ప్రభన్యూస్

రామ్ చరణ్, సుకుమార్ సినిమాలో నటించాలనుందా? ‘RC17’ కోసం భారీ క్యాస్టింగ్ కాల్.. ఆడిషన్స్ వివరాలు ఇవే! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో రానున్న ‘RC17’ సినిమాకు క్యాస్టింగ్ కాల్ ప్రకటించారు. 16 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న నటీనటులు తమ ఆడిషన్స్ పంపవచ్చు.

News18
News18

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RC17’ లో నటించాలనుకునే ఔత్సాహిక కళాకారులకు చిత్రబృందం బంపర్ ఆఫర్ ప్రకటించింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కోసం 16 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళా, పురుష నటీనటుల కోసం క్యాస్టింగ్ కాల్ జారీ చేశారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ పోర్ట్‌ఫోలియోలు, ఆడిషన్ వీడియోలను src17casting@gmail.com మెయిల్‌కు లేదా 9110564651 వాట్సాప్ నంబర్‌కు పంపించాలని సూచించారు.

అయితే వాట్సాప్‌కు కేవలం టెక్స్ట్ మెసేజ్‌లు మాత్రమే చేయాలని, ఫోన్ కాల్స్ చేయవద్దని, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పంపవద్దని మేకర్స్ స్పష్టం చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఆడిషన్ వివరాలు అందుబాటులో ఉంటాయి.

‘రంగస్థలం’ తర్వాత మరో భారీ యాక్షన్ అడ్వెంచర్..

బ్లాక్‌బస్టర్ ‘రంగస్థలం’ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కలయికలో వస్తున్న రెండో చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే భారీ యాక్షన్-అడ్వెంచర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. ప్రస్తుతం రామ్ చరణ్ ఈ సినిమా కోసం ప్రత్యేక శిక్షకుల ఆధ్వర్యంలో సరికొత్త మేకోవర్‌కు సిద్ధమవుతుండగా, డిసెంబర్ చివరి వారం లేదా జనవరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి 2028లో సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 November 2026, 4:42 pm Digital Edition : Prabhanews
రామ్ చరణ్, సుకుమార్ సినిమాలో నటించాలనుందా? ‘RC17’ కోసం భారీ క్యాస్టింగ్ కాల్.. ఆడిషన్స్ వివరాలు ఇవే! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:November 27, 2026 4:30 PM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో రానున్న ‘RC17’ సినిమాకు క్యాస్టింగ్ కాల్ ప్రకటించారు. 16 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న నటీనటులు తమ ఆడిషన్స్ పంపవచ్చు.News18గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RC17’ లో నటించాలనుకునే ఔత్సాహిక కళాకారులకు చిత్రబృందం బంపర్ ఆఫర్ ప్రకటించింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కోసం 16 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళా, పురుష నటీనటుల కోసం క్యాస్టింగ్ కాల్ జారీ చేశారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ పోర్ట్‌ఫోలియోలు, ఆడిషన్ వీడియోలను src17casting@gmail.com మెయిల్‌కు లేదా 9110564651 వాట్సాప్ నంబర్‌కు పంపించాలని సూచించారు.అయితే వాట్సాప్‌కు కేవలం టెక్స్ట్ మెసేజ్‌లు మాత్రమే చేయాలని, ఫోన్ కాల్స్ చేయవద్దని, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పంపవద్దని మేకర్స్ స్పష్టం చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఆడిషన్ వివరాలు అందుబాటులో ఉంటాయి.‘రంగస్థలం’ తర్వాత మరో భారీ యాక్షన్ అడ్వెంచర్..బ్లాక్‌బస్టర్ ‘రంగస్థలం’ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కలయికలో వస్తున్న రెండో చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే భారీ యాక్షన్-అడ్వెంచర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. ప్రస్తుతం రామ్ చరణ్ ఈ సినిమా కోసం ప్రత్యేక శిక్షకుల ఆధ్వర్యంలో సరికొత్త మేకోవర్‌కు సిద్ధమవుతుండగా, డిసెంబర్ చివరి వారం లేదా జనవరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి 2028లో సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.మరింత చదవండి

Source link