ప్రభన్యూస్

Pawan Kalyan: తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. భారీగా తరలివచ్చిన అభిమానులు..! |


Last Updated:

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

+

News18

News18

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం సాయంత్రం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన ఆయన, శ్రీవారిని దర్శించుకుని తన మొక్కులను చెల్లించుకున్నారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ దర్శనం సందర్భంగా ఆలయ సంప్రదాయాలను అనుసరించి టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు.

దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదమంత్రాలతో పవన్ కళ్యాణ్‌కు ఆశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి, పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తూ అన్ని కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటన విషయం తెలుసుకున్న అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆలయం వెలుపలికి చేరుకున్నారు. ఆయనను ఒక్కసారి చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులు పవన్.. పవన్.. అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు కొద్దిసేపు సందడిగా మారాయి.

భక్తుల రద్దీ, అభిమానుల రాక దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దర్శన ఏర్పాట్లు సజావుగా కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చిన భక్తులు, అభిమానులకు అభివాదం చేస్తూ తిరుమల నుంచి బయలుదేరారు. ఆయన పర్యటన ప్రశాంతంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో ముగిసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 July 2026, 9:03 pm Digital Edition : Prabhanews
Pawan Kalyan: తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. భారీగా తరలివచ్చిన అభిమానులు..! |

Last Updated:Jul 02, 2026 8:36 PM ISTఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.+
News18ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం సాయంత్రం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన ఆయన, శ్రీవారిని దర్శించుకుని తన మొక్కులను చెల్లించుకున్నారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ దర్శనం సందర్భంగా ఆలయ సంప్రదాయాలను అనుసరించి టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు.దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదమంత్రాలతో పవన్ కళ్యాణ్‌కు ఆశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి, పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తూ అన్ని కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటన విషయం తెలుసుకున్న అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆలయం వెలుపలికి చేరుకున్నారు. ఆయనను ఒక్కసారి చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులు పవన్.. పవన్.. అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు కొద్దిసేపు సందడిగా మారాయి.భక్తుల రద్దీ, అభిమానుల రాక దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దర్శన ఏర్పాట్లు సజావుగా కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చిన భక్తులు, అభిమానులకు అభివాదం చేస్తూ తిరుమల నుంచి బయలుదేరారు. ఆయన పర్యటన ప్రశాంతంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో ముగిసింది.Location :Tirupati,Chittoor,Andhra Pradeshమరింత చదవండి

Source link