ప్రభన్యూస్

Gold Loan: బిగ్ షాక్.. గోల్డ్ లోన్ తీసుకున్న వారికి బ్యాంకుల నుంచి మెసేజ్‌లు, ఎందుకొస్తున్నాయంటే.. | బిజినెస్


Last Updated:

గోల్డ్ లోన్ తీసుకున్న వారికి భారీ షాక్.. బ్యాంకుల మెసేజ్‌ల వెనుక అసలు కథ ఇదే!

News18
News18

బంగారం ధరలు తగ్గితే సామాన్యులు సంబరపడతారు.. కానీ అదే పసిడి పతనం ఇప్పుడు గోల్డ్ లోన్ తీసుకున్న వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న వినియోగదారులకు బ్యాంకుల నుంచి వస్తున్న హెచ్చరిక సందేశాలు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. మార్కెట్లో పసిడి ధరలు ఒక్కసారిగా కిందకు దిగిరావడంతో, తాకట్టు పెట్టిన బంగారం విలువ పడిపోయింది. ఫలితంగా లోన్-టు-వాల్యూ (LTV) నిష్పత్తి దెబ్బతిని, అదనపు మొత్తాన్ని తక్షణమే చెల్లించాలంటూ బ్యాంకులు కస్టమర్లపై ఒత్తిడి తెస్తున్నాయి.

తాజాగా హైదరాబాద్‌లో వెలుగుచూసిన ఓ ఘటన గోల్డ్ లోన్ బాధితుల ఆవేదనకు అద్దం పడుతోంది. మల్లాపూర్‌లో ఉంటున్న స్వర్ణలత అనే మహిళ 2026 ఆగస్ట్ 31న తన వద్ద ఉన్న 66 గ్రాముల బంగారు ఆభరణాలను బ్యాంకులో తానఖా పెట్టారు. బ్యాంక్ ఇందులో 55 గ్రాముల బంగారాన్ని నికరంగా లెక్కలోకి తీసుకొని రూ. 5 లక్షల రుణం మంజూరు చేసింది. అయితే ఇటీవల కాలంలో బంగారం ధరలు భారీగా తగ్గడంతో ఆ ఆభరణాల మార్కెట్ విలువ గణనీయంగా పడిపోయింది. దీంతో బ్యాంకు నిర్దేశించిన ఎల్‌టీవీ పరిమితి దాటిపోయిందని, తక్షణమే రూ. 43,000 నగదు చెల్లించాలని 2 రోజుల కిందట బ్యాంక్ నుంచి ఆమెకు మెసేజ్ వచ్చింది.

ఈ అంశంపై స్వర్ణలత మాట్లాడుతూ.. కుటుంబ అవసరాల నిమిత్తం డబ్బులు అవసరం ఉండి మా బంగారం మొత్తం కూడా బ్యాంక్‌లో కుదవ పెట్టి డబ్బు తెచ్చుకున్నాం. ఆ సమయంలో ఏడాది వరకు వడ్డీ కట్టకపోయినా మీ బంగారానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని స్థానిక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది హామీ ఇచ్చారు. కానీ ఉన్నట్లుండి.. నాకు దాదాపు రూ.43 వేలు చెల్లించాలని, లేదంటే అవసరమైనంత గోల్డ్ అయిన డిపాజిట్ చేయాలని మెసేజ్ రావడంతో షాక్ అయ్యాను. ఇప్పటికిప్పుడు ఈ డబ్బు మాలాంటి మధ్యతరగతి ప్రజలకు ఎక్కడి నుంచి వస్తుంది? అని ఆవేదన చెందారు. గోల్డ్ ధరలు పెరినప్పుడు అందుకు తగినట్లుగా మరింత లోన్ మొత్తం ఇస్తామని చెప్పలేదు కదా.. తగ్గగానే ఇలా డబ్బులు కట్టాలని మెసేజ్‌లు పంపడం సరికాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ అబ్బాయి శరీరంలో గర్భాశయం.. షాకైన డాక్టర్లు, ఎలా వచ్చిందంటే?

సాధారణంగా బంగారం ధరలు పెరుగుతున్నప్పుడు రుణగ్రహీతలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ధరలు పతనమైనప్పుడు తాకట్టు పెట్టిన ఆభరణాల విలువ తగ్గిపోయి, తీసుకున్న రుణం మొత్తానికి అనుగుణంగా ఉండాల్సిన నిష్పత్తి మారిపోతుంది. ఈ వ్యత్యాసాన్ని సరిచేసేందుకు బ్యాంకులు వెంటనే మార్జిన్ కాల్ నోటీసులు జారీ చేస్తున్నాయి. ఊహించని విధంగా వేలాది రూపాయలు తక్షణమే సర్దుబాటు చేయాలని ఆదేశాలు వస్తుండటంతో మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నాయి. గడువులోగా డబ్బు కట్టకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేసే ప్రమాదం ఉందనే ఆందోళన వారిని వెంటాడుతోంది.

మహబూబ్‌నగర్ మూత్తూట్ ఫైనాన్స్ మేనేజర్ మాట్లాడుతూ.. 3 నెలల కిందట తులం బంగారంపై రూ.1.15 లక్షలు లోన్ ఇచ్చేవారని, కానీ ఇప్పుడు రూ.85 వేల వరకు రుణ మొత్తం ఇస్తున్నారని వివరించారు. లోన్ టూ వాల్యూ రేషియో తగ్గిన గోల్డ్ లోన్ అకౌంట్లకు డబ్బులు డిపాజిట్ చేయాలని మెసేజ్‌లు వెళ్తున్నాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి: సర్పంచ్ ఎన్నికల్లో వింత.. ఈయనకు రెండే ఓట్లు!

అయితే ప్రస్తుతానికి కొన్ని బ్యాంకులు మాత్రమే గోల్డ్ లోన్లకు సంబంధించి మేసేజ్‌లు పంపుతున్నాయి. పేరు వెల్లడించడానికి ఇష్టపడని ప్రముఖ జాతీయ బ్యాంకులకు చెందిన ఇద్దరు బ్యాంక్ సిబ్బంది ప్రకారం.. ఎవరైతే గోల్డ్ లోన్‌కు సంబంధించి మెసేజ్‌లు పొందాలో.. వాళ్లు సంబంధిత బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి కలవాలని సూచించారు. బ్యాంక్ ఉద్యోగులు ఇచ్చే సమాధానం స్పష్టత లేకపోతే బ్యాంక్ మేనేజర్‌ను కలిసి వివరాలు తెలుసుకోవాలన్నారు. లేదంటే బ్యాంకుల నుంచి మూడు సార్లు నోటీసులు రావొచ్చని.. దీనికి కూడా స్పందించకపోతే.. గోల్డ్ వేలం వేసే పరిస్థితి రావొచ్చని హెచ్చరించారు. అందుకే అవసరం ఉన్నంత వరకే లోన్ తీసుకోవాలని, అనవసరంగా గరిష్ట మొత్తం తీసుకోవద్దని సూచించారు.

కాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 2026 ఏప్రిల్ నుంచి అమల్లోకి తెచ్చిన నూతన నిబంధనల ప్రకారం బంగారు రుణాలపై ఎల్‌టీవీ పరిమితులను స్పష్టంగా వర్గీకరించారు. రూ. 2.5 లక్షల వరకు తీసుకునే రుణాలకు బంగారం విలువలో గరిష్టంగా 85 శాతం వరకు లోన్ ఇస్తారు. అలాగే రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు ఉండే రుణాలకు గరిష్టంగా 80 శాతం, రూ. 5 లక్షలకు పైబడిన రుణాలకు గరిష్టంగా 75 శాతం వరకు మాత్రమే ఎల్‌టీవీ పరిమితి వర్తిస్తుంది. బంగారం ధరలు తగ్గి ఈ పరిమితులు దాటిన వెంటనే బ్యాంకులు కచ్చితంగా అదనపు చెల్లింపులు కోరాల్సి ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 November 2026, 4:50 pm Digital Edition : Prabhanews
Gold Loan: బిగ్ షాక్.. గోల్డ్ లోన్ తీసుకున్న వారికి బ్యాంకుల నుంచి మెసేజ్‌లు, ఎందుకొస్తున్నాయంటే.. | బిజినెస్

Last Updated:November 27, 2026 4:07 PM ISTగోల్డ్ లోన్ తీసుకున్న వారికి భారీ షాక్.. బ్యాంకుల మెసేజ్‌ల వెనుక అసలు కథ ఇదే!News18బంగారం ధరలు తగ్గితే సామాన్యులు సంబరపడతారు.. కానీ అదే పసిడి పతనం ఇప్పుడు గోల్డ్ లోన్ తీసుకున్న వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న వినియోగదారులకు బ్యాంకుల నుంచి వస్తున్న హెచ్చరిక సందేశాలు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. మార్కెట్లో పసిడి ధరలు ఒక్కసారిగా కిందకు దిగిరావడంతో, తాకట్టు పెట్టిన బంగారం విలువ పడిపోయింది. ఫలితంగా లోన్-టు-వాల్యూ (LTV) నిష్పత్తి దెబ్బతిని, అదనపు మొత్తాన్ని తక్షణమే చెల్లించాలంటూ బ్యాంకులు కస్టమర్లపై ఒత్తిడి తెస్తున్నాయి.తాజాగా హైదరాబాద్‌లో వెలుగుచూసిన ఓ ఘటన గోల్డ్ లోన్ బాధితుల ఆవేదనకు అద్దం పడుతోంది. మల్లాపూర్‌లో ఉంటున్న స్వర్ణలత అనే మహిళ 2026 ఆగస్ట్ 31న తన వద్ద ఉన్న 66 గ్రాముల బంగారు ఆభరణాలను బ్యాంకులో తానఖా పెట్టారు. బ్యాంక్ ఇందులో 55 గ్రాముల బంగారాన్ని నికరంగా లెక్కలోకి తీసుకొని రూ. 5 లక్షల రుణం మంజూరు చేసింది. అయితే ఇటీవల కాలంలో బంగారం ధరలు భారీగా తగ్గడంతో ఆ ఆభరణాల మార్కెట్ విలువ గణనీయంగా పడిపోయింది. దీంతో బ్యాంకు నిర్దేశించిన ఎల్‌టీవీ పరిమితి దాటిపోయిందని, తక్షణమే రూ. 43,000 నగదు చెల్లించాలని 2 రోజుల కిందట బ్యాంక్ నుంచి ఆమెకు మెసేజ్ వచ్చింది.ఈ అంశంపై స్వర్ణలత మాట్లాడుతూ.. కుటుంబ అవసరాల నిమిత్తం డబ్బులు అవసరం ఉండి మా బంగారం మొత్తం కూడా బ్యాంక్‌లో కుదవ పెట్టి డబ్బు తెచ్చుకున్నాం. ఆ సమయంలో ఏడాది వరకు వడ్డీ కట్టకపోయినా మీ బంగారానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని స్థానిక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది హామీ ఇచ్చారు. కానీ ఉన్నట్లుండి.. నాకు దాదాపు రూ.43 వేలు చెల్లించాలని, లేదంటే అవసరమైనంత గోల్డ్ అయిన డిపాజిట్ చేయాలని మెసేజ్ రావడంతో షాక్ అయ్యాను. ఇప్పటికిప్పుడు ఈ డబ్బు మాలాంటి మధ్యతరగతి ప్రజలకు ఎక్కడి నుంచి వస్తుంది? అని ఆవేదన చెందారు. గోల్డ్ ధరలు పెరినప్పుడు అందుకు తగినట్లుగా మరింత లోన్ మొత్తం ఇస్తామని చెప్పలేదు కదా.. తగ్గగానే ఇలా డబ్బులు కట్టాలని మెసేజ్‌లు పంపడం సరికాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇది కూడా చదవండి: తెలంగాణ అబ్బాయి శరీరంలో గర్భాశయం.. షాకైన డాక్టర్లు, ఎలా వచ్చిందంటే?సాధారణంగా బంగారం ధరలు పెరుగుతున్నప్పుడు రుణగ్రహీతలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ధరలు పతనమైనప్పుడు తాకట్టు పెట్టిన ఆభరణాల విలువ తగ్గిపోయి, తీసుకున్న రుణం మొత్తానికి అనుగుణంగా ఉండాల్సిన నిష్పత్తి మారిపోతుంది. ఈ వ్యత్యాసాన్ని సరిచేసేందుకు బ్యాంకులు వెంటనే మార్జిన్ కాల్ నోటీసులు జారీ చేస్తున్నాయి. ఊహించని విధంగా వేలాది రూపాయలు తక్షణమే సర్దుబాటు చేయాలని ఆదేశాలు వస్తుండటంతో మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నాయి. గడువులోగా డబ్బు కట్టకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేసే ప్రమాదం ఉందనే ఆందోళన వారిని వెంటాడుతోంది.మహబూబ్‌నగర్ మూత్తూట్ ఫైనాన్స్ మేనేజర్ మాట్లాడుతూ.. 3 నెలల కిందట తులం బంగారంపై రూ.1.15 లక్షలు లోన్ ఇచ్చేవారని, కానీ ఇప్పుడు రూ.85 వేల వరకు రుణ మొత్తం ఇస్తున్నారని వివరించారు. లోన్ టూ వాల్యూ రేషియో తగ్గిన గోల్డ్ లోన్ అకౌంట్లకు డబ్బులు డిపాజిట్ చేయాలని మెసేజ్‌లు వెళ్తున్నాయని తెలిపారు.ఇవి కూడా చదవండి: సర్పంచ్ ఎన్నికల్లో వింత.. ఈయనకు రెండే ఓట్లు!అయితే ప్రస్తుతానికి కొన్ని బ్యాంకులు మాత్రమే గోల్డ్ లోన్లకు సంబంధించి మేసేజ్‌లు పంపుతున్నాయి. పేరు వెల్లడించడానికి ఇష్టపడని ప్రముఖ జాతీయ బ్యాంకులకు చెందిన ఇద్దరు బ్యాంక్ సిబ్బంది ప్రకారం.. ఎవరైతే గోల్డ్ లోన్‌కు సంబంధించి మెసేజ్‌లు పొందాలో.. వాళ్లు సంబంధిత బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి కలవాలని సూచించారు. బ్యాంక్ ఉద్యోగులు ఇచ్చే సమాధానం స్పష్టత లేకపోతే బ్యాంక్ మేనేజర్‌ను కలిసి వివరాలు తెలుసుకోవాలన్నారు. లేదంటే బ్యాంకుల నుంచి మూడు సార్లు నోటీసులు రావొచ్చని.. దీనికి కూడా స్పందించకపోతే.. గోల్డ్ వేలం వేసే పరిస్థితి రావొచ్చని హెచ్చరించారు. అందుకే అవసరం ఉన్నంత వరకే లోన్ తీసుకోవాలని, అనవసరంగా గరిష్ట మొత్తం తీసుకోవద్దని సూచించారు.కాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 2026 ఏప్రిల్ నుంచి అమల్లోకి తెచ్చిన నూతన నిబంధనల ప్రకారం బంగారు రుణాలపై ఎల్‌టీవీ పరిమితులను స్పష్టంగా వర్గీకరించారు. రూ. 2.5 లక్షల వరకు తీసుకునే రుణాలకు బంగారం విలువలో గరిష్టంగా 85 శాతం వరకు లోన్ ఇస్తారు. అలాగే రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు ఉండే రుణాలకు గరిష్టంగా 80 శాతం, రూ. 5 లక్షలకు పైబడిన రుణాలకు గరిష్టంగా 75 శాతం వరకు మాత్రమే ఎల్‌టీవీ పరిమితి వర్తిస్తుంది. బంగారం ధరలు తగ్గి ఈ పరిమితులు దాటిన వెంటనే బ్యాంకులు కచ్చితంగా అదనపు చెల్లింపులు కోరాల్సి ఉంటుంది.మరింత చదవండి

Source link