కీర్తి సురేశ్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ క్రైమ్ డ్రామా సిరీస్ అక్క. ధర్మరాజ్ శెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సిరీస్ హిందీ వెర్షన్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పెన్నురు అనే కల్పిత రాజ్యంలో 800 ఏళ్లుగా మహిళల ఆధిపత్యం కొనసాగుతుండగా, రుద్ర రాకతో అక్కడి వ్యవస్థలో ఎలాంటి మార్పులు వచ్చాయనేది పాయింట్‌తో ఈ సిరీస్ తెరకెక్కినట్లు ట్రైలర్‌తో తెలుస్తుంది. భవాని, రుద్ర మధ్య జరిగే ఆధిపత్య పోరు, రాజకీయాలు, సంప్రదాయాల చుట్టూ ఈ కథ సాగుతుంది. వైఆర్ఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ సిరీస్ అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
Source link
Keerthi Suresh: కీర్తి సురేశ్ 'అక్క' సిరీస్ ట్రైలర్ చూశారా?
