ప్రభన్యూస్

PM Surya Ghar Scheme: ఇంటిపై సోలార్ పెట్టుకుంటే సబ్సిడీ మీ బ్యాంక్ ఖాతాలోకే.. ఎలా పొందాలో తెలుసా? | బిజినెస్


Last Updated:

PM Surya Ghar Scheme: ఇంటి కరెంట్ బిల్లులు తగ్గించుకోవాలని చూస్తున్నారా? అయితే పీఎం సూర్య ఘర్ పథకం మీకు ఉపయోగపడుతుంది. ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే కేంద్రం సబ్సిడీ అందిస్తోంది. దరఖాస్తు నుంచి సబ్సిడీ పొందే వరకు అన్ని వివరాలను తెలుసుకునేందుకు ప్రత్యేక పోర్టల్, వాట్సాప్ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది.

News18
News18

ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన గురించి తెలుసుకోవాలి. ఈ పథకం ద్వారా ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. అంతేకాదు, అర్హత ఉన్న కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. అయితే చాలామందికి ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేయాలి? సోలార్ ప్యానెల్స్ ఎవరితో ఏర్పాటు చేయించుకోవాలి? సబ్సిడీ ఎలా వస్తుంది? అనే సందేహాలు ఉంటాయి. వీటన్నింటికీ సమాధానంగా ప్రభుత్వం ప్రత్యేక డిజిటల్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది.

అన్నింటికీ ఒకటే పోర్టల్‌..

పీఎం సూర్య ఘర్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక జాతీయ పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఇంటి యజమానులు, ప్రభుత్వం గుర్తించిన సోలార్ విక్రేతలు, విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కామ్‌లు), సబ్సిడీ పంపిణీ వ్యవస్థలను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకొచ్చింది. దీంతో ప్రజలు వేర్వేరు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చాలా పనులను ఆన్‌లైన్‌లోనే పూర్తి చేసుకోవచ్చు. ముందుగా తమ ఇంటికి ఎంత సామర్థ్యం ఉన్న సోలార్ సిస్టమ్ అవసరమో తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ప్రభుత్వం గుర్తించిన విక్రేతల జాబితా నుంచి నచ్చిన వారిని ఎంపిక చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన తర్వాత దాని స్థితిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ట్రాక్ చేయవచ్చు. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు, విద్యుత్ కనెక్షన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హత ఉన్న లబ్ధిదారులకు కేంద్ర ఆర్థిక సాయం నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఈ విధానాన్నే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) అంటారు.

ఈ పథకంలో మరో ప్రత్యేకత ఏమిటంటే.. దరఖాస్తు ప్రారంభించకముందే ప్రజలకు అవసరమైన సమాచారం అందించే ఏర్పాట్లు చేశారు. ఒక క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా 60 సెకన్లలోపు రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. దీంతో మొదటిసారి సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునే వారికి కూడా ప్రక్రియపై అవగాహన కలుగుతుంది. అంతేకాదు, ఈ పథకం కోసం ప్రత్యేకంగా ఏఐ ఆధారిత వాట్సాప్ చాట్‌బాట్ ‘సన్‌టోష్’ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా వినియోగదారులు తమ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. దరఖాస్తు విధానం, అవసరమైన వివరాలు, సోలార్ ఏర్పాటు ప్రక్రియ గురించి మార్గదర్శకత్వం పొందవచ్చు. ఒకవేళ ప్రక్రియలో ఏవైనా సమస్యలు ఎదురైతే ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థల ద్వారా సహాయం పొందే అవకాశం కూడా ఉంది.

కోటికి పైగా రిజిస్ట్రేషన్లు..

పీఎం సూర్య ఘర్ పథకం కింద ఇప్పటివరకు కోటికి పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానంలో అర్హులైన లబ్ధిదారులకు రూ.28,024 కోట్ల ఆర్థిక సాయం పంపిణీ చేసినట్లు అందించిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 80కి పైగా విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ డిజిటల్ వ్యవస్థతో అనుసంధానమయ్యాయి. ఈ గణాంకాలు దేశంలో రూఫ్‌టాప్ సోలార్ పట్ల పెరుగుతున్న ఆసక్తిని, పథకం పరిధిని తెలియజేస్తున్నాయి. మొత్తంగా చూస్తే పీఎం సూర్య ఘర్ పథకం కేవలం సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడానికి ఆర్థిక సాయం అందించే కార్యక్రమం మాత్రమే కాదు. దరఖాస్తు నుంచి ఇన్‌స్టాలేషన్, సబ్సిడీ జమ వరకు ప్రతి దశను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నం. దీనివల్ల కుటుంబాలు మరింత స్పష్టతతో, నమ్మకంతో సోలార్ విద్యుత్ వైపు అడుగులు వేయవచ్చు.

మీరు కూడా ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే వాట్సాప్ ద్వారా సమాచారం పొందేందుకు https://wa.me/919311106432 లింక్‌ క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. లేదంటే పీఎం సూర్య ఘర్ అధికారిక వెబ్‌సైట్ https://pmsuryaghar.gov.in ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. మరింత సమాచారం కోసం 15555 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 November 2026, 6:02 pm Digital Edition : Prabhanews
PM Surya Ghar Scheme: ఇంటిపై సోలార్ పెట్టుకుంటే సబ్సిడీ మీ బ్యాంక్ ఖాతాలోకే.. ఎలా పొందాలో తెలుసా? | బిజినెస్

Last Updated:Nov 08, 2026 6:01 PM ISTPM Surya Ghar Scheme: ఇంటి కరెంట్ బిల్లులు తగ్గించుకోవాలని చూస్తున్నారా? అయితే పీఎం సూర్య ఘర్ పథకం మీకు ఉపయోగపడుతుంది. ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే కేంద్రం సబ్సిడీ అందిస్తోంది. దరఖాస్తు నుంచి సబ్సిడీ పొందే వరకు అన్ని వివరాలను తెలుసుకునేందుకు ప్రత్యేక పోర్టల్, వాట్సాప్ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది.
News18ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన గురించి తెలుసుకోవాలి. ఈ పథకం ద్వారా ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. అంతేకాదు, అర్హత ఉన్న కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. అయితే చాలామందికి ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేయాలి? సోలార్ ప్యానెల్స్ ఎవరితో ఏర్పాటు చేయించుకోవాలి? సబ్సిడీ ఎలా వస్తుంది? అనే సందేహాలు ఉంటాయి. వీటన్నింటికీ సమాధానంగా ప్రభుత్వం ప్రత్యేక డిజిటల్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది.అన్నింటికీ ఒకటే పోర్టల్‌..పీఎం సూర్య ఘర్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక జాతీయ పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఇంటి యజమానులు, ప్రభుత్వం గుర్తించిన సోలార్ విక్రేతలు, విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కామ్‌లు), సబ్సిడీ పంపిణీ వ్యవస్థలను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకొచ్చింది. దీంతో ప్రజలు వేర్వేరు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చాలా పనులను ఆన్‌లైన్‌లోనే పూర్తి చేసుకోవచ్చు. ముందుగా తమ ఇంటికి ఎంత సామర్థ్యం ఉన్న సోలార్ సిస్టమ్ అవసరమో తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ప్రభుత్వం గుర్తించిన విక్రేతల జాబితా నుంచి నచ్చిన వారిని ఎంపిక చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన తర్వాత దాని స్థితిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ట్రాక్ చేయవచ్చు. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు, విద్యుత్ కనెక్షన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హత ఉన్న లబ్ధిదారులకు కేంద్ర ఆర్థిక సాయం నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఈ విధానాన్నే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) అంటారు.ఈ పథకంలో మరో ప్రత్యేకత ఏమిటంటే.. దరఖాస్తు ప్రారంభించకముందే ప్రజలకు అవసరమైన సమాచారం అందించే ఏర్పాట్లు చేశారు. ఒక క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా 60 సెకన్లలోపు రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. దీంతో మొదటిసారి సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునే వారికి కూడా ప్రక్రియపై అవగాహన కలుగుతుంది. అంతేకాదు, ఈ పథకం కోసం ప్రత్యేకంగా ఏఐ ఆధారిత వాట్సాప్ చాట్‌బాట్ 'సన్‌టోష్'ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా వినియోగదారులు తమ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. దరఖాస్తు విధానం, అవసరమైన వివరాలు, సోలార్ ఏర్పాటు ప్రక్రియ గురించి మార్గదర్శకత్వం పొందవచ్చు. ఒకవేళ ప్రక్రియలో ఏవైనా సమస్యలు ఎదురైతే ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థల ద్వారా సహాయం పొందే అవకాశం కూడా ఉంది.కోటికి పైగా రిజిస్ట్రేషన్లు.. పీఎం సూర్య ఘర్ పథకం కింద ఇప్పటివరకు కోటికి పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానంలో అర్హులైన లబ్ధిదారులకు రూ.28,024 కోట్ల ఆర్థిక సాయం పంపిణీ చేసినట్లు అందించిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 80కి పైగా విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ డిజిటల్ వ్యవస్థతో అనుసంధానమయ్యాయి. ఈ గణాంకాలు దేశంలో రూఫ్‌టాప్ సోలార్ పట్ల పెరుగుతున్న ఆసక్తిని, పథకం పరిధిని తెలియజేస్తున్నాయి. మొత్తంగా చూస్తే పీఎం సూర్య ఘర్ పథకం కేవలం సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడానికి ఆర్థిక సాయం అందించే కార్యక్రమం మాత్రమే కాదు. దరఖాస్తు నుంచి ఇన్‌స్టాలేషన్, సబ్సిడీ జమ వరకు ప్రతి దశను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నం. దీనివల్ల కుటుంబాలు మరింత స్పష్టతతో, నమ్మకంతో సోలార్ విద్యుత్ వైపు అడుగులు వేయవచ్చు.మీరు కూడా ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే వాట్సాప్ ద్వారా సమాచారం పొందేందుకు https://wa.me/919311106432 లింక్‌ క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. లేదంటే పీఎం సూర్య ఘర్ అధికారిక వెబ్‌సైట్ https://pmsuryaghar.gov.in ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. మరింత సమాచారం కోసం 15555 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చు.మరింత చదవండి

Source link