ఈ పథకంలో లబ్ధిదారుల కొనసాగింపును పెంచేందుకు, మరింత మంది చేరేలా చేయడానికి, అవగాహన పెంచేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోంది. PM-SYM పథకంలో అర్హులైన లబ్ధిదారులను చేర్చే కామన్ సర్వీస్ సెంటర్లకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. స్వచ్ఛందంగా బయటకు వెళ్లే అవకాశం (వాలంటరీ ఎగ్జిట్), నిలిచిపోయిన ఖాతాలను తిరిగి యాక్టివ్ చేసే రివైవల్ మాడ్యూల్, క్లెయిమ్ స్టేటస్, అకౌంట్ స్టేట్మెంట్ వంటి కొత్త సదుపాయాలను ప్రారంభించింది. (ప్రతీకాత్మక చిత్రం)

