Last Updated:
PM-KISAN Scheme: దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతులకు ప్రతి ఏడాది రూ.6,000 ఆర్థిక సాయం అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకాన్ని మరో ఐదేళ్ల పాటు కొనసాగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. 2026-27 నుంచి 2030-31 వరకు పథకం అమలుకు రూ.3.15 లక్షల కోట్లను ఆమోదించింది. ఈ నిర్ణయంతో అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డీబీటీ (DBT) విధానంలో ఆర్థిక సాయం యథావిధిగా కొనసాగనుండగా, వ్యవసాయ పెట్టుబడులకు, రైతుల ఆదాయ భద్రతకు మరింత ఊతం లభించనుంది.
