ప్రపంచ దేశాల అధికారిక బంగారం నిల్వలను పరిశీలిస్తే భారత్ 8వ స్థానంలో ఉంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాల ప్రకారం.. 2026 సెప్టెంబర్ నాటికి ఆర్‌బీఐ దగ్గర 880.52 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది. ఈ జాబితాలో అమెరికా 8,133.53 టన్నుల బంగారంతో మొదటి స్థానంలో ఉండగా, జర్మనీ 3,349.13 టన్నులతో రెండో స్థానంలో, ఇటలీ 2,451.86 టన్నులతో మూడో స్థానంలో ఉన్నాయి. ఫ్రాన్స్ 2,437.02 టన్నులతో నాలుగో స్థానంలో, చైనా 2,435.40 టన్నులతో ఐదో స్థానంలో, రష్యా 2,283 టన్నులతో ఆరో స్థానంలో ఉన్నాయి. స్విట్జర్లాండ్ 1,039.95 టన్నులతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. భారత్ తర్వాత జపాన్ 845.98 టన్నులతో తొమ్మిదో స్థానంలో, టర్కీ 797.03 టన్నులతో పదో స్థానంలో ఉన్నాయి. అంటే జపాన్, టర్కీ కంటే భారత్ దగ్గరే ఎక్కువ బంగారం నిల్వలు ఉన్నాయి. దీంతో ప్రపంచంలో అత్యధిక అధికారిక బంగారం నిల్వలు ఉన్న టాప్ 10 దేశాల్లో భారత్ చోటు దక్కించుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)

