Last Updated:
Cold Medicines for Children: చిన్నారులకు మందులు ఇచ్చే తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయం ఇది. 4 ఏళ్లలోపు పిల్లలకు క్లోర్‌ఫెనిరమైన్ మలేట్, ఫినైల్ఫ్రైన్ హైడ్రోక్లోరైడ్ కలిగిన కొన్ని కాంబినేషన్ మందులు వాడకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మందులపై కీలక ఆంక్షలు విధిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.
చిన్నారుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్లోర్‌ఫెనిరమైన్ మలేట్ (Chlorpheniramine Maleate), ఫినైల్ఫ్రైన్ హైడ్రోక్లోరైడ్ (Phenylephrine Hydrochloride) కలిగిన కొన్ని స్థిర మోతాదు కలయిక మందుల (Fixed Dose Combinations – FDCs) వినియోగంపై ఆంక్షలు విధించింది. ముఖ్యంగా నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఈ మందులను ఉపయోగించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

