ప్రభన్యూస్

Jio Platforms IPO: బలహీన మార్కెట్‌లోనూ జియో ఐపీఓకు రికార్డు స్థాయిలో ₹7.40 లక్షల కోట్ల డిమాండ్ | బిజినెస్


గత రికార్డును అధిగమించిన జియో..

విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు, ముడి చమురు ధరల పెరుగుదల, అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా ఈక్విటీ మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ జియో ఐపీఓకు వచ్చిన స్పందన మార్కెట్ నిపుణుల అంచనాలను మించింది.

2025 అక్టోబర్‌లో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఐపీఓకు సుమారు ₹4.43 లక్షల కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి. జియో యాంకర్ బిడ్లను మినహాయించి సుమారు ₹4.90 లక్షల కోట్ల విలువైన బిడ్లను ఆకర్షించింది. దీంతో గత రికార్డును దాదాపు ₹47,000 కోట్లతో, అంటే 11 శాతం మేర అధిగమించింది. అదనంగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి సుమారు ₹2.50 లక్షల కోట్ల విలువైన బిడ్లు వచ్చినట్లు సమాచారం.

సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన..

క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIB) విభాగంలో సుమారు ₹3.87 లక్షల కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. ఈ విభాగం 70.55 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఐపీఓ ప్రారంభమైన తొలి 10 నిమిషాల్లోనే ఈ విభాగం పూర్తిగా సబ్‌స్క్రైబ్ కాగా, మొత్తం ఐపీఓ కేవలం 100 నిమిషాల్లోనే సబ్‌స్క్రిప్షన్ దశను అధిగమించింది. అంతర్జాతీయ ఫండ్లు, బీమా సంస్థలు, దేశీయ మ్యూచువల్ ఫండ్ల నుంచి యాంకర్ ఇన్వెస్టర్ల విభాగంలోనూ గణనీయమైన ఆసక్తి కనిపించింది. చివరి రోజు వరకు సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి డిమాండ్ కొనసాగింది.

రిటైల్ పెట్టుబడిదారుల నుంచి రికార్డు దరఖాస్తులు..

వ్యక్తిగత పెట్టుబడిదారుల భాగస్వామ్యం కూడా చరిత్రాత్మక స్థాయిలో నమోదైంది. రిటైల్ విభాగంలోనే కోటి దాటిన దరఖాస్తులు వచ్చాయి. రిలయన్స్ ప్రస్తుత వాటాదారుల కోటాలో 21 లక్షలకు పైగా, ఉద్యోగుల కోటాలో 2 లక్షలకు పైగా దరఖాస్తులు నమోదయ్యాయి.

విభాగాల వారీగా సబ్‌స్క్రిప్షన్ వివరాలు ఇలా ఉన్నాయి:

– రిటైల్ విభాగం: 2.72 రెట్లు

– వాటాదారుల కోటా: 7.60 రెట్లు

– ఉద్యోగుల కోటా: 2.93 రెట్లు

– సంస్థాగత పెట్టుబడిదారుల విభాగం (QIB): 70.55 రెట్లు

– మొత్తం ఐపీఓ: 22.19 రెట్లు

ప్రపంచంలోనే కోటి దాటిన దరఖాస్తులను అందుకున్న తొలి ఐపీఓగా జియో నిలిచిందని ప్రకటన పేర్కొంది.

పూర్తిగా ఫ్రెష్ ఇష్యూ..

ఈ ఐపీఓలో మరో ప్రత్యేకత ఏమిటంటే, ఇది పూర్తిగా ఫ్రెష్ ఇష్యూగా రూపొందించబడింది. అంటే ప్రస్తుత వాటాదారులు తమ వాటాలను విక్రయించలేదు. ఐపీఓ ద్వారా కొత్త షేర్లను జారీ చేసి నిధులను సమీకరించే విధానాన్ని అనుసరించారు. సబ్‌స్క్రిప్షన్ వివరాలు కూడా రోజురోజుకూ పెరిగాయి. మొదటి రోజు 3.16 రెట్లు, రెండో రోజు 5.57 రెట్లు సబ్‌స్క్రిప్షన్ నమోదవగా, మూడో రోజు ముగిసే సమయానికి అది 22.19 రెట్లకు చేరింది.

అక్టోబర్ 26న షేర్ అలాట్‌మెంట్.. 28న లిస్టింగ్?

రికార్డు స్థాయి స్పందనతో ఐపీఓ ముగియడంతో ఇప్పుడు పెట్టుబడిదారుల దృష్టి షేర్ల కేటాయింపు, స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్‌పై కేంద్రీకృతమైంది. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 26న షేర్ అలాట్‌మెంట్, అక్టోబర్ 28న స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ ప్రతిపాదించినట్లు సమాచారం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 October 2026, 3:19 pm Digital Edition : Prabhanews
Jio Platforms IPO: బలహీన మార్కెట్‌లోనూ జియో ఐపీఓకు రికార్డు స్థాయిలో ₹7.40 లక్షల కోట్ల డిమాండ్ | బిజినెస్

గత రికార్డును అధిగమించిన జియో..విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు, ముడి చమురు ధరల పెరుగుదల, అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా ఈక్విటీ మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ జియో ఐపీఓకు వచ్చిన స్పందన మార్కెట్ నిపుణుల అంచనాలను మించింది.2025 అక్టోబర్‌లో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఐపీఓకు సుమారు ₹4.43 లక్షల కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి. జియో యాంకర్ బిడ్లను మినహాయించి సుమారు ₹4.90 లక్షల కోట్ల విలువైన బిడ్లను ఆకర్షించింది. దీంతో గత రికార్డును దాదాపు ₹47,000 కోట్లతో, అంటే 11 శాతం మేర అధిగమించింది. అదనంగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి సుమారు ₹2.50 లక్షల కోట్ల విలువైన బిడ్లు వచ్చినట్లు సమాచారం.సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన..క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIB) విభాగంలో సుమారు ₹3.87 లక్షల కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. ఈ విభాగం 70.55 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఐపీఓ ప్రారంభమైన తొలి 10 నిమిషాల్లోనే ఈ విభాగం పూర్తిగా సబ్‌స్క్రైబ్ కాగా, మొత్తం ఐపీఓ కేవలం 100 నిమిషాల్లోనే సబ్‌స్క్రిప్షన్ దశను అధిగమించింది. అంతర్జాతీయ ఫండ్లు, బీమా సంస్థలు, దేశీయ మ్యూచువల్ ఫండ్ల నుంచి యాంకర్ ఇన్వెస్టర్ల విభాగంలోనూ గణనీయమైన ఆసక్తి కనిపించింది. చివరి రోజు వరకు సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి డిమాండ్ కొనసాగింది.రిటైల్ పెట్టుబడిదారుల నుంచి రికార్డు దరఖాస్తులు..వ్యక్తిగత పెట్టుబడిదారుల భాగస్వామ్యం కూడా చరిత్రాత్మక స్థాయిలో నమోదైంది. రిటైల్ విభాగంలోనే కోటి దాటిన దరఖాస్తులు వచ్చాయి. రిలయన్స్ ప్రస్తుత వాటాదారుల కోటాలో 21 లక్షలకు పైగా, ఉద్యోగుల కోటాలో 2 లక్షలకు పైగా దరఖాస్తులు నమోదయ్యాయి.విభాగాల వారీగా సబ్‌స్క్రిప్షన్ వివరాలు ఇలా ఉన్నాయి:- రిటైల్ విభాగం: 2.72 రెట్లు- వాటాదారుల కోటా: 7.60 రెట్లు- ఉద్యోగుల కోటా: 2.93 రెట్లు- సంస్థాగత పెట్టుబడిదారుల విభాగం (QIB): 70.55 రెట్లు- మొత్తం ఐపీఓ: 22.19 రెట్లుప్రపంచంలోనే కోటి దాటిన దరఖాస్తులను అందుకున్న తొలి ఐపీఓగా జియో నిలిచిందని ప్రకటన పేర్కొంది.పూర్తిగా ఫ్రెష్ ఇష్యూ..ఈ ఐపీఓలో మరో ప్రత్యేకత ఏమిటంటే, ఇది పూర్తిగా ఫ్రెష్ ఇష్యూగా రూపొందించబడింది. అంటే ప్రస్తుత వాటాదారులు తమ వాటాలను విక్రయించలేదు. ఐపీఓ ద్వారా కొత్త షేర్లను జారీ చేసి నిధులను సమీకరించే విధానాన్ని అనుసరించారు. సబ్‌స్క్రిప్షన్ వివరాలు కూడా రోజురోజుకూ పెరిగాయి. మొదటి రోజు 3.16 రెట్లు, రెండో రోజు 5.57 రెట్లు సబ్‌స్క్రిప్షన్ నమోదవగా, మూడో రోజు ముగిసే సమయానికి అది 22.19 రెట్లకు చేరింది.అక్టోబర్ 26న షేర్ అలాట్‌మెంట్.. 28న లిస్టింగ్?రికార్డు స్థాయి స్పందనతో ఐపీఓ ముగియడంతో ఇప్పుడు పెట్టుబడిదారుల దృష్టి షేర్ల కేటాయింపు, స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్‌పై కేంద్రీకృతమైంది. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 26న షేర్ అలాట్‌మెంట్, అక్టోబర్ 28న స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ ప్రతిపాదించినట్లు సమాచారం.

Source link