సీక్వెల్ 2028లో థియేటర్లలోకి రానుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 November 2026, 4:47 pm Digital Edition : Prabhanews
Ramayana Amit Shah: రూ.2000 కోట్ల దిశగా ‘రామాయణ’.. చిత్ర యూనిట్‌పై అమిత్ షా ప్రశంసలు | తెలుగు సినిమా వార్తలు

Last Updated:November 26, 2026 4:39 PM ISTనితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం ‘రామాయణ’ (Ramayana) బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.News18నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం ‘రామాయణ’ (Ramayana) బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. గురువారం న్యూఢిల్లీలో ‘రామాయణ’ చిత్ర యూనిట్ అమిత్ షాతో మర్యాదపూర్వకంగా సమావేశమైంది. ఈ ప్రత్యేక భేటీలో నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితీశ్ తివారీ, హీరో రణబీర్ కపూర్, హీరోయిన్ సాయిపల్లవి, సహ నిర్మాత నీరజ్ సంఘాయ్ తదితరులు పాల్గొన్నారు.భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన రామాయణ గాథను అత్యాధునిక సాంకేతికతతో, ప్రపంచ స్థాయి విజువల్స్‌తో తెరకెక్కించి అంతర్జాతీయ వేదికపై ఘన విజయం సాధించడంపై అమిత్ షా ప్రశంసలు కురిపించారు. ప్రేక్షకులకు ఒక సరికొత్త విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడంలో చిత్ర బృందం చేసిన కృషిని ఆయన అభినందించారు. అమిత్ షాతో చిత్ర యూనిట్ దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Home Minister @AmitShah ji congratulates Team #Ramayana on the phenomenal worldwide success! 🏹🔥 https://t.co/DmtDNcrtKH
— ???????????????????????????????????????????? (@UrsVamsiShekar) November 26, 2026దీపావళి కానుకగా నవంబర్ 5న పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘రామాయణ’ పార్ట్-1, మొదటి రోజు నుంచే వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 1,755 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ క్రమంలో రూ. 1,742 కోట్లు వసూలు చేసిన ‘పుష్ప 2’ లైఫ్‌టైమ్ రికార్డును అధిగమించి భారతీయ సినీ చరిత్రలో సరికొత్త మైలురాయిని చేరుకుంది. మరోవైపు, 2027 ఆస్కార్ అవార్డుల కోసం ‘బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్’ (Best Visual Effects) విభాగంలో ప్రకటించిన టాప్-20 సినిమాల జాబితాలో ‘రామాయణ’ చోటు దక్కించుకోవడం భారతీయ సినిమాకు గర్వకారణంగా నిలిచింది.నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ దృశ్యకావ్యంలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయిపల్లవి, రావణుడిగా రాకింగ్ స్టార్ యశ్ తమ అద్భుత నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. వీరితో పాటు శోభన, లారా దత్తా, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్ తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. మొదటి భాగం సృష్టించిన ప్రభంజనంతో ఇప్పుడు ప్రేక్షకులంతా ‘రామాయణ’ పార్ట్-2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ సీక్వెల్ 2028లో థియేటర్లలోకి రానుంది.మరింత చదవండి

Source link