ప్రభన్యూస్

Murder: మర్డర్స్ చేయిస్తోన్న ఏఐ.. బెంగళూరులో దారుణం.. కన్న తల్లిదండ్రులు, చెల్లిని పొట్టనబెట్టుకున్న ఐటీ ఉద్యోగిని! |


Last Updated:

Murder: సాంకేతిక పరిజ్ఞానాన్ని మానవాళి సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి ఉపయోగించాల్సింది పోయి.. నేరాలకు మార్గదర్శిగా వాడుకుంటున్న దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగుచూసింది. కన్నతల్లిదండ్రులతో పాటు తోబుట్టువును కడతేర్చడానికి ఒక యువతి ఏకంగా కృత్రిమ మేధ (AI) చాట్‌బాట్ సూచనలు తీసుకోవడం స్థానికంగానే కాక దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఈనాడు కథనం ప్రకారం.. బెంగళూరు నగర పరిధిలోని సీగేహళ్లి అపార్ట్‌మెంట్‌లో సోమసుందర్ (52), ఆయన భార్య ముత్తులక్ష్మి (48), వారి చిన్నకుమార్తె సుప్రియ (19) ఘోర హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. సోమసుందర్ పెద్ద కుమార్తె శ్వేత, ఆమె ప్రియుడు కెన్నెత్ కలసి ఈ ముగ్గురినీ పక్కా పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఏఐ చాట్‌బాట్‌లో హత్య మెలకువలు

శ్వేత ఐటీ కంపెనీలో పనిచేస్తుండటంతో సాంకేతిక పరిజ్ఞానంపై ఆమెకు మంచి అవగాహన ఉంది. ఆ పరిజ్ఞానాన్ని నేరానికి ఉపయోగించింది. హత్య చేయడానికి ముందు కొన్నిరోజుల పాటు శ్వేత, కెన్నెత్ కలసి ఏఐ చాట్‌బాట్‌ను విస్తృతంగా ఉపయోగించారు. ఎవరినైనా అనుమానం రాకుండా ఎలా హతమార్చాలి? ఆధారం లేకుండా ఎలా కడతేర్చాలి? అనే అంశాలపై చాట్‌బాట్ నుంచి మెలకువలు తెలుసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఆరు నెలల పాటు పథకం రచించి, చాట్‌బాట్ ఇచ్చిన సూచనలనే తాము గుడ్డిగా అనుసరించామని నిందితులు అధికారుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం.

ఏఐ కంపెనీకి పోలీసుల లేఖ

ఏఐ సాధనాన్ని నేరానికి ఎలా ఉపయోగించుకున్నారనే విషయాన్ని డిజిటల్ ఆధారంగా సేకరించేందుకు దర్యాప్తు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. శ్వేత, కెన్నెత్ చాట్‌బాట్‌లో అడిగిన ప్రశ్నలు, దానికి వచ్చిన సమాధానాల వివరాలను సేకరించేందుకు గాను సంబంధిత ఏఐ టూల్ కంపెనీకి పోలీసులు లేఖ రాశారు. ఆ కంపెనీ అందించే లాగ్స్, డిజిటల్ డేటాను కోర్టులో కీలకమైన డిజిటల్ సాక్ష్యంగా పరిగణిస్తామని కేఆర్‌ పురం పోలీసులు స్పష్టం చేశారు. సాంకేతికత ఎంతగా ఉపయోగపడుతుందో, సరైన పర్యవేక్షణ లేకపోతే నేరగాళ్లకు అస్త్రంగా ఎలా మారుతుందో ఈ ఉదంతం హెచ్చరిస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 July 2026, 7:38 am Digital Edition : Prabhanews
Murder: మర్డర్స్ చేయిస్తోన్న ఏఐ.. బెంగళూరులో దారుణం.. కన్న తల్లిదండ్రులు, చెల్లిని పొట్టనబెట్టుకున్న ఐటీ ఉద్యోగిని! |

Last Updated:Jul 23, 2026 5:56 AM ISTMurder: సాంకేతిక పరిజ్ఞానాన్ని మానవాళి సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి ఉపయోగించాల్సింది పోయి.. నేరాలకు మార్గదర్శిగా వాడుకుంటున్న దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగుచూసింది. కన్నతల్లిదండ్రులతో పాటు తోబుట్టువును కడతేర్చడానికి ఒక యువతి ఏకంగా కృత్రిమ మేధ (AI) చాట్‌బాట్ సూచనలు తీసుకోవడం స్థానికంగానే కాక దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.ప్రతీకాత్మక చిత్రంఈనాడు కథనం ప్రకారం.. బెంగళూరు నగర పరిధిలోని సీగేహళ్లి అపార్ట్‌మెంట్‌లో సోమసుందర్ (52), ఆయన భార్య ముత్తులక్ష్మి (48), వారి చిన్నకుమార్తె సుప్రియ (19) ఘోర హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. సోమసుందర్ పెద్ద కుమార్తె శ్వేత, ఆమె ప్రియుడు కెన్నెత్ కలసి ఈ ముగ్గురినీ పక్కా పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.ఏఐ చాట్‌బాట్‌లో హత్య మెలకువలుశ్వేత ఐటీ కంపెనీలో పనిచేస్తుండటంతో సాంకేతిక పరిజ్ఞానంపై ఆమెకు మంచి అవగాహన ఉంది. ఆ పరిజ్ఞానాన్ని నేరానికి ఉపయోగించింది. హత్య చేయడానికి ముందు కొన్నిరోజుల పాటు శ్వేత, కెన్నెత్ కలసి ఏఐ చాట్‌బాట్‌ను విస్తృతంగా ఉపయోగించారు. ఎవరినైనా అనుమానం రాకుండా ఎలా హతమార్చాలి? ఆధారం లేకుండా ఎలా కడతేర్చాలి? అనే అంశాలపై చాట్‌బాట్ నుంచి మెలకువలు తెలుసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఆరు నెలల పాటు పథకం రచించి, చాట్‌బాట్ ఇచ్చిన సూచనలనే తాము గుడ్డిగా అనుసరించామని నిందితులు అధికారుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం.ఏఐ కంపెనీకి పోలీసుల లేఖఏఐ సాధనాన్ని నేరానికి ఎలా ఉపయోగించుకున్నారనే విషయాన్ని డిజిటల్ ఆధారంగా సేకరించేందుకు దర్యాప్తు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. శ్వేత, కెన్నెత్ చాట్‌బాట్‌లో అడిగిన ప్రశ్నలు, దానికి వచ్చిన సమాధానాల వివరాలను సేకరించేందుకు గాను సంబంధిత ఏఐ టూల్ కంపెనీకి పోలీసులు లేఖ రాశారు. ఆ కంపెనీ అందించే లాగ్స్, డిజిటల్ డేటాను కోర్టులో కీలకమైన డిజిటల్ సాక్ష్యంగా పరిగణిస్తామని కేఆర్‌ పురం పోలీసులు స్పష్టం చేశారు. సాంకేతికత ఎంతగా ఉపయోగపడుతుందో, సరైన పర్యవేక్షణ లేకపోతే నేరగాళ్లకు అస్త్రంగా ఎలా మారుతుందో ఈ ఉదంతం హెచ్చరిస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.Click here to add News18 as your preferred news source on Google. బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link