ప్రభన్యూస్

Toyota: మార్కెట్లోకి కొత్త ఇన్నోవా.. ధర తక్కువేనా? మైలేజ్ ఎంత ఇస్తుందంటే? | బిజినెస్


ఇన్నోవా హైక్రాస్ ఫ్లెక్స్ హైబ్రిడ్ విడుదల

టయోటా కిర్లోస్కర్ మోటార్ భారతదేశంలో ఇన్నోవా హైక్రాస్ ఫ్లెక్స్ హైబ్రిడ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.19.99 లక్షలుగా నిర్ణయించింది. పెట్రోల్‌తో పాటు E20 నుంచి E85 వరకు వివిధ నిష్పత్తుల్లో ఇథనాల్ కలిపిన ఇంధనంతో నడిచే ఇంజిన్‌కు సెల్ఫ్ ఛార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వ్యవస్థను జతచేసింది. భారతదేశంలో తొలి ఫ్లెక్స్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనంగా కంపెనీ దీనిని పరిచయం చేస్తోంది.

కొత్త లుక్.. ఆకర్షణీయమైన రంగులు

కొత్త మోడల్ ముందు భాగంలో బంపర్, గ్రిల్ డిజైన్‌ను మార్చారు. డబుల్ లేయర్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, కొత్త ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంపులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వెనుకవైపు కూడా డబుల్ స్టాక్డ్ కాంబినేషన్ ల్యాంపులు ఇచ్చారు. పనోరమిక్ సన్‌రూఫ్, అల్లాయ్ వీల్స్, రూఫ్ స్పాయిలర్, క్రోమ్ అలంకరణలు కొనసాగుతున్నాయి. సూపర్ వైట్, ప్లాటినం వైట్ పెర్ల్ మైకా, సిల్వర్ మెటాలిక్, బ్లాకిష్ అగేహా గ్లాస్ ఫ్లేక్, ఆటిట్యూడ్ బ్లాక్ మైకా రంగుల్లో లభిస్తుంది.

పెద్ద స్క్రీన్లు.. లగ్జరీ ఫీచర్లు

కారులో 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌తో పాటు మరో 12.3 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఇచ్చారు. టయోటా ఐ-కనెక్ట్, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, రిమోట్ ఏసీ కంట్రోల్ సదుపాయాలు ఉన్నాయి. తొమ్మిది స్పీకర్ల జేబీఎల్ ఆడియో వ్యవస్థ, సబ్‌వూఫర్లు కూడా అందించారు. ముందు సీట్లకు వెంటిలేషన్, డ్రైవర్ సీటుకు 8-వే పవర్ అడ్జస్ట్‌మెంట్, మెమరీ ఫంక్షన్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్ బ్యాక్ డోర్ ఉన్నాయి. ఏడు, ఎనిమిది సీట్ల ఎంపికలు లభిస్తాయి. ఏడు సీట్ల మోడల్‌లో రెండో వరుసకు కెప్టెన్ సీట్లు, పవర్డ్ ఒట్టోమన్ ఫంక్షన్ ఉన్నాయి.

194 బీహెచ్‌పీ హైబ్రిడ్ ఇంజిన్

ఈ కారులో స్థానికంగా తయారుచేసిన 2.0 లీటర్ టీఎన్‌జీఏ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్‌ను ఐదో తరం స్ట్రాంగ్ హైబ్రిడ్ వ్యవస్థతో అనుసంధానించారు. ఈ-డ్రైవ్ ట్రాన్స్‌మిషన్‌తో కలిపి 194 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈవీ, ఎకో, పవర్ డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. E20 ఇంధనంతో లీటరుకు 22.58 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని టయోటా ప్రకటించింది. బ్యాటరీకి 8 ఏళ్లు లేదా 1.60 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ అందిస్తోంది. ప్రత్యేకంగా ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేకుండా హైబ్రిడ్ బ్యాటరీ తనంతట తానే ఛార్జ్ అవుతుంది.

వేరియంట్లు, ధరలు ఇవే

ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ నాలుగు గ్రేడ్లలో అందుబాటులో ఉంటుంది. జీ హైబ్రిడ్ ధర రూ.19.99 లక్షలు. జీఎక్స్ హైబ్రిడ్ 7 సీటర్ ధర రూ.23.99 లక్షలు, 8 సీటర్ ధర రూ.24.04 లక్షలు. వీఎక్స్ హైబ్రిడ్ 7 సీటర్ రూ.28.79 లక్షలు, 8 సీటర్ రూ.28.84 లక్షలుగా ఉన్నాయి. టాప్ ఎండ్ జెడ్ఎక్స్ హైబ్రిడ్ 7 సీటర్ ధర రూ.31.99 లక్షలు. ఇవన్నీ ఎక్స్‌షోరూమ్ ధరలే. జీ, జీఎక్స్ హైబ్రిడ్ కొత్త గ్రేడ్లు కాగా, పాత జీఎక్స్ పెట్రోల్ మోడల్ కూడా కొనసాగుతుంది. దీనికి 17.8 సెం.మీ. డిస్‌ప్లే, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఇచ్చారు. దీని 7 సీటర్ ధర రూ.19.59 లక్షలు, 8 సీటర్ ధర రూ.19.64 లక్షలు.

భద్రత, బుకింగ్స్ వివరాలు

భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగులు, టయోటా సేఫ్టీ సెన్స్ 3.0, డైనమిక్ రాడార్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ ట్రాకింగ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటర్, ఆటోమేటిక్ హై బీమ్ అందించారు. పనోరమిక్ వ్యూ మానిటర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు కూడా ఉన్నాయి. నవంబర్ 26 నుంచి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ మోడల్‌కు మారుతి సుజుకి ఇన్విక్టో ప్రధాన పోటీదారుగా ఉండగా, కియా కార్నివాల్ అధిక ధరల విభాగంలో ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 November 2026, 4:32 pm Digital Edition : Prabhanews
Toyota: మార్కెట్లోకి కొత్త ఇన్నోవా.. ధర తక్కువేనా? మైలేజ్ ఎంత ఇస్తుందంటే? | బిజినెస్

ఇన్నోవా హైక్రాస్ ఫ్లెక్స్ హైబ్రిడ్ విడుదలటయోటా కిర్లోస్కర్ మోటార్ భారతదేశంలో ఇన్నోవా హైక్రాస్ ఫ్లెక్స్ హైబ్రిడ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.19.99 లక్షలుగా నిర్ణయించింది. పెట్రోల్‌తో పాటు E20 నుంచి E85 వరకు వివిధ నిష్పత్తుల్లో ఇథనాల్ కలిపిన ఇంధనంతో నడిచే ఇంజిన్‌కు సెల్ఫ్ ఛార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వ్యవస్థను జతచేసింది. భారతదేశంలో తొలి ఫ్లెక్స్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనంగా కంపెనీ దీనిని పరిచయం చేస్తోంది.కొత్త లుక్.. ఆకర్షణీయమైన రంగులుకొత్త మోడల్ ముందు భాగంలో బంపర్, గ్రిల్ డిజైన్‌ను మార్చారు. డబుల్ లేయర్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, కొత్త ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంపులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వెనుకవైపు కూడా డబుల్ స్టాక్డ్ కాంబినేషన్ ల్యాంపులు ఇచ్చారు. పనోరమిక్ సన్‌రూఫ్, అల్లాయ్ వీల్స్, రూఫ్ స్పాయిలర్, క్రోమ్ అలంకరణలు కొనసాగుతున్నాయి. సూపర్ వైట్, ప్లాటినం వైట్ పెర్ల్ మైకా, సిల్వర్ మెటాలిక్, బ్లాకిష్ అగేహా గ్లాస్ ఫ్లేక్, ఆటిట్యూడ్ బ్లాక్ మైకా రంగుల్లో లభిస్తుంది.పెద్ద స్క్రీన్లు.. లగ్జరీ ఫీచర్లుకారులో 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌తో పాటు మరో 12.3 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఇచ్చారు. టయోటా ఐ-కనెక్ట్, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, రిమోట్ ఏసీ కంట్రోల్ సదుపాయాలు ఉన్నాయి. తొమ్మిది స్పీకర్ల జేబీఎల్ ఆడియో వ్యవస్థ, సబ్‌వూఫర్లు కూడా అందించారు. ముందు సీట్లకు వెంటిలేషన్, డ్రైవర్ సీటుకు 8-వే పవర్ అడ్జస్ట్‌మెంట్, మెమరీ ఫంక్షన్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్ బ్యాక్ డోర్ ఉన్నాయి. ఏడు, ఎనిమిది సీట్ల ఎంపికలు లభిస్తాయి. ఏడు సీట్ల మోడల్‌లో రెండో వరుసకు కెప్టెన్ సీట్లు, పవర్డ్ ఒట్టోమన్ ఫంక్షన్ ఉన్నాయి.194 బీహెచ్‌పీ హైబ్రిడ్ ఇంజిన్ఈ కారులో స్థానికంగా తయారుచేసిన 2.0 లీటర్ టీఎన్‌జీఏ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్‌ను ఐదో తరం స్ట్రాంగ్ హైబ్రిడ్ వ్యవస్థతో అనుసంధానించారు. ఈ-డ్రైవ్ ట్రాన్స్‌మిషన్‌తో కలిపి 194 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈవీ, ఎకో, పవర్ డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. E20 ఇంధనంతో లీటరుకు 22.58 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని టయోటా ప్రకటించింది. బ్యాటరీకి 8 ఏళ్లు లేదా 1.60 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ అందిస్తోంది. ప్రత్యేకంగా ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేకుండా హైబ్రిడ్ బ్యాటరీ తనంతట తానే ఛార్జ్ అవుతుంది.వేరియంట్లు, ధరలు ఇవేఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ నాలుగు గ్రేడ్లలో అందుబాటులో ఉంటుంది. జీ హైబ్రిడ్ ధర రూ.19.99 లక్షలు. జీఎక్స్ హైబ్రిడ్ 7 సీటర్ ధర రూ.23.99 లక్షలు, 8 సీటర్ ధర రూ.24.04 లక్షలు. వీఎక్స్ హైబ్రిడ్ 7 సీటర్ రూ.28.79 లక్షలు, 8 సీటర్ రూ.28.84 లక్షలుగా ఉన్నాయి. టాప్ ఎండ్ జెడ్ఎక్స్ హైబ్రిడ్ 7 సీటర్ ధర రూ.31.99 లక్షలు. ఇవన్నీ ఎక్స్‌షోరూమ్ ధరలే. జీ, జీఎక్స్ హైబ్రిడ్ కొత్త గ్రేడ్లు కాగా, పాత జీఎక్స్ పెట్రోల్ మోడల్ కూడా కొనసాగుతుంది. దీనికి 17.8 సెం.మీ. డిస్‌ప్లే, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఇచ్చారు. దీని 7 సీటర్ ధర రూ.19.59 లక్షలు, 8 సీటర్ ధర రూ.19.64 లక్షలు.భద్రత, బుకింగ్స్ వివరాలుభద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగులు, టయోటా సేఫ్టీ సెన్స్ 3.0, డైనమిక్ రాడార్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ ట్రాకింగ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటర్, ఆటోమేటిక్ హై బీమ్ అందించారు. పనోరమిక్ వ్యూ మానిటర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు కూడా ఉన్నాయి. నవంబర్ 26 నుంచి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ మోడల్‌కు మారుతి సుజుకి ఇన్విక్టో ప్రధాన పోటీదారుగా ఉండగా, కియా కార్నివాల్ అధిక ధరల విభాగంలో ఉంది.

Source link