హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించే వారికి 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ గరిష్ఠంగా రూ.1,250 వరకు ఉంటుంది. దీనికి కనీస కొనుగోలు విలువ రూ.7,490 ఉండాలి. నిర్దిష్ట కనీస కొనుగోలు మొత్తం, ఈఎంఐ కాలపరిమితి నిబంధనలు పాటించే లావాదేవీలపై అదనంగా రూ.500 లేదా రూ.250 ఫ్లాట్ డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నట్లు చూపించారు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు కనీసం రూ.4,990 విలువైన ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఉంది. ఈ డిస్కౌంట్ గరిష్ఠంగా రూ.1,250 వరకు ఉంటుంది. ఎక్కువ కనీస కొనుగోలు మొత్తాలకు రూ.500, రూ.250, రూ.1,250 ఫ్లాట్ డిస్కౌంట్లు కూడా లిస్ట్ చేశారు. (image: Amazon India)

