సుమ కెరీర్ హీరోయిన్గా స్టార్ట్ అయిందన్న విషయం చాలా మందికి తెలియదు. 1996లో వచ్చిన ‘కళ్యాణ ప్రాప్థిరస్తు’ సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది సుమ. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత మలయాళంలో హీరోయిన్గా చేసింది. కానీ అక్కడ కూడా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది. పవిత్ర ప్రేమ, చాలా బాగుంది, పండండి కాపురం, వర్షం, స్వరాభిషేకం.. ఇలా పలు సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్టుగా చేసింది.

