ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు ‘జాతీయ పోషకాహార వారోత్సవాలు’ (National Nutrition Week) జరుపుకుంటాం. ఈ వారం ముఖ్య ఉద్దేశం ప్రజలలో సరైన పోషకాహారం, సమతుల్య ఆహారం పట్ల అవగాహన పెంచడమే. మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ లోపించడం కారణంగా నేడు చాలామంది పోషకాల లోపంతో, జీవనశైలి వ్యాధులతో బాధపడుతున్నారు. దీన్ని నివారించడానికి పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) మార్గదర్శకాల ప్రకారం, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ప్రతిరోజూ తగిన మోతాదులో తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. అలాగే, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ICMR) నివేదికల ప్రకారం మన శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ పండ్ల ద్వారా చాలా సులభంగా అందుతాయి. అందుకే, ఈ పోషకాహార వారోత్సవాల సందర్భంగా, వారం రోజుల్లో 14 రకాల పండ్లను ఎలా తినాలో, వాటి వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

