ప్రభన్యూస్

PM Modi: మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితానికి గుర్తుగా బీజేపీ ‘సేవా దూత్ అభియాన్’.. డిసెంబర్ 1 నుంచి నియోజకవర్గాల్లో నేతల పర్యటన! |


Last Updated:

ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని బీజేపీ డిసెంబర్ 1 నుంచి 25 వరకు ‘సేవా దూత్ అభియాన్’ చేపట్టనుంది. సీనియర్ నేతలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి పథకాల అమలును సమీక్షించనున్నారు.

మోదీ
మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ మరో భారీ ప్రజా సంబంధాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 1 నుంచి 25వ తేదీ వరకు 25 రోజుల పాటు దేశవ్యాప్తంగా ‘సేవా దూత్ అభియాన్’ నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి జాతీయ ప్రధాన కార్యదర్శి హరీశ్ ద్వివేదిని సమన్వయకర్తగా నియమించారు. ప్రచారాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పార్టీ సీనియర్ నేతలు వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు.

నేరుగా ప్రజలతో మమేకమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలించనున్నారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాల ఫలాలు అందుతున్నాయా లేదా అన్నది తెలుసుకుని, ఎక్కడైనా లోపాలు ఉంటే గుర్తించి సరిదిద్దడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.

2027 ఎన్నికలే లక్ష్యంగా యూపీ, పంజాబ్‌లపై ప్రత్యేక దృష్టి

2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్ సహా కీలక రాష్ట్రాల్లో ఈ ప్రచారం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయా రాష్ట్రాల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు సీనియర్ నేతలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కేవలం పార్టీ నివేదికలపైనే ఆధారపడకుండా ఓటర్ల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడనుంది.

ప్రజల ఆకాంక్షలు, స్థానిక సమస్యలు, సంక్షేమ పథకాలపై ఓటర్ల స్పందనను నియోజకవర్గ స్థాయిలో అంచనా వేయనున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో సుపరిపాలన, శాంతిభద్రతలు, ప్రభుత్వ పనితీరు అంశాలపై రాబోయే ఎన్నికల్లో గట్టి పోటీ ఉండనున్న నేపథ్యంలో ఈ క్షేత్రస్థాయి పర్యటనలు కీలకం కానున్నాయి.

కాగా, మోదీ ప్రజా ప్రస్థానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు బీజేపీ ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహించింది. దానికి కొనసాగింపుగా డిసెంబర్ 25న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి (సుపరిపాలన దినోత్సవం) వరకు ఈ ‘సేవా దూత్ అభియాన్’ కొనసాగనుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 November 2026, 4:25 pm Digital Edition : Prabhanews
PM Modi: మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితానికి గుర్తుగా బీజేపీ ‘సేవా దూత్ అభియాన్’.. డిసెంబర్ 1 నుంచి నియోజకవర్గాల్లో నేతల పర్యటన! |

Last Updated:November 26, 2026 4:19 PM ISTప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని బీజేపీ డిసెంబర్ 1 నుంచి 25 వరకు ‘సేవా దూత్ అభియాన్’ చేపట్టనుంది. సీనియర్ నేతలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి పథకాల అమలును సమీక్షించనున్నారు.మోదీప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ మరో భారీ ప్రజా సంబంధాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 1 నుంచి 25వ తేదీ వరకు 25 రోజుల పాటు దేశవ్యాప్తంగా ‘సేవా దూత్ అభియాన్’ నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి జాతీయ ప్రధాన కార్యదర్శి హరీశ్ ద్వివేదిని సమన్వయకర్తగా నియమించారు. ప్రచారాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పార్టీ సీనియర్ నేతలు వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు.నేరుగా ప్రజలతో మమేకమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలించనున్నారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాల ఫలాలు అందుతున్నాయా లేదా అన్నది తెలుసుకుని, ఎక్కడైనా లోపాలు ఉంటే గుర్తించి సరిదిద్దడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.2027 ఎన్నికలే లక్ష్యంగా యూపీ, పంజాబ్‌లపై ప్రత్యేక దృష్టి2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్ సహా కీలక రాష్ట్రాల్లో ఈ ప్రచారం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయా రాష్ట్రాల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు సీనియర్ నేతలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కేవలం పార్టీ నివేదికలపైనే ఆధారపడకుండా ఓటర్ల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడనుంది.ప్రజల ఆకాంక్షలు, స్థానిక సమస్యలు, సంక్షేమ పథకాలపై ఓటర్ల స్పందనను నియోజకవర్గ స్థాయిలో అంచనా వేయనున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో సుపరిపాలన, శాంతిభద్రతలు, ప్రభుత్వ పనితీరు అంశాలపై రాబోయే ఎన్నికల్లో గట్టి పోటీ ఉండనున్న నేపథ్యంలో ఈ క్షేత్రస్థాయి పర్యటనలు కీలకం కానున్నాయి.కాగా, మోదీ ప్రజా ప్రస్థానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు బీజేపీ ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహించింది. దానికి కొనసాగింపుగా డిసెంబర్ 25న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి (సుపరిపాలన దినోత్సవం) వరకు ఈ ‘సేవా దూత్ అభియాన్’ కొనసాగనుంది.మరింత చదవండి

Source link